Bhajagovindam
Part 5

Ramakantha Rao Chakalakonda

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here(We will publish Sree Ramakaantharao gari translation and commentary on the Bhajagovindam in several installments. He has translated this work into poetic Telugu, as well as easy to understand English. Please be sure to look for them in the upcoming months .. Editor)16.jaTilo muNDii luJNchhitakeshaH
kaashhaayaambarabahukRitaveshhaH .
pashyannapi cana pashyati muuDhaH
udaranimittaM bahukRitaveshhaH

జటిలో ముణ్డే లుఞ్చిత కేశః, కాషాయామ్బర బహుకృతవేషః
పశ్చన్నపి చ న పశ్యతి మూఢో, హ్యుదర నిమిత్తో బహుకృతవేషఃనుదుటన బొట్టు, నామపు పెట్టు,
కమండలము కాషాయపు కట్టు,
ఆత్మ జ్ఞానిని, యోగిని చేయునా ?
వేషములా విజ్ఞతకును దీటు ?

కామ క్రోధములు త్రుంచని వాడు,
ఇంద్రియ లోలుడు, ఇచ్ఛా పరుడు,
మనసు నధీనము చేయని వాడు,
ముని వేషముతో మోక్షము నొందున?

బాహ్య వేషములు భక్తే గావు,
భక్తికి కట్టూ బొట్టూ లేదు,
పొట్ట కూటికే వేషము గానీ
పర సాధనకు పనికే రాదు ||స్మరించు||


యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ తోటకాచార్యులవారు. వేష, భాషలు భక్తి, జ్ఞానముకు కొల మానములు కావు. బోడి తల చేసుకొని, నామములు పెట్టుకొని, కాషాయ వస్త్రములు ధరించిన మాత్రమున అజ్ఞాని జ్ఞాని కాజాలడు. బాహ్య వేషములు మోసమునకే గాని, మోక్షము సాధించుటకు పనికిరావు. జ్ఞానమునకు చిహ్నములు ఇంద్రియ నిగ్రహము, శాంతము, ప్రేమ, దయ, మనోస్థిరత మొదలగునవి. వల్లె వేసిన వేద మంత్రములు పఠించుచుండి, మనసు భగవంతునిపై లగ్నము గానపుడు ఆపూజలు నిరర్ధకము. పరమార్ధము తెలుసుకొన లేని వ్యక్తి యే వేషము వేసినను వ్యర్ధమే. జ్ఞాని మనో వాక్కాయ కర్మలు భగవంతుని పై లగ్నము జేయును. అట్టి మహోన్నతుడు, సహనము, ప్రేమ, దయ వంటి ఉత్తము గుణ సంపన్నుడై వుండును. సాటి వారిపై తను అతి కరుణతో ప్రవర్తించును. కోపగించుట, పరులను నిష్కారణముగా దూషించుట, అవమానించుట అనునవి రాక్షస గుణములు. అట్టి అవగుణములకు సత్పురుషులు దూరముగావుందురు. అప్పుడు వారిని దైవాంశ సంభూతులుగా మనము గౌరవించెదము. అంతేగాని గౌరవము వేష, భాషలు, మంత్రపఠనా పాటవము వల్ల కలుగదు. ఆవేషములు ఉదర పోషణకే గాని దైవ కార్యములకు పనికిరావు.

This lesson was taught by Swami Totakacharya. He said, dear friend! For pure spirituality and Bhakti, what is required is a pure determined mind, not the dress or appearance. The outside dress of a person is not a measure of knowledge. The saffron colored dress of a saint, long hair, does not make an ignorant fool (AGNANI – a person who lacks divine knowledge) a knowledgeable, the realized person ( GNANI). If mind is not clear from the weaknesses, as anger, greed, ambition, envy , attraction towards worldly things, just wearing a saint’s dress, does not make a person eligible for ultimate detachment and acquiring salvation ( MUKTI and MOKSHAM). Indeed, this varied disguise is for the sake of the belly. There are many who go with matted locks, many who have clean shaven heads, many whose hairs have been plucked out; some are clothed in saffron, yet others in various colors --- all just for a livelihood. Those kinds of makeup and dress may be helpful for him to deceive others and get some monitory benefits and livelihood but not useful for getting MOKSHAM. So Don’t give importance to the external appearance of a person, try to know him and give value to his Knowledge.

17. aNgaM galitaM palitaM muNDaM
dashanavihiinaM jataM tuNDam.
vRiddho yaati gRihiitvaa daNDaM
tadapi na muJNcatyaashaapiNDam.

