Bhajagovindam
Part 4

Ramakantha Rao Chakalakonda

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here(We will publish Sree Ramakaantharao gari translation and commentary on the Bhajagovindam in several installments. He has translated this work into poetic Telugu, as well as easy to understand English. Please be sure to look for them in the upcoming months .. Editor)11. vayasigate kaH kaamavikaaraH
shushhke niire kaH kaasaaraH
kshiiNevitte kaH parivaaraH
GYaate tattve kaH saMsaaraH

వయసి గతే కః కామవికారః, శుష్కే నీరే కః కాసారః
క్షీణే విత్తే కః పరివారో, జ్ఞాతే తత్త్వే క స్సంసారఃవయసు మళ్ళగ, వంగగ నడుము,
మదన వికారము, మాసి పోవును,
యౌవనుడై వైరాగ్యము నొందిన
విబుధుడె ధన్యుడు ఉత్తమ పురుషుడు.

ఆత్మ విచారణే ఆయుధమను కొని,
వైరాగ్యాంబుధి జలముల తోటి,
తత్వజ్ఞానమను తీవ్ర కృషితో,
కామ కలుషమును కడిగి వేయుము.

సంపదలన్నీ సమసిన క్షణమునె
వదలి వేతురు వలదని మిత్రులు
నీరు నిండగనే కప్పలు చేరు,
ఎండిన చెరువున ఏమిటి తీరు.

ఆత్మతత్వమది తెలిసిన మీదట,
భవ బంధములే సమసిపోవును.
ఆపరి తత్వము నెఱుగట సులభము,
మోక్షము నొందుట మహా సుగమము ||స్మరించు||ఓయీ ! సద్గుణమతీ! తనువులో శక్తి నశించి, నడుము వంగి, ఇంద్రియముల పటుత్వము తగ్గినపుడు, కామ వికారాలు తగ్గుటలో విచిత్రమేమి ? దేహ పటుత్వము నశించినపుడు, నరములలో నీరసము వచ్చినపుడు కామ క్రీడల పై ఆసక్తి నశించుట సహజము. నీరన్ని ఇంకి పోయిన పిమ్మట యిక చెఱువనేది ఎక్కడ ? అనగా అశక్తుడవైనపుడు కామ క్రీడలయందు అనాసక్తుడ వగుటలో గొప్ప యేమి ? వయసులో ఉన్నపుడు, మనో వికారముల నదుపుజేసి పరమాత్ముని పై లగ్నము జేసిన వాడు గొప్పవాడు. అనగా ఎప్పుడో వృధ్ధాప్యములో అన్ని అంగములు ఉడిగినపుడు వాని పై అయిష్టత గలిగినను, మనసు మాత్రము యింకా వాని వెనుకే పరుగులిడు చుండును. వయసు లో ఉన్నపుడే ఆత్మ నిగ్రహము పొందిన, శరీరము మనసు స్వాధీనములో నుండి, ఏకాగ్రత చేకూరును. కాన భగవత్ చింతన పిన్న వయసు నుండే ప్రారంభించ వలెను. మనకున్న ధనము నశించగనే, ఒక్కోక్కరూ మిత్రులు మనలను విడనాడుదురు. సుమతి శతకములో చెప్పినట్లు

ఎప్పుడు సంపద గలిగిన
అప్పుడు బంధువుల వత్తు రది యెట్లన్నన్,
తెప్పలుగ చెరువు నిండిన
కప్పలు పదివేలు చేరు గదరా సుమతీ.

కనుక ధన సంపత్తుల పై వారికి ప్రేమ గాని నీపై గాదు. కనుక బంధ విరహితుడవై, ఆత్మ తత్వము తెలుసు కొనుము. అది యెఱిగినచో ఇక అశ్వాశ్వతములైన తను బంధములపై, ధన సంపదలపై మనసు పోదు, అప్పుడు నిర్వికారుడవై, తామరాకుపై నీటి బొట్టు వలె, అంటి ముట్టనట్లు జీవితము గడుపుచూ, నీ ధర్మము నీవు నిర్వర్తించుచునే, పరమాత్మను గురించి చింతించుచూ, పరమ సుఖము ననుభవించ గలవు.

