Bhajagovindam
Part 3

Ramakantha Rao Chakalakonda

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here(We will publish Sree Ramakaantharao gari translation and commentary on the Bhajagovindam in several installments. He has translated this work into poetic Telugu, as well as easy to understand English. Please be sure to look for them in the upcoming months .. Editor)6. yaavatpavano nivasati dehe
taavatpRichchhati kushalaM gehe .
gatavati vaayau dehaapaaye
bhaaryaa bibhyati tasminkaaye

యావత్పవనో నివసతి దేహే, తావతృచ్ఛతి కుశలం గేహే,
గతవతి వాయౌ దేహోపాయే, భార్యా బిభ్యతి తస్మిన్కాయే.


కాయము కట్టెగ మారిన క్షణమున
రారెవ్వరు దరి ప్రియ బంధువులు
ఆలే భయపడు ఆయువు తీరగ
కాయము దగ్గర కొంచము ఉండను.

శ్వాసలు గుండెలొ సాగిన వరకే
అందరు స్థితి గతి అడుగగ వత్తురు,
ప్రాణము పోయిన పది నిముషములే,
ఆపరి ఒకరూ వూసే యెత్తరు.

పంచ భూతముల పాకము తోటి
పుట్టిన దేహము ప్రకృతి నైజము,
రక్త మాంస దుర్గంధ భరితము
దీనిపై దేనికి తీరని మోహము.

అశాశ్వతములీ వస్తు సంపదలు,
వీడు వానిపై వ్యర్ధ మోహము,
శాశ్వతమైనది శ్రీహరి సన్నిధి
సంగతి మరువకు శాంతి మతీ. ||స్మరించు||నేర్పరీ ! శరీరంలో యీహంస సాగిన వరకే, బంధువులు, మిత్రులు, నీ క్షేమ సమాచారములు అడుగగా వత్తురు. నీపై అతి ప్రేమ, వాత్సల్యము కురిపింతురు. అది అంతా నీ గుండెలలో ప్రాణ వాయువులు సాగు వరకే. ఒక్కసారి ఉఛ్ఛ్వాశ నిశ్వాసములు ఆగి, నీవు విగత జీవుడవై నేల బడియుండ, నీ భార్య కూడా నీదరి చేరను భయపడును. నీ వారందరు నీ శరీరము తాకను గూడా శంకింతురు. నీవు తనువు చాలించిన కొలది క్షణముల వరకే అందరూ శోకము ప్రదర్శింతురు, ఆపై నీ వూసును గూడా ఎవ్వరూ ఎత్తరు. అందమైనదని ఊహించుకోనే మన యీ శరీరము, రోగముతో రోతతో, మలిన గంధ భూయిష్ఠమగును. శరీరమున ప్రాణ వాయువులు ఆగి పోవగనే, అది పనికిమాలినదై పోవును. ఎంత త్వరగా దానిని వదలించుకొందమా అని అందరు భావింతురు. పంచ భూతములతో నిర్మతమైన యీ దేహం, చివరకు పంచ భూతములలోనే కల్సి పోవలె! అట్టి యీ హీన శరీరం పై మమతలు యేల? వస్తువులపై వ్యామోహము వదలి, శ్రీహరి సన్నిధికై చిత్తమును మళ్ళించుము.

Dear friend ! As long as you are alive, your relatives, friends, and wife and children, enquire you about your state, they show a lot of interest in you, but the moment you are dead, they weep once or a few days and then forget about you. Nobody even remember you latter. When your dead body is lying on floor, nobody wants to touch it, even your wife gets worried to approach the dead body, because of fear. The body is made of the five elements, earth, sky, water, fire and air. When dead it becomes so much decade that it starts smelling, so everybody wants to get rid of it as soon as possible, lest they should get any decease. So the body has to get mixed again with those five elements. So the physical body is useless and perishable, the only thing that is eternal is sole, so make your sole purified and try to achieve the lotus feet of GOD where there is perfect tranquility and eternity.

