Gandhi Jayanti

G. Venkateshwara Rao

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here



నవ్వుచుంటివా మహాత్మా?
అవునులే!
నీవు తెచ్చిబెట్టిన స్వరాజ్యము
నేడు షష్టిపూర్తికి వచ్చినది;
స్వతంత్ర భారత దేశము జగతిలో
పేరుప్రక్యాతులతో తులతూగుచునున్నది

నవ్వుచుంటివా మహాత్మా?
గానీ
కొంచం తెర ప్రక్కకుదీసి లోనికిచూడాలి
నీవిన్ని ఆశలుపెట్టుకుని త్యాగాలు చేసి
బానిసత్వ్యమ్ము విడిపించిన బారతదేశము
ఎటుపోతున్నదో! ఎలాపోతున్నదో!

నవ్వుచుంటివా మహాత్మా?
ఎందుకనో?
మీరు హరిజనులని పేరుపెట్టిన నిస్సహాయులు
పదవులొచ్చినా, రిసర్వేషన్లిచ్చినా, అలాగే మిగిలిపోయే
రైతుల కష్టాలటులే నుండిపోయే; సామాన్య
ప్రజల నష్టాలు రోజురోజుకూ పెరిగిపోయే.

నవ్వుచుంటివా మహాత్మా?
నాడు,
హే రామ్‌ అని ప్రాణాలర్పించిన జాతిపితా, మీ సుపుత్రులు
నేడు రాముడే లేడనుచు వాదించు ఘనులాయిరి
హిందూ ముస్లిం భాయీ భాయీ అని మీరు బోధిస్తే
వీరు మస్జీదుని పడగొట్టి గుడిని కట్టించు మూర్ఖులాయ

నవ్వుచుంటివా మహాత్మా?
మరి
ఇది మందహాసమా, పరిహాసమా?
ఒకప్పుడు గాంధీ అంటే మహాత్ముడని,
Italian of the East అంటే తేనెలొలుకు మన తెలుగుయని
అందరెరుగుదురు; మరి ఇప్పుడు? ఒక ఇటాలియన్ని
మహాత్మురాలంటున్నారే! ఇదేమి విపరీతమో?!

నవ్వుచుంటివా మహాత్మా?
ధన్యజీవివి;
భారత స్వాతంత్ర విజయోత్సాహ సమయంలో
దేశము ఎంతో ఎంతెంతో ఘనతపొందుతుందనే ఆశతో
సుఖముగా మరణించితివి; నేటి ఈ దుర్గతి చూడలేవు
మీ 138వ జయంతి సంబరాలు పంచుకోలేవు