అఙ్గం గళితం పలితం ముణ్డం, దశన విహీనం జాతం తుణ్డమ్
వృద్ధో యాతి గృహీత్వా దణ్డం, తదపిన ముఞ్చత్యాశాపిణ్డమ్


వయసులు ముదరిన వాసన వదలదు,
తలలు నెరసినను తపనలు తీరవు,
అంగమ్ములు అణగారి పోయినా
ఆరాటములీ జీవికి తీరవు

ఆశలు వీడక ఆయువు తీరగ
కాలుని జాలము కంఠము తగలగ
ఎవరొత్తురు నిను ఉద్ధరించుటకు
వివరముగా యిది విచారించుము

ఏకాగ్రత మది స్ధిరతను కూర్చు
సాధనతో సంయమనము వచ్చు
కోరికలకు అది కళ్ళెము కట్టు
శ్రీహరి చెంతకు చక్కగ చేర్చు

సాధన చేసిన సమయును మోహము,
మోహనాశమే ముక్తికి మార్గము,
తామస తిమిరము తీరిన క్షణమే
తత్వమార్గమది తేట తెల్లము ||స్మరించు||యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ హస్తామలకాచార్యులవారు. తలవెంట్రుకలు నెరసినను, చర్మము ముడతలు బడ్డనూ, నడుము వంగి వృద్ధాప్యముతొ కఱ్ఱ పట్టుకొని నడచు చున్ననూ, మనసులో మార్పు రానిదే ఆశలు వదలవు. అనగా శరీరము మార్పులు చెందిననూ, మనిషి యాలోచనా విధానము మార నంతవఱకు యజ్ఞానము, మోహము వదలదు. అందుకే అన్నారు “ తలలు బోడులైన, తలపులు బోడులా అని”. కనుక మనసులో మౌలికమైన మార్పు రావలెను, ఆలోచనా విధానము మారవలెను. అది మార నంత వఱకు బుద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుండు నన్నట్లు, అరిషడ్వర్గ భూయిష్టమై, ఆశా మోహముల అడుసులో నానాటికి మునిగి పావుచూ, పరతత్వానికి దూరమగుచుండును. కాన మానసిక సాధన ద్వార అట్టి దుష్ట బుద్ధులను లొంగ దీసుకొని, కోరికలకు కళ్ళెము వేసి, ఏకాగ్రతను సాధించి, పర బ్రహ్మను మదిలో ప్రతిష్ఠాపించి ముముక్షువులు గావలెను.
This lesson was taught by Sri Hastamalakacharya, he said, dear friend! The change should come mentally, not physically. If head is gray and body is old, then also, the mind will be immersed with worldly attractions, then what is the use ? Even though strength has left the man's body; the mass of desires does not go, then the attachment is strong and he clings firmly to fruitless desires. As long as ignorance (AGNANAMU) and attraction ( MOHAM) does not go away from mind, nobody can get peace of mind, stability and concentration, if you don’t have these, you cannot sit and pray even for a minute, so clear your mind of all wrong thoughts and attractions, then the way of practice ( Moksha Margamu) is very clear to you, you will know by your self, the way you have to proceed and way you have to do things, in the path of acquiring salvation.

18. agre vahniH pRishhThebhaanuH
raatrau chubukasamarpitajaanuH .
karatalabhikshastarutalavaasaH
tadapi na muJNcatyaashaapaashaH

అగ్రే వహ్నిః పృష్ఠే భానూ, రాత్రౌ చుబుకసమర్పితజానుః
కరతలభిక్షస్తరుతలవాస, స్తదపి న ముఞ్చత్యాశాపాశః


వస్తు త్యాగము కాదతి ముఖ్యము
దుర్గుణ త్యాగమే అత్యవసరము
చిత్తములోన దోషము తొలగిన
భక్తీ, ముక్తీ దక్కును తధ్యము

చేతిన మాలా చక చక తిరుగును
నారాయణ అని నాలుక పలుకును
మూడు లోకములు మనసు తిరుగుచూ
చేసిన పూజలు సున్నగ మిగులును

పాదార్చనలు పూజలు సేవలు
మూడు వేళల మంత్రోచ్చరణలు
ఆలయాలలో అభిషేకములు
అంతరంగమున అసూయ జ్వాలలు

శాంతము, సౌమ్యము, సాధు వర్తనము
స్నేహము, ధర్మము, సత్యపాలనము,
సర్వ జీవ సమ భావ వర్తనము,
సాధు పురుషులకు స్వభావ సిద్ధము

అట్టి వారే యీ జీవకోటిలో
అందరి కన్నా ఆత్మ జ్ఞానులు,
బ్రహ్మ చింతన పూనిన జీవే,
బ్రహ్మానందము పొందెడి భోగి

నిర్మల జ్ఞానము, నిత్య ధ్యానము,
నారాయణ నుతే నిజమగు యోగము,
నర సేవే నారాయణ సేవని
ఎఱిగిన వాడే నిజమగు యోగి ||స్మరించు||


యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ సుబోధాచార్యుల వారు. మోక్షాసక్తులు వదల వలసినది వాసనలు, వ్యామోహము, ఆశలు గాని, వస్తు సముదాయములు గాదు. భౌతిక వస్తువులు త్యాగము చేసినంత మాత్రమున మోక్షప్రాప్తి జరుగదు. కొందరు ఇండ్లు వదలి, బైరాగులై, భిక్షాటనతో పొట్ట గడుపు కొనుచూ, ఏ చెట్టు క్రిందనో జీవించుచూ, చలి, ఎండ, వానలు భరిస్తూ మోక్షము వచ్చునని కలలు గందురు. కాని బాహ్య వస్తువులు, సుఖముల నన్నింటిని త్యాగము చేసినా, వారు మనసుకు పట్టిన ఆస, అరిషడ్వర్గములు, మానసిక దోషములు, కోపతాపములు, వాసనలు వదలు కొన లేక పోవుచున్నారు. ఆ కారణము వలననే వారికి మోక్షము గగన కుసుమము అగును. మనసు మాధవుని పై లగ్నము చేయక, కేవలము పెద్దగా సంసృత మంత్ర పఠనము, ఆడంబరమైన పూజలు, గుళ్ళ యందు అర్చనలు, అభిషేకములు, వ్రతములు, ఉపాసనలు, భగవత్ గీత, భాగవత పఠనలు, మోదలగు బాహ్య కార్య కలాపములు చేయుచూ, తాము భక్తులమని, గురువుల మని, అందరి కన్న ఉత్తముల మన్న భ్రమలో బడి, మోక్ష ప్రాప్తి నాశింతురు. కాని భగవంతునిపై ఏకాగ్రత, స్థిర చిత్తము లేక యీ కార్య కలాపములు కేవలము నటనలగునే గాని, మానవుని బంధ ముక్తుని చేయలేవు. మనసు మాధవుని పై స్థిరముగా లేక వెయ్యి సార్లు విష్ణ్ణుసహస్రనామ పఠనము కన్నా, ఒక్కసారి భక్తిగా మనసు పెట్టి గోవిందా అని తలపోసిన గొప్ప ఫలితము దక్కును. కాన బాహ్య ఆడంబరములకన్నా, వస్తు త్యాగములకన్నా, దుర్వ్యసనా త్యాగము, హృదయ స్థిరత్వము మోక్షదాయకములగును.

The next lesson was taught by Sri Subhodacharya, he said, dear friend! The main secrete of acquiring salvation is getting detached with bad habits, thoughts and bad practices, not detaching worldly physical things. Even if you sit in a forest, if your mind is still not stable and gets attracted with the desires of human life, then what is the use. Whether you sit under a tree in forest, or in a comfortable chair in a palace, if your mind is not attached to any, that is what is most important, you should attach your self with the lotus feet of LORD, then only you can acquire things like, peace of mind, tranquility and salvation. If Japa Mala is moving in your hand, and your tongue is moving and chanting the name of LORD, and your mind is moving through out the world, with worldly thoughts, then what is the use, that is not a prayer at all, in Kabirs words

With a concentrated mind, if you pray even one moment that is good enough. Desires are the enemies for us. As long as we are slaves to desires, as long as we have bondage of desires, where lead a life in jungle taking shade under a tree, getting warmth from sun, filling stomach with alums, there is no use. If we are a wretched puppet at the hands of passions, what ever we do is a waste. So control your desires which are the first step to acquire Moksha.

19.kurute gaNgaasaagaragamanaM
vrataparipaalanamathavaa daanam.h .
GYaanavihinaH sarvamatena
muktiM na bhajati janmashatena

కురుతే గఙ్గా సాగరగమనం, వ్రతపరిపాలన మధవా దానమ్
జ్ఞాన విహీన స్సర్వమతేన, ముక్తిం న భజతి జన్మ శతేన.


గంగా నదిలో గంటలు మునిగిన,
కొండ గుహలలో వాసము చేసిన
వ్రత దానములు విరివిగ చేసిన
దొరకదు దివ్య జ్ఞాన రత్నము

నూరు జన్మలు తపముల చేసిన
మంత్రములెన్నో మననము చేసిన
ఆత్మజ్ఞానము అబ్బని వానికి
మోక్షఫలము మృగతృష్ణే గాదా ?

