Amma

Manju Kondapi

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here



అమ్మ .. మంజు కొండపి

అనురాగాల అందమైన జగతిలో
మమతల దీపం అమ్మ
మెరిసే నక్షత్ర వినీలాకాశంలో
పున్నమి జాబిలి అమ్మ

రంగు రంగుల విరిసే కుసుమాలలో
చిమ్మే గంధం అమ్మ
చిగురుటాకులలో సుమధురంగా వినిపించే
కోకిల గానం అమ్మ

ప్రశాంతమైన కోవెల కొలనులో
అందమైన తామర అమ్మ
ఆహ్లాదం చిందే పసిపాప
మోములోని దరహాసం అమ్మ

ప్రాభాత వుషోదయంలో
తొలి రవికిరణం అమ్మ
సంధ్యా సాయంత్రంలో
విరిసే వెన్నెల అమ్మ

ప్రేమ, మమతా, ఆప్యాయతా
అనురాగాల కౌగిలి అమ్మ
మన ప్రతి విజయం వెనుకా
కారణభూతి అమ్మ

మన ప్రగతిని కాంక్షించే
దీవెనల అంబరి అమ్మ
ఈ విశాల విశ్వంలో
సాటిలేని, పోటీలేని వున్నత స్తానంలో
దేముడు మలచిన తన ప్రతిరూపం అమ్మ