Bhajagovindam
Part 2

Ramakantha Rao Chakalakonda

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here(We will publish Sree Ramakaantharao gari translation and commentary on the Bhajagovindam in several installments. He has translated this work into poetic Telugu, as well as easy to understand English. Please be sure to look for them in the upcoming months .. Editor)2. mUDha jahiihi dhanaagamatRishhNaaM
kuru sadbuddhiM manasi vitRishhNaam.
yallabhase nijakarmopaattaM
vittaM tena vinodaya chittam.

మూఢ జహీహి ధనాగమతృష్ణాం, కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్
యల్లభసే నిజ కర్మోపాత్తం, విత్తం తేన వినోదయ చిత్తమ్


3.అర్ధము కొఱకు వ్యర్ధము చేయకు
మానవ జన్మము మూర్ఖమతీ,
పరమార్ధము పరమాత్ముని చరణము,
సంపాదించుము శీఘ్రగతి

4.ధన సంపాదన ధ్యేయము వదలి,
తృప్తిని ఎదలో గడించుము,
ఆశలు వీడిన హృదయము లోన,
ఆనందమెగ మధుర గతి

5.లక్షలకొలది ఆర్జన చేసిన,
లావుకాదు నీ లలాటము
లాలస వీడి లక్ష్మీపతిని
లోచన చేసిన వివేకము

6.ఉన్నదానితో తృప్తిని పొందే
వివేకవంతుడే ఉత్తముడు,
మోహము వీడిన ముముక్షువే హరి
ముంగిట చేరే సమర్ధుడు.

7.కలుష కర్మలతో కట్టిన మూటలు,
కాటికి వచ్చునా కౄరమతీ ?
పాపపు పుట్టలు పెరుగుటే గాని,
పొందిన దేది పున్నె మతీ ? ||స్మరించు||హృదయమున తృప్తిలేని వారికి ఎంతయున్నను సుఖము, సంతోషము రావు. ధన సంపాదనలో చిక్కిన జీవికి, ఆశ వదలదు, ఆశ వదలనిచో తృప్తి చేకూరదు, తృప్తి లేనిచో ఎంత గడించిన సంతోషము రాదు. కనుక ఆశ ఆధ్యాత్మిక సాధనకు ప్రతిబంధకమగును. కోట్లు గడించినా కాటికి చిల్లి గవ్వరాదు గదా, ఆ సంపాదనకు చేసిన కౄర కర్మల వల్ల పాపపు మూటలు పెరిగి, ఆవి మాత్రము మనతో వచ్చును. కనుక ఉన్న దానితో తృప్తి పడుచు, బ్రతుకుటకు మాత్రము ఎంత గావలెనో అంత మాత్రమే సంపాదించుచూ, మనసు భగవధ్యానము పై మళ్ళించిన వాడే, నిజమైన ధన్య జీవి. లక్షలు గడించిన మాత్రమున నీ ప్రభావము అధికము గాదు, నీ కీర్తి చిరస్థాయిగా మిగులదు. ఎందరో రాజులు, ప్రభువులు, కోటిశ్వరులు, లక్షాధికారులు ఎంతమందో కాల గర్భములో కలసి పోయారు. వారి పేర్లు, వూర్లు గూడా ఎవరికి తెలియదు. మరి త్యాగధనులు, హరి దాసుల పేర్లో, అవి ఆచంద్రార్కము భువిలో చిరస్థాయిగ మిగులుట లేదా? అందుకే పోతన గారు అన్నారు:-

‘కారే రాజులు, రాజ్యముల్ కలుగవే, గర్వోన్నతిం బొందరే
వారేరి, సిరి మూట గట్టుకొని పోవంజాలిరే, భూమి పై పేరైనం గలదే … `

యీనాడు మనం కళ్ళార చూస్తున్నాము, కండ, అండ, ధన, మద బలంతో, మంచి వారిని అణగ ద్రొక్కి, అధికార పగ్గాలను చేత బట్టి, అరాచకాలు సృష్టిస్తూ, ధనాన్ని సంపాదిస్తున్న ఎందరో, అదే రీతిలో అకాల మరణాల పాలై, ఎంత దైన్య స్థితినొందు చున్నారో ! బ్రతికి వున్నా వారికి శాంతి లేదు, ఎప్పుడు ఎవరి వల్ల అపకారం జరుగుతుందో అని ప్రతిక్షణము భయ పడుతూ బ్రతుకుతారు, అత్యంత హీన మైన చావు చస్తారు. కనుక, సంపాదనకు, సమయము వృధా చేయక, హరి ధ్యానము పై మనసును మళ్ళించుము.