తత్వ విచారణ చేసిన యీ భవ బంధములు, నశ్వర పదార్ధ జగతిని గురించి నిజా నిజాలు తెలియును. అప్పుడు ఆత్మానుభూతి సిద్ధించును. తద్వార శోకము, చింత, అశాంతి, తపన, వ్యధ మొదలగు దుఃఖములు నశించి పరమ శాంతి చేకూరును. ఆ దశల ఆత్మానందముతో, ఆనంద సాగరములో తేలి పోగలవు.

Dear friend! When you are young, energetic then if you have control over mind and get detached to worldly things, then we can say you are like a saint, very strong minded, but when you are old and have no energy, if you lose interest in worldly attractions, what is great! When there is full water, then only we call it a tank, but where there is no a drop of water, where is tank it self? When youth is spent, what lustful play is there? When the water has evaporated, what lake is there? When the money is gone, what dependents are there? When the Truth is known, what empirical process is there? So friend, get detached from the worldly things right from beginning. So get realization, when you have assets everybody comes to you to enjoy them, they all leave you alone, just like frogs leave the tank when it is dry. So with self realization, make self analysis, this makes you understand what bad things in you are, wash them off and become a pure sole, eligible for divine prayer.

12. maa kuru dhana jana yauvana garvaM
harati nimeshhaatkaalaH sarvam
maayaamayamidamakhilaM hitvaa
brahmapadaM tvaM pravisha viditvaa

మా కురు ధన జన యౌవన గర్వం, హరతి నిమేషాత్కాల స్సర్వమ్
మాయామయమిద మఖిలం హిత్వా, బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వాఉన్నవి నాకు వేలకు కాసులు
ధన పరివారము తరగని ఆస్తులు,
యౌవన అందము, బలమని తలచిన
సర్వము సమయును క్షణములలోనే

గర్వము చేసిన గరిమలుఅన్నీ
నిముషములోనే నాశన మగును,
నావీ నావని భ్రమసినవన్నీ
నీటిపాలగు నిక్కము నమ్ముము

శాశ్వత మైనది శ్రీహరి చెలిమని
ప్రాజ్ఞత తోటి ప్రవర్తించుము
ఆత్మైక్యతతోఅమృతానందము
అతి సులభముగా అగు నీ సొంతము

అస్ధిర దేహం, అస్ధిర ప్రాణం
అస్ధిర ధన, పద సంపద సర్వం,
అస్ధిర బంధు, భార్యా బంధం,
అస్ధిర జగతిపై ఏలీ మోహం

తృణము సమానం, దృశ్య పదార్ధం
సత్యం, నిత్యం భగవన్నామం,
భవ తాప శ్రమ దుఃఖ విదూరం
భగవత్ భక్తే ముక్తికి మార్గం ||స్మరించు||ఓ జ్ఞాన మతీ! యీ ప్రపంచములో అందరి కన్నా నీకు మొదటి శత్రువు గర్వము. ఎప్పుడు మనసున గర్వము చేరినదో, అపుడే మనిషికి పతనము ప్రారంభమైనదని అర్ధము. గర్వము అజ్ఞానమునకు సూచన. గర్వము గల్గిన వ్యక్తి, తాను ధన వంతుడిననో, అందగాడిననో, పదవిలోనో, పలుకు బడిలోనో ఉన్నతుడననో, లేక జ్ఞానిననో, మంత్రోఛ్చారణలో దిట్టననో ఊహించుకొని, ఊహాగానాలు చేసుకొని, స్త్రీ, జ్ఞాన వృధ్ధులు అన్న తార తమ్యములు మరచి అందరిని అవమానిస్తాడు. ఈ అజ్ఞానమునకు కారణము అసంపూర్ణత. మనము వినియే వుంటాము, నిండు కుండ తొణకదని. కాన పూర్ణ జ్ఞాని నిశ్చలంగా, నిదానంగా ఉంటాడు. అసంపూర్ణ వ్యక్తులే అసందర్భ ప్రేలాపనలతో, అతిశయముతో కూడిన భాషణలతో తమ కాలము, యితరుల కాలము వ్యర్ధము చేస్తుంటారు.