7.arthamanarthaM bhaavaya nityaM
naastitataH sukhaleshaH satyam.
putraadapi dhana bhaajaaM bhiitiH
sarvatraishhaa vihiaa riitiH

అర్ధమనర్ధం భావయ నిత్యం, నాస్తి తతస్సుఖ లేశస్సత్యమ్
పుత్త్రాదపి ధనభాజాం భీతిః, సర్వత్రైషా విహితా రీతిః


ఆస్తులు దక్కెడి క్షణముల వఱకే
ఆత్మీయులు నిను ఆదరింతురు,
ఆపై ముసలీ ఆవలయుండని
అందరిలో నిను అవమానింతురు

మోసము తోటి మూటలు గట్టి
దాచుట కడ్డ దారులు తొక్కి,
చివఱకు చెంతకు చింతగ చేరి
ధనమే తెచ్చును ధరణిన దైన్యము

కూడ బెట్టిన కోట్ల కాసులే
కాలనాగులై కాటు వేయును,
మించిన ధనమే ముంచును నిన్ను
కాలకూటమై తుంచును నిన్ను

కలిమి, కనకములు కొండలు కాగా
పాప కార్యములు పర్వతమవగ,
కొని పోయెడి నీ గూఢ సంపద
గుండు సున్నయని గ్రహింపు జీవా.

వక్రమార్గమున విత్తము చేర్చి
వేలు గడించిన విహ్వలుడు,
తృష్ణతీరక ధనదాహముతో
తామసమొందిన తృషితుండు

తామస మొదలి తిరుమలనాధుని
చరణ సంపదల భాగ్యము కొనుము,
హరి నామముల ఆహార్యముల
భూషణ చేయుము బుద్ధిమతీ ||స్మరించు||


పరమాత్మ స్వరూపా! మోసము తోటి, కపటము తోటి ఎన్నో అడ్డ దారులు త్రొక్కి, కూడ బెట్టిన ఆస్తే చివరకు నీకు కష్టమును కల్గించును. అధికమైన సంపదల వలన నీకు నీ బంధువుల వలన, మిత్రుల వలన, సేవకుల వలన, కడకు నీ సొంత బిడ్డల వలన కూడా అపాయము జరుగ వచ్చును. మొదట ధనము సంపాదించుటకు అవస్థలు బడి, తరువాత దాచుకొనటకు అవస్థలు బడి, చివరకు, నీ ప్రాణము రక్షించుకొనుటకు అవస్థలు బడవలసి వచ్చుచున్నది. అట్టి ధనములో చింతా కంత గూడా నీవు నీతో తీసుకొని పోలేవు. నా బిడ్డలు, నా వాళ్ళు అని స్వార్ధముతో నీవు దాచిన ధనము వలన నీకు ప్రయోజనమేమిటి ? అంతే గాదు, ఆ ధనము నీవు సంపాదించి వారికి పెట్టువరకే నీకు మర్యాద, దానిని సంపాదించ లేనపుడు నీ సంగతి ఎవ్వరూ పట్టించు కొనరు. ధనము వారికి దక్కగనే, నీ విలువ తగ్గి పోవును, పిమ్మట నీ యోగ క్షేమములు ఎవ్వరూ పట్టించు కొనరు సరిగదా నిన్ను ఉదాసీనముగా చూతురు. ధన హీనుడివైన నీవు నలుగురిలో అపహాస్యపు పాలు గూడ అగుదువు. ధన దాహము ఊబి వంటిది, అందు చిక్కినచో బయటకు రాలేరు. కనుక ధనము వలన నీకు ఎప్పుడూ సుఖము లేదు. నీవు నీ నిజ జీవితములో చూచుచునే వుందువు. ఎందరో ఆ ధన వ్యామోహములో పడి, ఆప్యాయతలు, ప్రేమలు, మైత్రి, మానవత్వము మరచి ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారో! చివరకు వారు జీవితం లో పడ్డ సుఖము, చివరకు వారి అంతము గూడా ఎటుల జరుగునో నీకు విదితమే! కనుక ధన చింతన మాని, సమయము దైవ చింతనకై ఉపయోగించి జీవితము సఫలము జేసు కొనుము.