Dear friend! Don’t waste your valuable time for earning money, what ever money you acquire, it is going to be waste, you are not going to carry with you even a single coin, when you die. Leave off the desire for accumulation of wealth; create in the mind thoughts about Reality, devoid of passion. Give up your thirst to amass wealth, devote your mind to thoughts to the Real. Be content with what comes through actions already performed in the past. Satisfy your mind with what you have achieved through your past deeds. The money you earn either with your hard work, or what ever way, good or bad means, is not going to be carried with you, after death. What you carry with you is the fruits of good works you do either for society, fellow humans or service to GOD. First of all where there is an end for earning money, the more you earn, the more you want it, so you must put an end to your desire, other wise your thrust of money is not going to stop. So get complacent, target your self to earn that much only, that is good enough to live, sufficient for your family, your self and to show charity. What happened to the richest fellows on earth lived so far, did not they die, did they carry any thing with them, after death is there anybody bothered about them ? People do not even remember their names, where as see those people, who sacrificed their lives for others, and serviced GOD. Their names are eternal on earth, as long as Sun and Moon shine on earth. The more the money, the more the problems, so be more intelligent, spend your time for service of GOD and in prayer, not for earning material assets.

God! Give me only that much, that is enough for me and for my family and for my guest. Give that much that is enough to feed my self and my guests. Don’t give me more or less. The more you want to acquire money, the more problems, fears and disturbance.

3. naariistanabhara naabhiideshaM
dRishhTvaa maagaamohaavesham.
etanmaaMsaavasaadi vikaaraM
manasi vichintaya vaaraM vaaram.

నారీస్తనభర నాభీదేశం, దృష్వ్టా మాగా మోహావేశమ్
ఏతన్మాంస వసాదివికారం, మనసి విచిన్తయ వారం వారమ్8.కామిని అందము కాంచిన వేళ
మోహము చెందకు మందమతీ,
రమణి సొంపుల రమ్య శరీరము
రుధిర మాంసముల రోతమయం.

9.పొంగులు అన్నీ కృంగిన వేళ
కంకాళమె యీ శేష కాయము,
నిజమిది మదిలో నిత్యము తలచి
మోహము తృంచుము ముదితమతీ.||స్మరించు||స్త్రీల అందమైన సుందర భాగాలను గని మందమతివై భ్రమించకుము. యందాలు యనుకొనే ఆ శరీర భాగాలు, రక్తము, మాంసము, క్రొవ్వు, మొదలగు జుగుప్సా కరమైన పదార్ద నిర్మితములే! వయసు మళ్ళగా, వృధాప్యము దాపరించగా, ఆ శరీరపు పొంగుల వన్నెలు తగ్గి, ఎముకల గూటిపై చర్మముగా మారును. ఈ శరీరము, పుడమి, జలము, అగ్ని, వాయువు ఆకాశము అను పంచభూత నిర్మితమై, నశ్వరము, జడమైన రక్త, మాంస, రస దుర్గంధ భూయిష్టమై, కేవలము చర్మముతో కప్ప బడిన తోలు తిత్తి. దానిని, ఆపంచ భూతములే గాక, రోగము, వృధ్ధాప్యము గూడా నాశము చేయగలవు. కనుక ఆశరీరపు టందములు చూచి మోస పోయి, వానిని బడయవలననే ఆశా, మోహముల నొందకుము. సప్తవ్యసనాలలో ప్రధమమైనది, మహా భయానకమైనది స్త్రీ మోహం. దాని వల్ల మానవ జాతికి ఎన్నో కష్ట, నష్టాలు జరిగినవి. వ్యక్తికే గాక, సమిష్టికి గూడా స్త్రీ మోహము వల్ల ఎన్నో ఆపదలు కలిగాయి. కనుక యీవిషయము ఎల్ల వేళలా గుర్తుంచుకొని సన్మార్గగాములం అగుదాం.

