జ్ఞానోదయం

ప్రసాద్‌ కొమ్మరాజు (Prasad Kommaraju)

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here

ధనం తాలుకూ దర్పం ఆ భవంతిలో అడు గడుగున కనిపిస్తొంది. ఏ ఏటి కా Yఏడు వసూలు చేసుకొన్న చక్రవడ్దీలే ఇనుప కడ్డీ లుగా మారిన రుజువుగా అంతస్తు మీద అంతస్తు పెరుగుతూ పోయింది. కూలీ, నాలీ జనుల కండల బలాన్నంతా పిండుకొని కట్టినట్టుగ పది అడుగుల ప్రహ రీ గోడ భవంతి ఆవరణ చుట్టూ, లోపల ఏం జరుగుతోణ్దో బయటి ప్రపంచానికి తెలియనీయకుండా - కొండ చిలువలాగ - మెలికలుగా నిలిచి ఉంది. పేద వాళ్ళ నెత్తురుతో అద్దకం చేసి నట్టుగ ఎర్రని తివాచీ అంత పెద్ద హాలు మొత్తాన్నీ మెత్తగా పరుచుకొని ఉంది. ఆ హాలులో అసహనంగా అటు, ఇటు పచా ర్లు చేస్తున్నాడు పట్నంలోని ప్రముఖ వడ్డీ వ్యాపారి ధనుంజయం. అతని దగ్గర డబ్బు అప్పు తీసుకుంటే సాలె గూట్లో పురుగు ఇరుక్కున్నట్లుగ అని చెప్పుకుంటూ ఉంటారు. పరిస్థితులకు తలవంచి ఏదో ఒకటి తాకట్టు పెట్టి అప్పులు చెయ్యటం అనేది పేదవాడి బలహీనత ఐతే, దయా దాక్షిణ్యం లేకుండ ముక్కుపిండి వసూలు చేసుకోవడం ధనుంజయం ప్రత్యేకత.

ప్రస్తుతం అతని కళ్ళల్లో ఏదో కసితొ కూడిన అసంతృఉప్తి స్పష్టంగా తొంగిచూస్తోంది. ధనదహంతో నాలుక పిడచకట్టినట్టుగ లో గొంతుకతోచెప్పాడు -

"ఇవ్వాళ ఆ రాములయ్య పీక పిసికి అయినాసరే డబ్బుకక్కిస్తాను."

ఉదయం నుంచి భర్త అవస్థను ఓకంట గమనిస్తూనే ఉంది రాజేశ్వరి. సాక్షాత్తూ రావణాసురుడి భార్య మండోదరి లాగా ఉత్తమ గుణాలను పుణికి పుచ్చుకున్నదఆమె. భర్త సంపాదిస్తున్న పాప పంకిలాలకి దూరంగఆ ఉంటూ పూజా పునస్కారలతో కాలక్షేపం చేస్తూంటుందావిడ. భర్త మాటలు వినీ విననట్టూరుకుంది.

"రెండుసార్లు కబురు పంపించినా కూడా నేనంటే లెక్కలేదా వాడికి?" ఈసారి పూజగదిలోని రాజేశ్వరికి వినిపించేలా నే అరిచాడు ధనుంజయం.

"ఎందుకండీ ఆ రాములయ్య మీద విరుచుకుపడతారు. కొంచం అయినా కనికరం చూపించకూడదా. ఇప్పటి వరకూ కట్టిన వడ్డీ తోనే ఎపుడో మీకు ఇవ్వాల్సిన బాకీ తీరిపో యి ఉంటుంది అనుకోకూడదా ! ఇంకా ఆ రాములయ్య ఏమి ఇవ్వగలడని ఇలా కోపం పెట్టుకుంటారు?" మెల్లగా సర్ది చెప్పపో యింది.

"ఛీ నీకు తెలియదు ఉండవే! కూతురు పెళ్ళికని ఆరేళ్ళ క్రితం తీసుకున్న డబ్బు! వడ్డీ తప్ప-ఇప్పటి దాకా 'అసలు ' మాటే ఎత్తకుండ, పైగా ఇపుడు కబురు పంపినా కూడా మొహం దాటేస్తాడా?"