కాన మనమున గర్వమును సంపూర్ణము గా నశింపజేసి, ధన, బల, పద, ఆకారముల వలన గలిగిన అతిశయ వికారమును పారద్రోలి, నశ్వర జగతి వైభవములకు ప్రాకులాడక, శాశ్వతమైన పరమాత్మ సాంగత్యమున కై కృషి చేయ వలెను. మనమనుకొన్న అతిశయములన్నీ మూడు నాళ్ళ ముచ్చటలే! ధనము ఎంత వున్ననూ, ఎక్కడో, ఎప్పుడో, ఏక్షణమునైనను పోగొట్టుకొన వచ్చును. అందమా అది జరా, వ్యాధుల వల్లనో, ఆపదల వల్లనో ఆనాకారము గా మార వచ్చును. యింక శరీర బలము, ప్రాణముల గతి యంతే! ఎప్పుడేక్షణమున, ఏకారణము వలన అవి నశించునో చెప్పలేము. కనుక మనము వేనిని జూచుకొని గర్వము చెందుచున్నామో అవి అన్ని మూడు నాళ్ళ ముచ్చటలే! కాల వాహినిలో అవి అన్ని కొట్టుకొని పోయి, నశించును. కాన నశ్వర జగ వైభవముల వలన గర్వము చెందక, పరతత్వమును సరిగా అర్ధము జేసుకొని, పరమాత్మునిలో ఆత్మని ఐక్యము జేసి పరమ పదము సాధించుము.

Dear friend! Those that have worldly knowledge, beauty, strength, money, power, position and mob behind them, get proud and head strong, they think that they are very great and insult others, they do so many atrocities on human society, but all these great assets what they have are temporary, one day they lose them. That one day can be any day, any time. Then they become Zero from Hero. Do not boast of wealth, friends, and youth. Free yourself from the illusion of the world of Maya and attain the timeless. So don’t get proud of them, the only strength that is real, eternal is GOD’s strength, acquire it with your spiritual knowledge. When you acquire that you will be sailing in the ocean of tranquility and happiness.

13. dinayaaminyau saayaM praataH
shishiravasantau punaraayaataH
kaalaH kriiDati gachchhatyaayuH
tadapi na muJNcatyaashaavaayuH

దినయామిన్యౌ సాయంప్రాతః, శిశిరవసన్తౌ పునరాయాతః
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముఞ్చత్యాశావాయుఃకాల చక్రము వేగమె కదులును
రేయిం బవళ్ళు రయముగ దొర్లును
ఋతు మాసములు ఏళ్ళుగ మారి
ఆయువు వేగమే అంతరించును

కాలాతీతము చేయకు సుజనా
కాలుని గాలము తగులును ఎప్పుడో
అత్తరి ఎంతగ విచారించినా
ఫలితము యేమిటి పున్నెమతీ ?

పట్టుము శ్రీహరి విమల పాదము
కట్టుము నడుము కేశవ సేవకు
నెట్టుము ఆవల యితర కార్యములు
పెట్టుము పూజకు ప్రథమ తిలకము

రేపూ మాపని సాకులు చెప్పి
వాయిదాలతో ఏళ్ళను నెట్టి
విశ్వనాధుని విమల సేవను
ఆదమరచకు అమల మతీ ||స్మరించు||br>


ఓయీ సుజనా! మానవ జీవిత పరిమితి వంద సంవత్సరములు. అందులో మన దురలవాట్ల వల్ల, రోగముల వల్ల, వ్యాధుల వల్ల, ఆపదలవల్ల ఆజీవితకాలము ఎంతో తరగి పోవు చున్నది. అందులో సగభాగము మనము నిద్రలో గడుపు చున్నాము. మిగిలిన సగభాగములో జీవన కార్యక్రమములకై గడుపు చున్నాము. తిండి, క్రీడలు, వినోదములకు చాలా భాగము వినియోగించు చున్నాము. ఆ మిగిలిన కొంత భాగమైనను భగవంతుని సేవకై వినియో గించక, పర దూషణలు, నిందలు, కామ క్రీడాది కార్యక్రమములకై వినియోగించుచున్నాము. ఈ విధంగా మన జీవిత కాల మంతయూ గడచి పోవుచున్నది. స్వామి సేవ రేపు, మాపు అనుకొంటూ లేని పోని సాకులతో కాల యాపన జేయు చున్నాము. ఈ విధంగా గంటలు, రాత్రింబవళ్ళు, రోజులు, పక్షములు, మాసములు, సంవత్సరములు గడచి పోవు చున్నవే గాని, భగవత్ ధ్యానానికి ఒక క్షణము వెచ్చించుట లేదు. ఈ విధంగా మనకు ఎన్నో జన్మలు గడచినవి, గడచును కూడా! మనము యీ జనన మరణ చక్రములో యిదే విధంగా అవస్థల పాలు కావల్సిందేనా? అందుకే కంచర్లవారు యిలా సెలవిచ్చారు:

ముప్పున గాల కింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్
గప్పినవేళ మీస్మరణ గల్లునో గల్గదో నాటికిప్పుడే
తప్పక చేతు మీ భజన దాశరధీ కరుణా పయోనిధీ!