Dear friend! see the irony of having more money, your life is in danger and becomes peace less. By legal or illegal means you earned lots of money, now the problem is protecting it, you have fear of thieves, rulers.. They may even kill you to steal the money. Bear in mind always that wealth could mean disaster. Why only dacoits, think of your own children, friends and relatives, there is even danger from them also.. As long as they have money interest with you, or as long as they believe that you are useful to them monetarily they respect you, once they feel you are useless to them they ditch you. So Wealth is no good, there is happiness even after acquiring wealth, this is the truth. Wealth is not welfare, truly there is no joy in it. GOD, he is with you all the time, whether you are poor or rich, you get the acme of peace in his service, so pray GOD and achieve happiness, which the material comforts and people cannot give you. Sri Sankara here gives a sound advice good for householders and other sadhakas. Know that money will mean more misery than pleasure. The truth is, money cannot buy happiness; In money matters, man doesn’t trust even his offspring’s. Strange it may seem, but this is the way of the world.

The Acharya, though not a man of the world, nevertheless understood its ways precisely. This is for the benefit of the disciples and devotees. Money often makes a man arrogant. There is no end to the greed for wealth. The man who gets a thousand will hope for ten thousand. The one who gets ten thousand will hope for a millions… No end to desire, no end to greed. Will more money ensure more pleasure and peace of mind? Chances are little. The more a man gets, the greedier he becomes; No one is satisfied with what he gets. He is jealous of those who have more; Dissatisfied mind is the breeding ground of crimes: at home, in society also. The rich man sometimes doesn’t trust even his children on monetary matters. He is doubtful on others and their intentions. Sleep is lost; Rivalries start; Quarrels ensue; Even murders result. All for money. Can a sadhaka live with this situation?

No amount of money will satisfy us. We have to satisfy ourselves by what we legitimately earn by hard work. We should impress ourselves that it is a misconception that money brings happiness. There is nothing wrong if we work hard and earn money; we may use it for good purposes. But we shouldn’t become a slave of money. The earlier we understand the truth about the world and its ways, the better it is for us: To help say farewell to ignorant ways.

8. baalastaavatkriiDaasaktaH
taruNastaavattaruNiisaktaH .
vRiddhastaavachchintaasaktaH
pare brahmaNi ko.api na saktaH

బాల స్తావత్ర్కీడాసక్తః, తరుణ స్తావ త్తరుణీసక్తః
వృద్ధస్తావచ్చిన్తాసక్తః, పరమే బ్రహ్మణి కోపిన సక్తః


బాల్యము అంతా ఆటల మయము,
యౌవనమున స్త్రీ లంపటము,
వయసు ముదిరిన వ్యర్ధ చింతనమె
ఎపుడో శ్రీహరి పద సేవనము ?

చిన్న తనములో చపలత్వముతో
చెలిమికాండ్లతో చెండు లాడెదవు,
తెలిసీ తెలియని అజ్ఞానముతో
తిరుమల నాధుని తల్చనె తల్చవు.

విద్య గడించను, విలాసములకే
యౌవన మంతయు వ్యర్ధము చేతువు
పొట్టకూటికై నేర్చిన విద్దెలు,
పరమార్ధము కై పనికే రావు.

తదుపరి బ్రతుకున ధన సంపాదన
పడతీ బిడ్డల ప్రేమలు లాలన
క్షణమైనను ఆ లక్ష్మీ పతికై
చింతాకంతయు శోచన చేయవు.

వయసు మళ్ళగా,వ్యాధులు సోకగ
హృదయములో ఆరాటము తీరక,
తహ తహ తో మది తపించి పోవుచు
తత్వము పైన తలపులు నిలుపవు.

అమూల్యమగు యీ మానవ జన్మను
ఆరాటముతో వ్యర్ధము చేయకు,
ఆత్మ నాధుని ఆశ్రయమోందే
అవకాశము చేజార విడువకు

ఆత్మజ్ఞానము అత్మ నిగ్రహమే
హరిని చేర్చెడి సాధనము
అచంచలమ్మగు అచ్యుతు భక్తే
ఆదుకొనేటి ఆయుధము. ||స్మరించు||