Dear friend! When you see a beautiful women, don’t get attracted with her beauty and get mad and lusty. Seeing the female form, do not fall prey to frenzied delusion What ever you think that are very attractive, they are nothing but flesh, blood, fat and bones, covered under skin. Do not get drowned in delusion by going wild with passions. When age increases, deceases catch the body, all these become nothing but loosely hanging skin and broken bones. The body is made of the five elements, water, earthy, sky, air and fire. The body one day becomes useless and has to be mixed back in to these five elements. So understand the bodily pleasures are not ultimate, there is a divine please and happiness, please try to acquire that to be ever happy.

Nityaanandam Parama Sukhadam
Kevalam Gnana Murthim
Dwandaathitam Gagana Sadrusham
Tattwamasyadi Lakshyam
Ekam Nityam Vimalam Achalam
Sarvadee Saakshibhutham.

The divine is always blissful, most happy, with absolute wisdom, without a second, beyond the pair of opposites, expansive and all pervasive like the sky, indicated by the feeling of being synonymous of the goal of the principle of oneness, eternal, pure, unchanging and the witness of all the functions of the intellect. As an individual, member of a society and citizen of a country, you should be very clear with one point that the womanly attraction is most dangerous, you would have seen the history, so many wars were fought and so much destruction was done to human society due to woman’s attraction. All this is not worth. Think well thus in your mind again and again. So concentrate your mind on divine things and keep your mind, body and soul away from these attractions.

4. naliniidalagata jalamatitaralaM
tadvajjiivitamatishayachapalam .
viddhi vyaadhyabhimaanagrastaM
lokaM shokahataM cha samastam

నళినీదళగత జలమతి తరళం, తద్వజ్జీవిత మతిశయ చపలమ్
విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం, లోకం శోకహతం చ సమస్తమ్10.బుద్బుద ప్రాయము బ్రతుకస్ధిరము
నీటి బుడగే యీనర జీవితము
తామర దళము పై జలముకు మాదిరి
జారును నేలకు చంచలము.

11.చిన్నది బ్రతుకు, చితుకును తుదకు
క్షణములోన యమ పాశము జిక్కు,
ఆలు బిడ్డలు, ఆస్తులు పాస్తులు
ఆఖరి క్షణమున అక్కర రావు

12.సంసారము యిది సంకటమయము
సంతాప, శ్రమ, సంభరితం,
శ్రీహరి పంచన స్ధిరముగ చేరి
సద్గతి నొందుము సుగుణమతీ ||స్మరించు||పరమాత్మ స్వరూపా! యీ మాయా జగజ్జాలములో చిక్కిన మనకు, యీ అనుబంధములు, సంపదలు, సుఖములు శాశ్వతమైనవి అనే అపోహ కల్గును. కాని నావి, నావి యని భావించు యీ బాహ్య వస్తువులే కాదు, యీ శరీరమే మనకు సొంతము గాదు. ఒక్క క్షణములో అవి మనలను వదలి పోవును. తామరాకు పై నీటి జలము ఎంత అస్థిరమో, మన బ్రతుకు కూడా అంత చంచలము, అస్థిరము. ఏ క్షణమునైన అది జారి పోవును. నీటి బుడగలా రాలి పోవును. కనుక యీ బాహ్య వస్తువులను నమ్ముకొని వాని వెనుక బడుట, ఎండ మావుల వెనుక పడి దాహము తీర్చు కొన ప్రయత్నించిన దానితో సమానము. అందుకే పామరులు, బాహ్య వస్తు సముదాయముపై మోహము పెంచుకొని, వానిపై అను బంధము నేర్పరుచు కొని, అవి ఉన్నంతవరకు సంతోషము, అవి దూరమైనపుడు అత్యంత శోకము అనుభవిస్తున్నారు. కాన వస్తు సముదాయములు శాశ్వతమైన సంతోషమునందింప జాలవు. నిత్యమైన ఆనందము కావలెనన్న, దేహాభిమానము వదలి, భక్తి, జ్ఞాన, ప్రపత్తుల నవలంభించి, వైరాగ్య భావనతో, పరతత్వ సాధనలో శాశ్వతానందము బడయుము. శరణాగతితో శ్రీహరి చరణ కమలములు కోరి శాంతి నొందుము.

Dear friend, life is very small, man may die at any time, because of age, decease or accident. It is like a water bubble which may explode any moment, it is like a water drop on lotus petal, which may skid any moment. The life of a man is as uncertain as rain drops trembling on a lotus leaf. The entire world is devoured by disease and conceit, and smitten with sorrow. The GOD of death, may catch our neck at any moment. The world is full of miseries, and to cross the ocean of life ( BHAVASAGARA) is very tedious. To make this journey very easy and simple, that there is only one solution, the lotus feet of GOD. So surrender to LORD and make your life’s journey easy towards heaven.