మానవ జన్మము బహు దుర్లభమైనది, అది చేజారిన మరల దొరకుట కష్టము. కాన ఉన్న కొలది సమయమునైన, భగవత్ చింతనలొ గడిపి, జీవితము సఫలము జేసుకొనుము. ఈ ప్రాపంచిక విషయములు శాశ్వతములు గాదు. కాన వాని నుండి మనసు మరల్చి దైవ ముఖముగా మనసును మళ్ళించుము. ప్రయత్నించి ఆశ, వ్యామోహములకు కళ్ళెము వేసి, వానిని అదుపుజేసి, మనసు దిట్టము జేసుకొన్నచో పరబ్రహ్మ సాక్షాత్ కారము పొందవచ్చును.

Dear friend! Life is very short, don’t waste time. Start prayer right now, don’t post phone prayer, and never say that I will start from tomorrow, that tomorrow never comes. Time plays and life ebbs away. But the storm of desire never leaves. Day comes and day goes, night comes, and night goes. Like this days, months, years go waste, but that tomorrow never comes, so start today it self, if you have to do some thing tomorrow, start today, if you have to do some thing today, do it right away, in one moment there could be total universal destruction, then you can not utter even once the name of GOD, so without waste of time, start your prayer right away. Time sports, life is fleeting; yet one does not leave the winds of desire. That is why Kabir Said:

Kaal Kare So Aaj Kar, Aaj Kare So Ub
Pal Mein Pralaya Hoyegi, Bahuri Karoge Kub

Tomorrows work do today, today's work do right now, in one moment there could happen some big disaster, then you may not find even one moment also to pray.

14. dvaadashamaJNjarikaabhirasheshhaH
kathito vaiyaakaraNasyaishhaH
upadesho bhuudvidyaanipuNaiH
shriimachchhankarabhagavachchharaNariH

ద్వాదశమజ్ఞరికాభిర శేషః, కధితో వైయాకరణస్యైషః
ఉపదేశో భూద్విద్యానిపుణైః శ్రీమచ్చజ్కరభగవచ్చరణైఃతత్త్వ సుగంధ సుపుష్పరాజముల
ద్వాదశ శ్లోక దివ్యగుచ్చ మిది
సర్వశాస్ర్త సంక్షిప్త సారము,
శంకర భగవత్ పాద విరచితము

మోహ తిమిరమును అంతము చేసెడి
భాను తేజమీ భజగోవిందము
ముముక్షువులకిది మహా గ్రంధము
జిజ్ఞాసువులకు శాస్త్ర సారము

శ్రద్ధాసక్తుల పఠనము చేసిన
భక్తిగ భావము మననము చేసిన
భవరోగములకు దివ్యౌషధమై
శాంతి నిచ్చు నీ శంకర శ్లోకము ||స్మరించు||అజ్ఞానముతో, వృధాప్యము దాపరించినను, సన్మార్గము నెరుగని వృద్ధ బ్రాహ్మణుని పై కరుణతో “భజగోవిందం” అను పల్లవితో ప్రారంభించిన శ్లోకము గాక, పై పన్నెండు శ్లోకములను శ్రీ ఆదిశంకరులవారు చెప్పిరి. అవిగాక చివరి మూడు శ్లోకములను గూడా శ్రీ ఆదిశంకరులవారు చెప్పిరి. పై పన్నెండు శ్లోకములు పరతత్వ పరిమళ గంధముతో విరాజిల్లే అందమైన పద పద్మముల పూమాల, భవరోగములను బాపు దివ్య వనమూలికల ఔషధరాజము. కైవల్య కాముకులు యీ శ్లోకములను భక్తిగా చదివి అర్ధము జేసుకొని, తమ అవగుణములు, అలవాట్లు, లోపములు సవరించుకొని, పరమ శాంత మనస్కులై, పరమాత్మ శ్రీ చరణాల నందుకొనెదరని ఆశిద్దాం. వీని తర్వాత శ్లోకములను శ్రీ శంకరుల వారి శిష్యుల చెప్పిరి.