"వాళ్ళ విఐపు నుంచి కూడా ఆలోచించండి. ఏ ఏటి కా ఏడు వెయ్యేసి రూపాయలు ఇస్తూనే వస్తున్నాడు కదా. తీసుకున్న ఆరు వేలు మీకు ఈ ఆరేళ్ళలో వడ్డీ రూపంలో వచ్హేసిందనే అనుకోవఛునుకదా. పైగా ఇచ్హిన డబ్బు కూడా ఏదో మంచి కార్యానికే ఉపయోగపడిందని మీరూ సంత్రుప్తి పడి, రాములయ్య బాకీ చెల్లువేసుకోవఛును కదా?"

"చెల్లు వెయ్యాలా, ఇదిగో ఆనాడు కూ డా నీ మాటలు వినే, నా కిష్టం లేకపో యినా వాడికి డబ్బిఛాను. ఇపుడేమో పూర్తిగా మర్చిపోవాలా?" వ్యంగ్యంగా చెప్పాడు.

"అవేవో పొలం కాగితాలు కూడా మీ దగ్గర తాకట్టు పెట్టాడు కదండీ?"

"ఆ తాకట్టు! ఎక్కడో గోదావరికి ఇరవైమైళ్ళ దూరంలో ఉందా పొలం. దమ్మిడీకి కొరగాని ముష్టి ఎకరం న్నర. తెగనమ్మితే నాలుగు వేలు కూడా రాదు".

బహుశ తన భర్త బోటి వాళ్ళను గురించే కాబోలు ఆనాడు వేమన అన్నట్టు....

"పాల సాగరమున పవ్వళ్ళించిన నాడు
గొల్ల ఇండ్ల పాలు కోరనేలొఓ
ఎదుటివారి సొమ్ము ఎల్లవారకు తీపి
విశ్వదా భిరామ వినురవేమ"

మనసులోనే అనుకొని భర్తకు దగ్గరగా వచ్హి ఉపశమనంగా చెప్పింది.

"ఏమండిఈ మనకు ఉన్న ఇంత ఆస్థి - సంపదాచాలవా? అయినా మనకు కనీసం ఓ పిల్లో పిల్లాడో అయినా లేరాయె. ఎంత సంపాదిస్తే కట్టుకుపొతాం గనక! మీరు ఈ సంపాదన ధ్యాస తగ్గించి కొంచెం ఆధ్యాత్మికం వైపు ఆలోచించండి. మనసుకు శాంతిగా ఉంటుంది."

"ఇదిగో - ఈ మెట్ట వేదాంతాలు నాకు చెప్పక. ఇవాళ అటో ఇటో తేలాల్సిందే. 'చక్రవడ్డీ - ధనుంజయం' దగ్గిరా - ఆ రాములయ్య వేషాలు! చెప్తాను ఇవాళ వాడికి నేనంటే ఏమిటో!" చెప్పులు వేసుకొనిబయటకు వెళ్ళ బోతున్న భర్త తో ఆఖరు ప్రయత్నంగా చెప్పింది.

"ఇవాళ బయట వాతావరణం కూడా అంత బాగాలేదు. తుఫాను వచ్హేలా ఉంది. ఇప్పటి కిప్పుడు 'గట్టుపల్లి ' కి గోదావరి మీద అంత దూరం ప్రయాణం మంచిదికాదేమో! నిదానంగా ఆలోచించండి...." చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు అయింది రాజేశ్వరి వేడికోలు. హుంకరించుకుంటూ కోపంతో బయటకు నడిచాడు ధనుంజయం.

"క్రిష్ణ పరమాత్మా, ఈయనకు ఈ డబ్బు పిచ్హి తగ్గించి, మంచి మార్గం లో నడిపించు తండ్రీ!" దేవుడి మందిరం ముందు మెల్లగా రోదిస్తూ ప్రార్ధించుకుంటోంది రాజేశ్వరి

****

గోదావరీ పుష్కర ఘా ట్‌ కు దగ్గర్లో ఉన్న ఆటొఓ స్టాండ్‌ లో కారు ఆపి గట్టుపల్లి వెళ్ళేందుకు లాంచీ టిక్కెట్లు రానూ పోనూ తీసుకున్నాడు ధనుంజయం. రాములయ్యతో తనబాకీ విషయం అమీ తుమీ తేల్చుకుని, ఇదే లాంచీ లో నే వెనక్కు రావటనికి వీలుగా ఉంటుందని తిరుగు ప్రయాణం టిక్కెట్టు ముందు గానే తీసుకుని బయల్దేరాడు.