5.yaavadvittopaarjana saktaH
staavannija parivaaro raktaH .
pashchaajjiivati jarjara dehe
vaartaaM ko.api na pRichchhati gehe

యావద్విత్తోపార్జనసక్తః తావన్నిజపరివారో రక్తః
పశ్చాజ్జీవతి జర్జరదేహే, వార్తాం కోపిన పృచ్ఛతి గేహే


13.ధనసంపాదన చేసెడి వరకే
భార్యా బిడ్డల గౌరవము,
తదుపరి నిన్ను సరిగా చూతురె,
బంధువులు నీ స్నేహితులు ?

14.పదవులు తెచ్చును మద మధికారము,
సంఘము నందలి గౌరవము ,
తీరిన పిమ్మట తలపరు ఒకరూ,
సేవకులే, నీ సంగతులు.

15.బంధు చులకనలు, ఛీత్కారములు
యింటా బయట తుస్ కారములు !
వృధాప్యములో వీనుల యందు
కల్గించును అతి ఘీంకారములు!

16.సిరి సంపాదన చేసెడి వరకే
స్వీయుల, సుతుల ప్రేమ లభించు,
ఆపరి శ్రీహరి చరణము దప్ప
ఎవ్వరి ప్రేమ యింత లభించును.

17.పరమ భయానక భవసాగరమిది
తరణము చేయుట దుస్తరము
దేవ దేవుడా దేవకినందను
భజనమె తరణకు సాధనము ||స్మరించు||

18.దయామయుడు ఆ తిరుమల నాధుని
శరణము గోరుము శ్రీఘ్రగతి
శ్రీహరి నామ స్మరణను నావతో
తరణము జేయుము సులభగతి. ||స్మరించు||సుగుణమతీ! నీవు పదవులలో ఉండి ధనము సంపాదించు సమయమున, నీ భార్యా బిడ్డలు నీపై అతి ప్రేమ కురిపించెదరు. నీ బంధువులందరు నిన్ను అతి మర్యాదగ చూతురు, సేవకులు, సహోద్యోగులు నిన్ను గౌరవింతురు. దానికి కారణము నీ గొప్ప గాదు, నీ వల్ల వారికి జరిగే ప్రయోజనమో, లేదా నీ వల్ల వారికి హాని జరుగ కుండ యుండు నటుల వారు అలా నటింతురు. ఒక్క సారి ఆపదవి పోగానే, నీలో ధనార్జన శక్తి సన్నగిల్లగనే, నిన్ను ఎవ్వరూ పట్టించుకొనరు. యింట, బయటా, నీకూ గౌరవము లభించదు. నీకు వేళాకోళములు, హేళనలు, ఎగతాళులు, చులకనలు ఎదుర్కొనే దుస్థితి కలుగు తుంది. కనుక తెలివిగా యిప్పుడే కనులు తెరచి, ప్రేమ స్వరూపుడైన ఆ పరబ్రహ్మ ఆదరణకు పాత్రుడవగుటకు ప్రయత్నించుము. కరుణా మూర్తి యైన ఆ పరబ్రహ్మ అభిమానము చూరగొనవలె నన్న, యీ వస్తు సంపదలపై మోహము విడనాడి, దేహ సంబంధులైన వ్యక్తులపై మమతను వీడి, మనసును మాధవునికి అర్పణ జేసుకొనుము. భవ సాగర తరణమునకు శ్రీహరి నామమన్న నావను ఆశ్రయించుము. అది అతి సులభముగ భవ సాగర యాత్ర జరిపించును.

Dear friend! As long as you have earning power and earning money, everybody respects you, they will be attached to you.. Your wife, children and relatives show a lot of importance to you. But the moment you stop earning you lose all your respect, they just stop caring you, no one would even speak to you a word. On the contrary they may even show disrespect or they may even insult you. When you are in power and position, your subordinates, servants, colleagues respect you, for the fear of you that you may harm them, or to get benefits from you. Once you are down the power, nobody cares you. At the time you feel insulted, lost and horrified, at that time nobody will be on your side, except GOD, so think of GOD right now and pray him every moment, so that you are prepared mentally to take up any situation.