Like this, Swami Sankara gave his divine lessons to the old Brahman in twelve verses, and in the end another three, rest of the lessons were preached by swami’s students (SISHYA’s). This bouquet of twelve verses was imparted to the grammarian by the all-knowing Shankara, adored as the bhagavadpada. These twelve stanzas are good enough to clear the cloud of ignorance and MAYA from our minds, these are essence of all teachings in all the philosophical books. Those who understand, realize and practice the meaning of these twelve stanza’s will acquire Knowledge and can detach their mind from worldly things and can get self realization. That in turn generates peace, happiness and BRAMHANDAM and finally MOKSHAM

15. kaate kaantaa dhana gatachintaa
vaatula kiM tava naasti niyantaa
trijagati sajjanasaM gatiraikaa
bhavati bhavaarNavataraNe naukaa

కాతే కాన్తా ధనగత చిన్తా, వాతుల కిం తవ నాస్తి నియన్తా
త్రిజగతి సజ్జన సఙ్గతి రేకా, భవతి భవార్ణవతరణే నౌకాయింతుల పొందుల, బంగరు కాంతుల
చింతలు యేల చలపతి వుండగ
చింతలు వదలి చిత్తములోన
ఇంతి రమామణి పతినే నిలుపుము

శాసించెడి శ్రీ పురుషుడు వుండగ
శోక, క్లేశముల శ్రమ లింకేల
శ్రీహరి చరణము శరణము జొచ్చి
శాంతి సౌఖ్యముల సంపద నొందుము

కాంతా, కనకము కల్మష జనకము
ఎంతగ పెంచిన అంతటి శోకము
సొంతము కావవి వృధాభిమానం
కొంత వీడితే ఎంతో శుభము

మహా పురుషుల మాటలు వినుము
ధన, కనకముల ఆశలు వదలుము
ఎనలేని హరి శరణము నొంది
మనుజ జన్మకు మన్నిక తెమ్ము.

సంసారార్ణవ తరణ సాధనము
నామ సహస్రము నాస్తి అన్యము
శ్రీహరి దాసుల సత్సంగములో
నిశిత జ్ఞాన నిక్షేపము కొనుము ||స్మరించు||యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ పద్మ పాదాచార్యులవారు. ఓయీ! పరాత్పరుడైన భగవంతుడు లేడా! అతడు కరుణామయుడు. నారు వేసిన వాడు నీరు పోయడా! పుట్టించిన వాడు పూట గడపడా! ఎందుకు నీకు చింత. అయ్యో! నేను లేకున్న నా భార్యా, బిడ్డల గతి యేమిటి అని చింతిచకుము. దయా స్వరుపుడైన ఆదేముడు అందరికి తిండి, గుడ్డ, నీడ తప్పక యిచ్చును. కాన యీ విషయములపై చింతించుట మాని, మనసు పరమాత్మపై లగ్నము జేయుము. సమయమును వృధాచేయక, సత్ సాంగత్యము చేగొని, వారి వలన ధర్మాధర్మములు, మంచి చెడ్డలు తెలుసుకొని, సన్మార్గమును గుర్తించి, భవ సాగరములో జీవిత నావను చక్కగా భగవత్ గమ్యమునకు తీసుకొని పొమ్ము. శ్రీహరి నామ సహస్రము భవసాగరమును దాటించగల చక్కని నౌక.

This lesson was taught by Sri Padmapadchrya. He said, dear friend! Why are you bothered about any worldly matters. GOD is very kind, HE created us and also created food for us, so HE will defiantly feed your family and you, don’t worry about them. Stop worrying and start praying. Worries about family, wealth, etc., are mere foolishness. Is there not for you the One who ordains? In three worlds, it is only the association with good people that can serve as the boat that can carry one across the sea of birth (metempsychosis). Oh mad man ! Why this engrossment in thoughts of worldly things ? There is GOD to guide us. There is only one thing in three worlds that can save you from the ocean from samsara. Get into that boat of satsangha quickly. So listen to Great Guru’s words and acquire peace, leave your worries to sky, and get self realization. Start praying GOD and that will sail you happily on the world of ocean.