అందమైన ఆంధ్ర టు అద్భుతమైన అమెరికా

Jaldu Nagamani (జల్దు నాగమణి)

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereఒక రోజు అమెరికాలో ఉన్న మా వదినగారినుండి అక్కడే ఉన్న మా అమ్మకు చాలా సీరియస్గా ఉన్నట్టు ఫోను. అదేరోజు అమెరికాలో ఉన్న మా తమ్ముడినుండి email మా అమ్మ condition బాగాలేదని.

నాకు ఒకటే బాధ. వేలమైళ్ళదూరంలో ఉన్న అమ్మని చూడడం ఎలాగా అని. శ్రీరాముడు లంకచేరడానికి వారధి దాటినట్లు visa అనే వారధి దాటి ఎలారావడం. ప్రతిరోజు అమ్మగురించి ఏడుపే. చివరకి sponsorship papers రాగానే శ్రీవెంకటేశ్వరస్వామికి ఎన్నో మృక్కులు మృక్కుకొని "స్వామీ అమ్మని చూడడానికి ఈ ఒక్కదారిని దాటించు" అనివేడుకొని visa కి ప్రయాణం అయి visa రాగానే అమ్మని చూసినంత ఆనందం. అమెరికాలో అడుగుపెట్టగానే నాకు ఎంతో సంతోషం plus ఆత్రుత. అమ్మ ఎలా ఉందోనని.

అమ్మని ఆసుపత్రిలో చూసేసరికి చాలా ఏడుపువచ్చింది. 7 సంవత్సరాల తరువాత చూసినందుకు. నేను చెప్పగానే నాపేరుపెట్టి "మణీ" అని పిలిచింది. ఎంతో సంతోషించేను. I.C.U. నుండి తేరుకొని అమ్మ nursing home కి వచ్చేసరికి మా ఆనందం చెప్పలేనిది.

World Trade Center చూసినప్పుడు కళ్ళనీళ్ళు ఆగలేదు. అంత అద్భుత కట్టడాలని కూల్చి లక్షలమంది చావుకికారణం అయిన వాళ్ళని తెచ్చి అక్కడే పాతేయ్యాలన్నంత ఆవేశం వచ్చిందినాకు.

అమ్మ కోలుకోవడం మొదలుపెట్టేక, మా అన్నయ్యా అప్పటికే కొని యిచ్చినవికాక మా అన్నయ్య వదిన గార్లు యిచ్చిన డాలరల్తో మా shoppingలు, అమెరికా చూడ్డం మొదలుపెట్టేము.

Statue of Liberty చూస్తూ ఉంటే ఆ ferryలో వెళ్తూ ఎంతో enjoy చేసేము.

Pittsburgh స్వామివారి దర్శనం మనసుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆ స్వామి దయవల్ల అమ్మకోలుకుంటున్నదని. తిరుపతికి వెళ్ళి శ్రీవారిని చూసినట్టే అనిపించింది.

అమెరికాలో busy life చూస్తే ఎంతో కష్టమనిపించింది. కష్టపడి సంపాదిస్తారు. కాని కుటుంబంలోని వారితో కలసి గడపడానింకి టైమే ఉండదు.

మేము ఆరుగురు అక్కచెల్లేళ్ళము నలుగురు అన్నదమ్ములు. అందులో ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కలు ఇదివరకు నుండి అమెరికాలోనే ఉన్నారు. మిగతా నలుగురు అక్కచెల్లెళ్ళము, మా పెద్ద అన్నయ్య, ఆంధ్రనుండి మా అమ్మని చూడడానికి వచ్చేము. అమ్మని మాకు చూపించగలిగినందుకు అమెరికాలోనే ఉన్న మావాళ్ళకి ఎంతో ఆనందం. మమ్మల్ని ఎక్కడికో తీసుకువెళ్ళి అన్నీ చూపించాలని తాపత్రయం వాళ్ళకి. కానీ యిక్కడ busy lifeతో అది సాధ్యం కాకపోయినా సాధ్యం చేసుకొని అమెరికాలో చాలా వరకు అన్ని చూపించేరు.

నయాగరా ఫాల్స్‌ ప్రయాణం చాలా బాగుంది. ఆ జలపాతాలలో పిల్లా పెద్దా కేరింతాలతో అదో అద్భుత దృశ్యం, అనుభవం.