నిండుగా ప్రవహిస్తున్న గోదావరి మీద - నిండు గర్భిణిలాగా - లాంచీ నీటిని రెండుగా చీల్చుకుని పెద్దగా శబ్దంతో ముందుకు దూసుకు పోతోంది.అంతకంతకు కోపం పెరుగుతోంది ధనంజయానికి. అరగంట గడిచాక లాంచిలోని ప్రక్క వ్యక్తిని అడిగాడు. "గట్టుపల్లి ఇంకా ఎంతసేపు పదుతుంది?"

నాలుగు వేళ్ళకూ ఉంగరాలు, మెళ్ళో జత బంగారు గొలుసుల్తో, భారీకాయుడైన ధనంజయాన్ని భయంగా చూసి చెప్పాడా వ్యక్తి.

"ఓ, అల్ల ఆ కొండ మలుపు తిరిగినంక, నాలుగైదు మైళ్ళు పోవల్న".

ఏమీ తోచక అసహనంగ ఆ మరబోటు చెక్క అంచు మీద ఉంగరం వేళ్ళతో టకటక లాడిస్తున్నాడు. కొద్దిసేపటికి లాంచీ వేగం తగ్గి గట్టుపల్లి తీరంలో ఆగింది. మరికొందరితోపాటు క్రిందకి దిగిన ధనుంజయం చుట్టూ పరికించి చూసాడు. ఒక మాదిరి పల్లెటూరు అది. అక్కడ నుంచి చిన్న చిన్న పడవల మీద, బల్లకట్ల మీద లాంచీ మీద పట్నానికి పోతుంటారు వూరివాళ్లు. ఆ ఊరిని పట్నంతో కలిపే దారి - ఈ గోదావరి ఒక్కటే.

ఆ నదీ తీరంలోనే చేపల వేట ముగించి పడవకు లంగరు కడుతున్న రాములయ్య దూరం నుంచే ధనుంజయాన్ని చూశాడు. ఒకింత ఆశ్చర్యం, భయం కలిగాయి. ఇసుక ఒడ్డు మీద పల్లె వైపు పెద్దపులిలా కదులుతున్న ఆయన్ని నోటికి గుండ్రంగాచేతులు పెట్టి గట్టిగా పిలిచాడు.

"అయ్యగారూ!"

వెదకబోయిన తీగ కాలికే తగిలినట్లుగా రాములయ్యకేసి వడి వడి గా వస్తూ కోపంగా చెప్పాడు- "ఏరా నీ కోసం ఇంతదూరం రప్పిస్తావురా? నేనుకబురు పంపితే వెంటనే రావాలని తెలియదురా - ఒళ్ళు కొవ్వెక్కి బాకీ ఎగ్గొడదామని చూస్తున్నావా?"

"కోపం పడకండయ్యా - వారం రోజులనుంచి జ్వరపడి ఇయాలే లేచినా. ఈ ఏడు వరదలొచ్హి పంటలన్ని కొట్టుకుపోయినయ్యిదొరా. నోటికాడి కొచ్చిన కూడు గోదాట్లో కలిసిపోనాది. ఏ దారీ దొరక్క రోజంతా చేపలు పట్టుకుని సంతలో అమ్ముతున్నాను. మీ కాడకు రేపో మాపో వద్దామనే అనుకుంటాండాను."

"అసలు ఎలాగూ ఇచ్చేది లేదు! ఈ ఏడాది వడ్డీ కూడా ఎగ్గొట్టానికా ఈ కాకమ్మ కబుర్లు!! ఏంచేస్తావో, ఎలా చేస్తవో నాకు తెలియదు. నీ దగ్గర ఉన్నదంతా కక్కు ముందర" కర్కశంగా గద్దించాడు.

"ఇంటికాడికెళ్ళి మాట్లాడుకుందారండీ అయ్యగోరూ. వాన పడేలాగా ఉంది"

దగ్గర్లోని తన ఇంటికి తీసుకెళ్ళాడు. చెక్క కుర్చీ కండువాతొ తుడిచి వేసి, కొబ్బరిబోండాం కొట్టటానికి చెట్టు దగ్గరకు వెళ్లాడు. అరుగు మీద సింహంలా ఉన్న ధనుంజయన్ని తలుపు చాటు నుంచి భయంగా చూస్తున్నడు ఐదేళ్ళ రాములయ్య కొడుకు. పెళ్లికెదిగిన రెండో కూతురే రాములయ్య ఇంటికి ప్రస్తుతం ఆడదిక్కు.

"అట్లా నిలబడ్డావేమే. మన ఇంటికి అయ్యగారు వచ్చారు. కాళ్ళుకడుక్కోవ డానికి పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టే" కూతుర్ని గదమాయించాడు.