తామస మదితో తాత్సారముతో
దినములు గడపకు దివ్యమతీ
సదవకాశమిది చే జార్చకుమీ
సమయమిదే ఓ సుగుణమతీ || స్మరించు||తత్వమసి! వివరముగా యిది విచారించుము, బాల్యములో, తెలిసీ తెలియని వయసులో, సమయమునంతా ఆట పాటలకు వ్యర్ధము చేసుకొను చున్నాము. పిమ్మట యుక్త వయసు రాగనే, స్త్రీ వ్యామోహములో పడి కామ క్రీడలకు సమయము వృధాచేయు చున్నాము. ఆపిమ్మట వృధ్ధాప్యములో ధన, కాంతా, కనకాల పై ఆసలు తీరక, జర, వ్యాధి బాధలతో చింతాగ్రస్తులమై ఆ చివరి క్షణములు వృధా చేయుచున్నాము. యింక భగవంతుని పై తలపు ఎప్పుడు. జీవితకాలమంత యిటుల వృధాయైన సాధించిన దేమి ? కాన కర్తవ్యము నెరిగి, పరమాత్ముని పై మనసు నిలిపి, గోవింద స్మరణతో జీవితము పునీతము చేసు కొనుము. భగవంతుని పొందుటకు సాధనము హరి పై నిర్మల భక్తే! ఆత్మ నిగ్రహము తో పరతత్వ జ్ఞానము బడసి, భక్తి సాధనముతో భగవంతుని చేరుము. నేడు రేపు అని రోజులు గడపకుము. మానవ జన్మము మహాదుర్లభము, భగవంతుని జేరుటకు సదవకాశము. యిది చేజార్చుకొనకుము. యిదే మంచి సమయము. వెంటనే కార్య దీక్షతో ముందుకు సాగుము.

Dear friend! See the pity, how you are wasting your time, in all the four stages of your life cycle! When you are a child because of ignorance you were more attracted with play and pass time, so as a boy, you are attached to sport When young you are after woman, then after marriage you are after money and family matters, so as a youth, you are attached to young woman. Finally when you get old, your mind is preoccupied with the matters like, how to protect your money, your children’s feature etc. So when you are old, you are attached to anxiety; Also at that time your age and weakness, decease brings you more head aches. To the Supreme Brahman, no one, alas, is attached! Then also you do not think of GOD, finally when death invades you, in that last moment you may be in a position of thinking of GOD or not, even if you think of HIM, there is no use, better start praying GOD right now, irrespective of age, what ever is your profession, caste, creed or community, what ever you are engaged in, always in your mind think of GOD and pray him, that is the only one that can save you.

9. kaate kaantaa kaste putraH
saMsaaro.ayamatiiva vichitraH .
kasya tvaM kaH kuta aayaataH
tattvaM chintaya tadiha bhraataH

కా తే కాన్తా కస్తే పుత్త్రః, సంసారో యమతీవ విచిత్రః
కస్య త్వం వా కుత ఆయాతః, తత్త్వం చిన్తయ తదిహ భ్రాత:


ఎవ్వరు భార్య, ఎవ్వరు పుత్రులు
పెండ్లికి ముందు, పుట్టుక ముందు,
ఎవరీ జీవికి అగుదురు సొంతము
పుడమిన ప్రాణిగ పుట్టక ముందు.

ఎవరికి ఎవరీ వింతగు జగతిన
ఎంత నిజము యీ దేహ బంధములు,
ఏమిటో మాయ ఎఱిగిన వారికి
యిహ లోకములో ఏమిటి బాధలు.

ఎవ్వరు తల్లి, ఎవ్వరు తండ్రి,
ఎవరు అక్కలు, అన్నదమ్ములు
ఎవరీ ఆత్మకు అనుంగు మిత్రులు
ఎవరికి ఎవరో ఎరుగగ లేము

ఎచ్చటనుండి వచ్చిన వాడవు
ఎచ్చటి కావల వెళ్ళెడి వాడవు
ఏమిటి జీవికి యిహ బంధములు
ఎఱగి మెలగుమీ యధార్ధ జ్ఞానము

వీడుము భ్రాంతి దేహాభిమానము
వేడుము శ్రీహరి పాద కమలము
పాడుము నిత్యము శ్రీపతి నామము
కూడుము శ్రీహరి దాసుల సంఘము

