బండరాయి స్వగతం

శ్రీ భమ్మిడిపాటి కామేశ్వరి (Bhammidipati Kameshwari)

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here


రాయి రాయి బండరాయంటు
రవ్వసేయుటగాని
రాయిజు గూడ గుండె ఉండునని
రవ్వంత యోచించదెందుకీ
రాలుగాయు జనావళి, మూర్ఖ మానవాళి ||రాయి రాయి||

ఆకృతిలేని ప్రకృతివరంనేను
ఆశ్రీరాము పాదమూసోకిన
పునీత అహల్యాసాధ్వి
రూపాంతరమే నేను ||రాయి రాయి||

రాటుదేలిన శిల్పిచేతి ఉలితో
రమ్యసుమనోహర సుందరకృతులంది
రసికరాజుల రంజిల్లజేయు
ప్రకృతి వరమ్మునేను ||రాయి రాయి||

వలువల మలినాలు బాపిమెరిపింపజేయు
రజకుపాలిటి
వరమైన చాకిరిబండనునేను ||రాయి రాయి||

ప్రణయ జీవులు ప్రేమస్రాగాల
పులకించు తల్పతుల్యమేనేను
హృదయముండీలేని
హీనుల బోల్చి హేయపరిచేరు ||రాయి రాయి||

అందచందాల విరాజిల్లు
ఆకాశహర్మాల ఆలంబననేను
ఉరుకుల నురుగుల పరుగులెత్తు
సంద్రమ్మునె అదుపుజేయు
చెలియలికట్ట పునాదినేనేను ||రాయి రాయి||

పల్లెప్రజల పిచ్చాపాటీల సేదదీర్చు
ముచ్చటైన రచ్చబండనేను
పలువిధాల మేలుబొంది
పరిపరివిధాల
కించపరికేరు నన్ను
ఈ మూర్ఖజనావళి ||రాయి రాయి||