"ఇదిగో ఈ మర్యాదలు చాలుగానీ, ముందర అసలు విషయం చెప్పు. ఈ ఏడు నాకివ్వాల్సిన డబ్బు ఎక్కడ?"

"పెద్ద పిల్ల పెళ్ళై నాక నాకాడ మిగిలింది ఈ ఇల్లు, ఇంకా మీ కాడ పెట్టిన ఆ పొలం బాబయ్యా! ఏదో రేటుకు ఆ పొలం అమ్మి మీ బాకీ జమ చేసేస్తాను. కొంచం ఓపిక పట్టండి. ఇప్పటి కిప్పుడు డబ్బు తెమ్మంటే..." దీనంగా అర్ధిస్తున్నాడు రాములయ్య.

"ఏంటీ ఇంకా ఆగాలా? పొనీలే పాపం అని జాలిపడి పిల్ల పెళ్ళి కి డబ్బు ఇస్తే, ఇపుడు మళ్ళీ అడ్డమైనబాధలు కష్టాలూ నాకెందుకు చెప్తావురా? నా డబ్బు నా కిస్తావా? బలవంతంగా ఇంట్లోంచి మెడపట్టి గెంటించమంటావా?"

ఎంత ప్రాధేయపడుతున్నా వినిపించుకొకుండా తండ్రి మీదపులిలా గాండ్రిస్తున్న ధనుంజయం దగ్గరకు లోపల నుంచి ఒక చిన్న చెక్క పెట్టి తెచ్చి ఇచ్చింది రాములయ్య కూతురు.

ఏమిటన్నట్లు కళ్ళెగరేసి దానికేసి చూశాడు.

"అయ్యగారూ ఇది మా యాడది పోతూపోతూ దీని పెళ్ళికి పెట్టమని ఈ పసుపుతాడు నా చేతిలోపెట్టి వెళ్ళీపొయింది. ఈ పుస్తెలు తప్ప నాకాడ వీసమెత్తు బంగారం కూడా లేదు. పోనీ దీన్ని కూడా మీకాడనే ఉంచండి. మరో ఏడాది గడువిప్పిస్తే, ఏదో రకంగా కాయ కష్టం చేసుకుని మీ బాకీ చెల్లుజేసుకుంటాను" - రాములయ్య గొంతుబొంగురుపోయింది.

ఇప్పట్లో వాడెలాగూ డబ్బు ఇవ్వలేడని అర్ధమైంది ధనుంజయానికి. అందుకే ఆ పుస్తెల తాడుని చేతిలోకి తీసుకుని, తూచినట్టుగా చూసి, జేబులోకి జారవిడిచారు.

"మళ్ళా ఏదో కల్లబొల్లి కబుర్లు చెబితే వూరుకోను. వచ్చే ఏడాది కల్లా బాకీ తీర్చావా సరి లేదా నీ అంతు చూస్తాను." విసురుగా లేచాడు ధనుంజయం. కసాయి వాని వెనకాల గొర్రెలాగా రాములయ్య కూడా కదిలాడు.

"బాబుగారూ ఈ రేత్రికి ఈ కాడనే ఉండిపోండి.బాగా మబ్బు పట్టి ఉంది".

"ఈ మబ్బులేవీ ఏం జేయ వు నన్ను. ఇంకాసేపట్లో ఆ లాంచి ఎగువ నుంచి రానే వస్తుంది. తిరుగు టిక్కెట్టు కూడా ముందే కొన్నాగా, వెళ్ళాల్సిందే!" వడిగా నడుస్తున్న ధనుంజయం వెనకలే రేవు దాకా అనుసరించాడు రాములయ్య.

అప్పటికి దాదాపు రెండు గంటలు పైగా ఎదురుచూస్తున్నాడు కానీ మరొక వూరిదాకా ఎగువకు వెళ్ళిన లాంచీ వెనక్కు - గట్టు పల్లికి - వస్తున్న జాడ కనపడ్డం లేదు. తిరిగి వస్తుందని లాంచీ వాడు చెప్పిన టైం ఎప్పుడో దాటిపోయింది! ఆలోచనలో పడ్డాడు ధనుంజయం. ఏమైవుటుంది. తిరిగి రావాల్సిందేనే ఈ పాటికి. ఒకవేళ లాంచీ తిరుగు ప్రయాణంట్రిప్పు కేన్సిలు ఐయిందేమో.... రాములయ్య, ధనుంజయం తప్ప జన సంచారం కూడా లేదా ప్రదేశంలో. పరధ్యాన్నంగా ఉన్న ధనుంజయంతో చెప్పాడు రాములయ్య. "పోనీ నా పడవలో పట్నానికి మిమ్మల్ని దింపుదమంటే, దారిలో వాన గానీ పడితే తమరు తడిసి పోతారనిచూస్తున్నాను. ఇలాంటప్పుడు పడవలో గోదావరమ్మ మీద యెల్లటం ప్రమాదం కూడా నండయ్యా. ఈ రేతిరికి ఈ కాడనే ఉండి పోండయ్యా.."