మాయామోహము మదిలో గ్రమ్మి
బ్రతుకు బంధములె స్ధిరమని నమ్మి,
ఆశాపాశపు అడుసున చిక్కి,
శోకము నొందకు సుగుణమతీ ||స్మరించు||ఓయి సుమతీ! కొంత ఆలోచించుము. ఆత్మ స్వరూపులమైన మనమందరము, యీ జన్మలో అమ్మ, నాన్న, భార్య, భర్త, పుత్రుడు, కూతురు, బంధువులు అన్న బంధములతో జీవించుచున్నాము. నీవు పుట్టక ముందు, నీ తల్లి దంద్రులతో ఏమి నీకు సంబంధము. అలగే నీకు పుట్టిన బిడ్డలతో, వారి జన్మకు ముందు నీ కేమిటి బంధము ? పెండ్లాడక ముందు నీ భార్య ఎవరు, నీ వెవరు ? యీ భవ బంధములేవి, పుట్టుక మునుపు లేవు, మరణము తర్వాత వుండవు. కనుక యీ భవ బంధములు శాశ్వతములని నమ్మి, వ్యామోహములో బడి చింతనొందకుము. యీ బ్రతుకు ఒక మాయా నాటకము, అందులో పాత్రలము మనము, నాటకము ఆడు నంతవరకు మన పాత్రల భాంధవ్యములు వేరు. అదే విధముగా యీ జీవన్నాటకము గూడా! అది నిజమని భ్రమించకుము. ఆ భ్రమలో ఉన్నంత వఱకు, నా భార్య, బిడ్డలని వ్యాకుల పడుతూ, వారి కొఱకు, నీ సమయము వృధా చేయకుము. ఉన్నదానితో తృప్తి పడి వారిని పోషించుము, మిగిలిన సమయము భగవన్నామ స్మరణలో గడుపుము. సత్య హరిశ్వంద్రుడు ఏమన్నాడు “ మాయామేయ జగంబె నిత్యమని సంభావించి, …..”. మనందరము పుట్టక మునుపు ఎక్కడ వున్నాము, మరణము తర్వాత ఎక్కడకు పోతాము ? ఎవరు నేను, ఎక్కడికి నా గమ్యము, ఏమిటి యీ జీవన యానము ? యీ విధమైన ప్రశ్నలతో మదిలో తర్కించి, గురువుల నడిగి తెలుసుకొని, ఆత్మ జ్ఞానము బడసి, భ్రాంతిని, దేహాభిమానము వీడి, మనసులోని శారీరిక బంధములపై అభిమానము వీడి, మనసు పరమాత్మ పై లగ్నము జేసి, కృత కృత్యుడవు గమ్ము.

Dear friend! Think for a moment, who are you? Who is your wife? Who is your son? what are these relations, what is the relation between your wife and you before marriage, what relation you have with your children before birth, same logic applies to your parents, and others, it means these relations are temporary in the dimension of time, they hold good for some time, and cease to exist after a period. you? Whence have you come? Oh brother, think of that truth here. The Samsara (Universe ) is very Strange. Exceedingly wonderful, indeed, is this empirical process! Of whom are you? Who are. The whole world is a stage, we are actors, playing different roles, involved deeply in our action. Come out of this plane of MAYA ( Cloud of ignorance) and think, you will find that what ever role you are playing is false and untrue. So get rid of your mind with the cloud of MAYA ( the attracting power), then you are clear of facts and truth, that is the first step in acquiring divine Knowledge (GNANA) and one step toward the ALL MIGHTY!

Your vision makes you call a man ‘father’, your daughter as ‘daughter.’ You give name to various relationships since the bodies are different. Actually, who is father, who is daughter?

Maata Naasthi, Pita Naasthi
Naasthi Bandhu, Naasthi Sahodara
Artham Naasthi, Gruham Naasthi.
Tasmat Jagratha, Jagratha, Jagratha.

There is no mother, no father,
Neither siblings nor relations,
There is no wealth or dwelling,
O! Be careful, be careful, be careful.

In essence, all are one and are the embodiments of God. In order to journey to this unity, the diversity should be renounced. The principle at the spirit (atma) is to visualize and experience the unity in diversity. The Atma is the regulator of unity amidst multiplicity.

