In this series, we would like to bring you golden oldies from early issues of Telugu Velugu, the news journal of the Telugu Literary and Cultural Association. We are indebted to Nehru Cherukupalli garu, who has lovingly preserved these old issues and made them available for republication. Publishing these in this electronic form will, we hope, allow a new generation of Telugu lovers to enjoy these classics.

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here



అమెరికా అల్లుడు ఉగాది సందడి

(Published July 1982)

మనవాళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చిన తరువాత మన సంస్కృతిని మరచి మనవాళ్ళని చూడటానికి మనదేశానికి వెళ్ళినపుడు చాలా వింతగా ప్రవర్తిసూవుంటారు. అక్కడ పుట్టిపెరిగినా, అక్కడి పద్ధతులు మరచి పెద్దవాళ్ళని కించపరుస్తూ ప్రవర్తిస్తూవుంటారు.

అమెరికానుంచి అమ్మాయి, అల్లుడు వస్తారని ఎంతో ఎదురుచూస్తున్న వారికి అల్లుడు ప్రవర్తన చూసి ఆశ్చర్యం కలగడమే కాకుండా, అతని ఇబ్బందిని చూడలేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఏమీచేయలేక కంగారు పడుతూ వుంటారు. New Year కి champagne లేదు, పైగా పంచాంగశ్రవణం కూడానా నాప్రాణానికి అనుకుని నిరాశపడే అల్లుడూ, ఇవన్నీచూసి ఎంతమారిపోయారో మనవాళ్ళని ఆశ్చర్యపోతూ అంతా అమెరికామహత్యం అనుకునే ఆ బామ్మగారి ఆవేదనా ... చదవండిమరి ..

మొదటి రంగము

మోహన్‌: కల్యాణీ! అమ్మాయి, అల్లుడు వచ్చారు. గోవిందం! కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళుపట్టుకురారా. రండి రండి ! రామ్మరా!

కళ్యాణి: అయ్యో! ఎంతచిక్కిపోయావే తల్లీ! ఎంతయినా చేసి ఇంత కంచంలో పెడితే ఆతిండేవేరు. రామ్మా రా, కాళ్ళుకడుక్కుందువుగాని.

మోహన్‌: రండి! కాళ్ళు కడుక్కుందురుగాని

పరమేశం: No thanks. Oh boy! These people never change (తనలో తను అనుకుంటున్నాడు)

బామ్మ: బావున్నావా నాయనా?

మోహన్‌: కూర్చోండి. ప్రయాణం బాగా అయిందా? కొంచెం కాఫీ తీసుకుంటారా? కల్యాణీ! గోవిందంతో కాఫీ పంపు!

[గోవిందం: కాఫీ పట్టుకొచ్చి టేబుల్‌మీద పెట్టబోతూంటే]

పరమేశం: wait, wait! first clean the table. oh boy! too many flies

గోవిందం: ఏటీ బాబూ అంటారు? నాకా ఇంగిలిపీసు రాదయ్యే! తెనుగులో సెప్పండి బాబో!

మోహన్‌: ముందర బల్లతుడు. ఎన్నిసార్లు చెప్పాలిరానీకు! ఈగలవీనూ శుబ్భ్రంగాతుడు.

గోవిందం: ఎదేటి బాబుగారో! బల్లమీద ఈగలు ఆలక ఏనుగులు ఆలతాయా బాబో! అయినా వుండండెహె! నిమిసంలో తుడిసేత్త్ను. అల్లుడుగోరో! అమరికాలో అస్సలు ఈగలుండ్వాండయ్య?

పరమేశం: Never! అంతా clean

గోవిందం: అయ్యగోరో! నాకు తెలవక అడుగుతాగానే, అమరికాలో పనోళ్ళుండరట గదయ్య! అన్నీ మిసిన్లే సేసేత్తయంట. మరినాలాటోళ్ళు బతికేదట్లయ్యా?

కళ్యాణి: గోవిందం! ఇంకనీళ్ళుపెట్టు అల్లుడుగారికి (లోపలనుంచి)

గోవిందం: వస్తున్నానండమ్మా! (వెళతాడు)

మోహన్‌: స్నానంచేద్దురుగాని లెండి. కొంత బడలిక్‌ తగ్గుతుంది.

రెండవ రంగము

గీత: అబ్బా! ఆ స్నానాలగదిలో మావారు ఎలా స్నానంచేస్తారమ్మా? నాకే కష్ఠం.