మేము ఆంధ్రనుండి తెచ్చిన అరిసెలు, ఆవకాయలు suitcase ల్లో మా వాళ్ళు కొనియిచ్చిన laptop లు digital camera లు తో మాదేశానికి ప్రయాణం అవడం నిజంగా అద్భుతమే. చపాతీలు లోనుంచి వచ్చిన మేము యిక్కడ pizza లు burger లు subway లు బాగాతిని burgers లా తయారు అయి తిరిగి ఆంధ్ర వెళ్ళడం అద్భుతమే.

Typing కూడా రానినేను chatting లు, emails నేర్చుకొని ఆంధ్రకు వెళ్ళడం అద్భుతమే

అన్నయ్యల ఆప్యాయత వదినమ్మ ఆంధ్రవంటలతో కడుపార ఆరగించి shopping ల మీద పడ్డాము. ఒకరోజు మేము Edison లో shopping ఎంతో ఆనందంగా ముగించుకొని వస్తూ ఉంటే ఒకామె bloody Indian bugs are all over America అంది. అలా అన్న ఆమెకూడా వేరేదేశంనుండి వచ్చినదే. మాకు చాలా కష్టమనిపించింది.

Americans నాకు చాలా నచ్చారు. ఎంతో pleasing గా నవ్వుతూ అందరిని పలుకరిస్తారు. ఎవరితో గొడవ పడడం నేనుచూడలేదు. ఆసుపత్రిలో nurses ని doctors ని చూస్తూ ఉంటే మాకు చాలా సంతోషమనిపించింది.

Shopping లకు వెళ్ళిరాగానే ఆ వస్తువులన్ని అమ్మకి ఆసుపత్రిలో చూపించి "యీ bag నచ్చిందా? నీకోసమే" అని చూపించడం, అమ్మకి మాట్లాడే శక్తిపోయినా hand bag ఆమెచేతులపై పెట్టడం, కొత్తచీర చూపించి, ఆమె చీరలు కట్టడం మాని చాలాకాలమైనా "ఈ చీరనచ్చిందా" అని అడగడం, అమ్మకి యింక ఫరవాలేదనే ధైర్యం వచ్చింది.

Shopping లకి వెళ్ళడం నేను కొన్నవాటికంటే మా sisters కొనుక్కొన్నవే నాకు నచ్చడం. సినిమాలకి కూడా వెళ్ళని నేను, ఇక్కడ bollywood show లకు మా అన్నయ్య కూతురు తీసుకొనిపోగా వెళ్ళడం, Mets Matches చూడడం కూడా అద్భుతమే. Shopping లలో అన్నీ ఎంతో సరదాపడి కొనేశాము. మళ్ళీ అవి return చేసి exchange కోసం తిరగడం, మళ్ళీ కొత్తవి తేవడం, ఇలా చేస్తూ ఉండగానే 3 నెలలు గిర్రున తిరిగి పోయాయి. తిరుగు ప్రయాణం దగ్గరయ్యేసరికి High BP వచ్చింది. ఎందుకో చెప్పుకోండి చూద్దం .. నేనే చెప్పేస్తా, మళ్ళీ నేను అమెరికా ఎప్పుడు వస్తానో ఏమిటో అని.

మేము కొన్న వస్తువుల్లోనూ, అన్నయ్యలు, తమ్ముడు యిచ్చిన gifts లోను customs వాళ్ళు ఏమితీసేస్తారో, దేనికి ఎన్నిడాలర్లు కట్టాలో అనే BP.

అన్నదమ్ముల ఆప్యాయత, అక్కచెల్లెళ్ళ మధ్య చిట్టి పొట్టి కలహాలు, హాస్యాలు నవ్వులు, కేరింతలతో యిట్టేగడచిపోయింది.

ఇప్పుడు అమెరికావదలి వెళ్ళాలంటేనే చాలా బాధగా ఉంది. మొట్టమొదట నాకు, మా అన్నయ్య మా అమ్మ అమెరికా వచ్చినప్పుడు ఎంత బాధ పడ్డానో యిప్పుడు మళ్ళి అన్నయ్యని, అమ్మని వదలి వెళ్ళాలంటే అంత బాధగా ఉంది.

Bye Bye to America అని చెప్పాలని లేదు.

Bye for now

But - మళ్ళీ త్వరలోనే రావడానికి ప్రయత్నిస్తా
అత్యద్భుత దేశంలో
మెరపుకన్న వేగమున్నకనం
రిధంకు తగ్గట్టూ ఆడేజనం
కాసులకోసం పరిగెత్తే హనం