Though the bulbs are different, in size and luminosity, they glow by the same electricity that runs through them. So too visualization of the self is the understanding of the singularity in the plural world.
10. satsaNgatve nissN^gatvaM
nissaNgatve nirmohatvam.h .
nirmohatve nishchalatattvaM
nishcalatattve jiivanmuktiH

సత్సఙ్గత్వే నిస్సఙ్గత్వం, నిస్సఙ్గత్వే నిర్మోహత్వమ్
నిర్మోహత్వే నిశ్చల తత్త్వం, నిశ్చల తత్త్వే జీవన్ముక్తిఃశ్రీహరి దాసుల సఖ్యము లోన
జ్ఞాన భక్తి వైరాగ్యము లబ్బును,
ఆత్మ తత్వము అవలోకనమై
జీవన్ముక్తి చక్కగ దొరకును.

సుజనుల సంగతి శ్రీఘ్రమే గొనుము
వారి మాటె వేదాంత సారము,
వారు చెప్పెడి వాక్కులె ధర్మము
వారల జ్ఞానమె వర ప్రసాదము

అమృత పురుషుల నాలకించిన
ఆత్మ మోహము అంతరించును,
అనుభవజ్ఞుల అమూల్య బోధతో
ఆత్మజ్ఞానము అవగతమగును.

మంచి మాటలు మదిలో నిలచిన
మమకారముల మోకులు తెగును,
నిస్సంగత్వము నొందిన హృదయము
నరహరిపైన నిశ్చల మగును.

మోహమయము ఈ మానవ జన్మము,
నశ్వరమెల్లయు నిజము యిది,
నిత్యము సత్యము నరహరి సన్నిధి,
నిజమెఱుగుము ఓ నిశితమతీ ||స్మరించు||ఓయి సుమతీ! సజ్జన సాంగత్యము వలన నీకు ప్రాపంచిక విషయముల గురించి నిజము తెలియును. దాని వలన వానిపై వ్యామోహము నశించును. దాని ఫలితముగా నీకు అజ్ఞానము అంతరించును. అజ్ఞానము అంతరించిన హృదయములో ఏకాగ్రత కలిగి, భగవంతునిపై మనసు నిలచును, తత్ ఫలితముగ నీకు ముక్తి చేకూరును. కాన సత్ సంగములకు వెళ్ళుట, సత్ పురుషులను కలయుట చాలా ముఖ్యము. సువాసన గల వనములో నడచిన యా సువాసన నీకు లభించినట్లే, సాధు సాంగత్యము వలన మంచి చేకూరును. అందుకే అన్నమయ్య అన్నారు:-

నీ దాసులున్న చోట నత్య వైకుంఠమే,
వేదకు వేరొక చోట వెతకనేల,
…..
వారల తోటి మాటలు, వడి వేదాంత పఠన,
సార బట్టి చదువులు చదవనేల ?
యీ విషయాన్నే ఎందరో మహాను భావులు ఎన్నెన్నో రీతులుగా చెప్పారు. ఎన్నో విషయములు, మనకు, పెద్దలవలన, వారి అనుభవముల బట్టి తెలియును. కనుక గురువులు, పెద్దలు, ప్రజ్ఞావంతులను గౌరవించుచూ, వారి సేవ చేయుచూ, వారి సాంగత్మములో మంచిని తెలుసుకొని, మాయను వీడి, భగవన్ ముఖముగా మనసు మళ్ళించి విముక్తి బడయుము.

Dear friend! From Satsangh (the company of the good) comes non-attachment, from non-attachment comes freedom from delusion, which leads to self-settledness. From self-settledness (delusionlesness) comes Jeevan Mukti (liberation in life). Company plays a major role and it influences your mind and sole. If you are in bad company you acquire bad habits, if you are in good company good habits, you have to better choose good company for your own good. If you are in the company of HARI DASA’s (Servants of GOD), saints and good teachers (Guru’s), you can learn things very easily, you don’t have to re-invent the wheel, what ever they learnt, they will pass on this knowledge to you and you can easily acquire that. Especially the need of a good teacher is very important for spiritual matters. Dear friend acquire the friendship and company of devotional people and acquire spiritual knowledge, peace, good habits. If you are in a good company, the first benefit you get is, you get detached with the worldly matters, and you get attached to divine things, if you reach that stage then you are very close to GOD.