వనవాసమున ఒంటరిగుండిన
భిక్షాటనతో పొట్టను నింపిన
ఆశలు వీడని హృదయములోన
ఆత్మజ్ఞానము అంకురించునా ? ||స్మరించు||


యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ సుర్వేశ్వరాచార్యులవారు. బాహ్యకర్మల వలన జ్ఞానము గాని, మోక్షప్రాప్తి గాని కలుగదు. మడి, ఆచారములు, మంత్ర పఠనములు మున్నగు కార్యములు చేసినంత మాత్రముననే జ్ఞానము చేకూరదు. జీవుడు తాను ఆత్మరూపుడనని, యీ జడ దేహముగాదని ఎఱిగి నడుచుకోనంత వఱకు యీ బాహ్య కర్మలు కేవలము ఆటోపములే గాని ఫలిత శూన్యములు. పవిత్ర నదులలో స్నానము చేయుట, తీర్ధయాత్రలు తిరుగుట, దానములు చేయుట, వ్రతముల నాచరించుట మొదలగునవి అవసరమే గాని కేవలము అవి ఆచరించినంత మాత్రముననే మొక్షము గలుగదు. యీ కార్యము లన్నింటి పరమార్ధము చిత్తశుద్దిని పొందుట, తద్వార ఆత్మజ్ఞానము బడసి పరమాత్మకు చేరువగుట. ఈ బహ్య కార్యములన్నీ ఉపకరణములు మాత్రమేగాని, అవే గమ్యములు, పరమార్ధములు గావు. గమ్యము గోవిందుని చరణారవిందములే!

The next lesson was from Sri Sureswaracharya, he said, dear friend! Even if you dip your self in river Ganges thousand times a day and routine spiritual activities like prayer, Bhajan, vratam, danam and mundane spiritual works, for hours together, it does not help, until you acquire GNANAM ( self realization), it does not mean, they are useless, they help you once you acquire knowledge, they are only a means, not the ultimate goal. No routine prayers or practices help you, until that point, where your mind is clear from ignorance and MOHAM, the cloud of worldly desires. Once the cloud of MOHAM is cleared, your mind will shine like sun with knowledge, then you can see the right spiritual path. Pilgrimage, taking bath in Ganges, observing the religious vows with care; or offers gifts to God, giving away riches in charity, are definitely useful in the path of spirituality. But if he is devoid of knowledge, he does not gain release - according to all schools of thought- even in a hundred lives. What is important is Gnana, the enlightenment, once we acquire that then we will know the right path to take.

20.sura ma.ndira taru muula nivaasaH
shayyaa bhuutala majinaM vaasaH .
sarva parigraha bhoga tyaagaH
kasya sukhaM na karoti viraagaH

సురమన్దిర తరుమూల నివాస, శ్శయ్యా భూతలమజినం వాసః
సర్వ పరిగ్రహ భోగత్యాగః, కస్య సుఖం న కరోతి విరాగఃహరినే హృద్ మందిరమున నిలిపి
ఏకాగ్రతతో ధ్యానము జేసి,
ఆశాపాశమునంతము జేసిన,
మోక్షము గాదా ముంగిటి ఫలము

ఆత్మానందమే అద్భుత సుఖము,
వైరాగ్యమె సుమ వివేకి గమ్యము,
ఆత్మచింతనే అనూన వ్రతము,
పరభావనయే పరమ సౌఖ్యము ||స్మరించు||యీ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరులవారి శిష్యులు శ్రీ నిత్యానందాచార్యుల వారు. శుద్ధ మనస్కులై, ఆశా పాశములు విడనాడి, ఏకాగ్ర చిత్తముతో హరి ధ్యానములో గడుపుచూ, వస్తు త్యాగము చేసి, భూతల శయనముతో, సాధారణ వస్త్రములతో జీవించునో వానికి మోక్షప్రాప్తి తధ్యము. ఆత్మ శుద్ధితో, దైవచింతనతో, వస్తు విరాగులై, వైరాగ్య కాముకులై, సుఖ సంతోష మనస్కుడైన వ్యక్తి, పరిపూర్ణతను బొంది, కైవల్య ప్రాప్తినొందును. మనస్సును బాహ్యవస్తువుల నుండి మరల్చి, అంతరంగమును అంతర్ముఖముగా మరల్చి ఆత్మ చింతన చేయువారికి మహోత్తర ఆనందము సమకూరును. మానవునికి అట్టి ఆత్మ సుఖము బడయుటే జీవిత గమ్యము గావలెను. వైరాగ్యము, ఆత్మచింతన అనునవి పరమ సుఖానికి ముఖ్య కారణములై యున్నవి. కాన సంపూర్ణ, అత్యంత సుఖము ననుభవించ వలెనన్న, వైరాగ్యమును ఆశ్రయించక తప్పదు.

The next lesson was taught by Sri NityanandaCharya, he said, dear Friend! With a fresh mind, away from thoughts and worldly attractions, and with concentration, if you pray Lord, and lead a simple life in divine thoughts, and detach your self from all the worldly things, then the ultimate stage of devotion, the MOKSHAM will be in your hands. You acquire the bliss of tranquility, the PARAMANDAM.

Living in temples or at the foot of trees, sleeping on the ground wearing deer-skin, renouncing all possessions and their enjoyment - to whom will not dispassion bring happiness? Give up all attachments and renounce all comforts. Blessed with such Vairagya, could any fail to be content ?