కళ్యాణి: మనకున్నదది. నీకుతెలియనిదేముంది? ఏదో ఈ నాలుగు రోజులూ సర్దుకోవాలి మరి. ఏంచేస్తాం చెప్పు?

బామ్మ: బావున్నావామ్మా గీతా? అయ్యొ! అయ్యొ! అదేమిటే ఆ బట్టలూ? నిండా పమిటలేకుండా.

గీత: పో బామ్మా! నీకేంతెలియదు మూడువందలరూపాయల dress ని పట్టుకుని అలా అంటావేమిటి?

బామ్మ: ఏం మూడువందలో ముక్కచక్కలో! ఒంటినిండా బట్టేలేదాయే. ఆ జుట్టేమిటే తల్లీ! అట్టావిరబోసుకుని తిరిగితే దయ్యాలడతాయంటారు. ముందు ఇలారా చక్క జడేస్తా. అయ్యొ! అయ్యొ! నాలుగు వేళ్ళ వెడల్పున బారెడు జుట్టు వుండేదిగదే! అవ్వ! అంతా కత్తిరించిపెట్టావు. ఆ చెప్పులేమిటే తల్లీ! పడేవు. నెమ్మదిగా నడు.

సంగీత: నీకు తెలియదు లే బామ్మ! అదంతా అమెరికా ఫ్యాషను.

బామ్మ: ఏమోనమ్మ! ఏం ఫ్యాషన్లో! నిండా ఓ బట్ట, ఓ జడా, ఓ పూలా! అదిసరేగానీ, అదేమిటే అబ్బాయి నోట్లో అంత పొడుగ్గావుంది? అదే అమెరికా చుట్టా?

వసంత్‌: పైప్‌ అంటారు బామ్మా! చుట్టలాంటిదే అంతా స్టైల్‌ లే

బామ్మ: నీకెలా తెలుసురా ఇవన్నీ? నానాయినే! అమెరికా వెళ్ళకుండానే అన్నీ తెలుసురానీకూ! నా తండ్రి! ఆదిక్కుమాలినవన్నీ నేర్చుకోబాకునాయనా.

మూడవ రంగము

బామ్మ: రండర్రా! అందరికీ వేపపూవు పచ్చడి పెడతాను [అందరికీ పెడుతూ ఇంటి అల్లుడుదగ్గిరకొచ్చేసరికి] చెయ్యలా పెట్టవయ్యా వేపపూవు పచ్చడి పెడతాను!

పరమేశం: I can't eat

బామ్మ: మోహనూ! అబ్బాయి ఏమంటున్నాడురా? నాకాదొరల భాషరాదయ్యో!

వసంత్‌: బావగారు తినలేనూ అంటున్నారు బామ్మా! ప్లేట్లు, స్పూన్లూ, ఫొర్కులు లేకుండా పెట్టావుగా!

మోహన్‌: హూం .. వేళాకోళాలు ఆపు

సంగీత: మరయుతే తినమనుచూద్దాం

పరమేశం: (మొహమంతా చిట్లించుకుని తింటాడు) I want some water నీళ్ళు. మంచినీళ్ళూ (వగరుస్తూ)

సంగీత: బావగారికి దెబ్బకి తెలుగు వచ్చిందే

బామ్మ: నువ్వుండవే సంగీతా. అలా అనకూడదునాయనా! దీంట్లో పులుపు, చేదూ, తీపి అన్నీ వుంటాయి. అంటే ఈ సంవత్సరంలో కష్ఠం, సుఖం అన్నీ వుంటాయని. అన్నిటినీ సమంగా తీసుకుని కలిపి అనుభవించూ అని అర్థం. పెద్దలు చెప్పిన దాంట్లో ఎంత అర్ధముందో చూశారా?

కళ్యాణి: గీతా! సంగీతా! అందరు రండమ్మా భోజనాలు చేద్ద్రుగాని, పొద్దుబోయిందిప్పటికే (లోపలనుంచి)

నాలుగవ రంగము

బామ్మ: అదేం సోద్యమే! మీ ఆయన అన్నం తినటానికి అంతకష్ఠపడ్డాడు. మీ అమెరికాలో అన్నంతినరా?

సంగీత: లేదు బామ్మా! బావగారికి టేబుల్సు , కుర్చీలు వుండాలిగాని కిందకూర్చుని తినలేరుట.

