రైతు బిడ్డ

Nannapanneni Ankineedu Prasad

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereనే రైతు బిడ్డను
దున్నేది మట్టిగడ్డను

పొయ్యేది పొలము
వచ్చేది బలము

తెచ్చేది ధనము
పెరిగేది గుణము

నా చేను మిన్న
నా మేను కన్న

నా మాగాణి
విరిసిన పూబోణీ

నా మెట్ట
అన్నిటికి దిట్ట

ఈ పంటకాలువ
ఎంతో గొప్ప విలువ

ఈ పైరగాలి
కావాలనిపిస్తుంది నాకు చెలి

మా చావడి
అది మాకు పెద్దబడి

పట్టామక్కడ బలపాలు
దిద్దాము ఓనమాలు

తోలేది బండి
కొట్టగలను కొండలను పిండి

నా కోడెదూడలు
నాకవి రెండు కన్నులు

చెర్మాకోల చెళుకుమనిపిస్తాను
చెంగణాలు దూకిస్తాను

కట్టేది అరక
దున్నేది మెరక

పట్టేది నాగలి
తినేది పొంగలి

పట్టేది గొర్రు
చల్లేది వెత్తు

వాడేది గుంటక
అమ్మేది పిల్లమొక్క

నాటేది నారు
వేసేది ఎరువు

పెట్టేది నీరు
అయ్యేది పైరు

పట్టేది కొడవలి
కోసేది పంటమడి
మేసేది మోపు
వేసేది కుప్ప

నూర్చేది పంట
చేర్చేది యింట

కట్టేది కడెము
అయ్యేది వాము

మేసేది ఆవు
ఇచ్చేది పాలు

తాగేది శిశువు
పెరిగేది ఆయువు

తీరింది కష్టం
వచ్చింది లాభం

పంచుకుందామందరం
కలిసుందామందరం

నేనీనేలకు రాజు
ఈ నేలంటే గొప్ప మోజు

అంటారందరు కాపు
భయమేలేదు రేపు