కళ్యాణి: సంగీతా! ఒకసారిలా రామ్మా!

బామ్మ: ఇదెక్కడి సోద్యమే! పాడిపర్రులో పుట్టిపెరిగి, కూర్చుని అన్నం తినటం చాతకాకపోవడమేమిటే? ఇది అమెరికా మహత్యమేనా?

గీత: అలాకాదు బామ్మా! రోజూ టేబుల్‌ మీల్స్‌ అలవాటయ్యి కష్ఠంగా వుంటుంది. అందులో చేత్తో తినడం. అయినా నీకేం తెలియదులే బామ్మా!

బామ్మ: ఎంతపెద్ద దానివయ్యావే! నన్నే తెలియదంటున్నావు. అదిసరేగానీ నువ్వూ సరిగ్గా అన్నంతిన్నావేకాదే!

గీత: చెప్పానుగా బామ్మా!

బామ్మ: అయ్యొ! అయ్యొ! ఎంతమారిపోయావే, శుబ్భరంగా బాస్పిటేసుకుని కూర్చుని తినేదానివి జుర్రుకుంటూనూ. అంతా అమెరికామహత్యం కాబోలు (గొణుక్కుంటూ)

గీత: Paul! movie కి పోదామా?

బామ్మ: పాలు ఎవరే?

గీత: ఎవరోకాదు మావారే

వసంత్‌: అదే బామ్మా! పరమేశంకి వచ్చిన తిప్పలు. పాలు కాదు పాల్‌

బామ్మ: ఇదెక్కడి సోద్యమే! లక్షణంగా పరమేశ్వరుడి పేరు పెట్టుకుని ఈ పాలు, నీళ్ళూ ఏమిటే? అయినా భర్తని పేర్లు పెట్టి పిలవచ్చా? అవ్వ! ఇదీ అమెరికా మహత్యంకాబోలు. ఇంకా శాస్త్రిగారు వచ్చారేకాదు! వత్తులయినా చేసుకుంటానీలోపు. నారాయణ, నారాయణ.

ఐదవ రంగం

[మామ, అల్లుళ్ళు కూర్చునివుంటారు. శాస్త్రిగారు వస్తారు]

మోహన్‌: రండి శాస్త్రిగారు రండి. నమస్కారం. కూర్చోండి. కల్యాణీ! శాస్త్రిగారు వచ్చారు.

కళ్యాణి: నంస్కారం. కులాసానా?

పేరయ్య శాస్త్రి: ఆ ఆ ..! కులాసానెనమ్మా! శుభం. దుందుభి సంవత్సరశుభాకాంక్షలు.

కళ్యాణి: తమరు ఏమి పుచ్చుకుంటారు? పాలా? మజ్జిగా?

పేరయ్య శాస్త్రి: కొంచెం మజ్జిగ చాలమ్మ! ఎవరు బాబూ వీరూ?

మోహన్‌: మా అల్లుడుగారు. అమెరికానుంచి వచ్చారు. డక్టరు. పేరు పరమేశం. వీరు పేరిశాస్త్రిగారు. బాగా చదువుకున్న పండితులు. పంచాంగశ్రవణంకని పిలిచాను కొత్త సంవత్సరంకదా!

పరమేశం: New Year, no champagne, పంచాంగశ్రవణం too! Oh my God!"

పేరయ్య శాస్త్రి: శివశివ! విదేశాలువెళ్ళీ మన సంస్కృతిని మరచి మీరు నేర్చుకున్నదిదా? ఏదో పెద్ద చదువులు చదివి విజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారనుకున్నాను.

బామ్మ: బాగా చెప్పారు శాస్త్రిగారూ! ప్రొద్దుటనుంచీ బుగ్గలునొక్కుకోడంతోనే సరిపోయిందంటే నమ్మండి. ఎంత మారి పోయారో మన వాళ్ళు. అంతా అమెరికా మహత్యం కాబోలు

పరమేశం: ఇదంతా nonsense. గీతా! let's go to movie. Bye శాస్త్రులు గారూ!

గీత: Bye బామ్మా!

పేరయ్య శాస్త్రి: అయ్యో! అయ్యో! పండగపూట పంచాంగశ్రవణం లేకుండా ఈ దిక్కుమాలిన సినిమాలేమిటి!?

పేరయ్య శాస్త్రి, బామ్మ: (ఇద్దరు కలసి) అంతా అమెరికా మహత్యం