ధనుంజయానికి అహం అడ్డు తెరగా నిల్చింది. పట్టు పరుపుల మీద శయనించే ఆగర్భ శ్రీమంతుడైన తాను ఈ దరిద్రుడి కొంపలో ఈ రాత్రికి ఉండటమా? వీల్లేదు. పైగా బాకీ వసూలు కని వచ్చి వాడినే ఆశ్రయించటమా? ఎంతమాత్రం కుదరదు.

"ఇదిగో వానా లేదూ ఎండా లేదు. నీ దగ్గర నుంచి రావాల్సిన డబ్బు ల్లాగే ఇది కురిసే వాన కాదుగానీ, నీ పడవ నీళ్ళలోకి లాగు! నేను తడిసినా పరవాలేదు ముందు రాత్రికి పట్నం చేరుకొవల్సిందేరా!" ధనుంజయం లొ వివెకం నసిస్తోంది అంతటి వాతావరణంలో కూడా పడవ తియ్య మని ఆదేసించాడు.

అంతకంతకూ ఉరుములూ, మెరుపులూ అధికమవుతున్నాయి. దానికి తోడు పెనుగాలులూ ఉధృఉతమవుతున్నాయి. శక్తికొద్దీ తెడ్లు వేస్తూ పడవని నడపటానికివిశ్వ ప్రయత్నం చేస్తున్నాడు రాములయ్య. ధనుంజయాన్ని రాత్రి లోపు పట్నం జేర్చాలన్నదే అతని లక్ష్యం! అయితే వీస్తున్న ఈదురుగాలులకి నిండు గోదారి మధ్య పడవ వంకరటింకర్లుగా తేలుతూ ఎటో సాగిపోతోంది. క్రమంగా చీకట్లు కమ్ము తుండడంతో అసలుసంధ్య వేళే అర్ధరాత్రా అన్నట్లుగా అనిపిస్తోంది. పది అడుగుల ముందు కూడా కళ్ళు చించుకున్నా కనపడని చిమ్మ చీకటి అలుముకుంది. దానికి తోడు చిన్న చిన్న చినుకులుగా వర్షం మొదలైంది.మొదటి సారిగా తనని తాను నిందించుకున్నాడు. గట్టుపల్లిలో ఆగిపోతే బాగుండదేమో. ఇప్పుడు చేతులు కాలిన చందం లాగా ఉంది! అసలే తనకు ఈత కూడా రాదాయె. 'ఇప్పుడీ జోరు వానలో ఈ పడవకు ఏమైనా ఐతే' - ఆలోచించలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ధనుంజయం.

పెనుగాలికి తెగిన గాలిపటంలా పడవ ఇష్టం వచ్చిన వైపు పరుగులు పెడుతోంది అలల మీద పైకి లేస్తూ దిగుతూ ఎటు వైపో దూసుకు పోతోంది. కుండపోతగా కురుస్తున్న వానతో పడవలోకి నీళ్ళు నిండిపోతున్నాయి.

"అయ్యగోరూ, ఆ బుట్ట తీసుకుని నీళ్ళు బయటకు తోడెయ్యండి. నేను ఏదో ఒక ఒడ్డుకు చేరేలాగా తెడ్డు వేస్తుంటాను." - హొరు గాలిలో గట్టిగా అరుస్తున్నాడు రాములయ్య. అంత అలవాటైన గోదావరి నదీ, ఇప్పుడు పరవళ్ళు తొక్కుతూ, చిమ్మచీకటిలో తుఫానులో ఎక్కడ ఉన్నారో తెలియనట్టుగా తోస్తోంది రాములయ్యకు.

ప్రకృఉతి ప్రళయ భీభత్స రూపానికి ఆ నదీ ప్రవాహం అద్దం పడుతున్నత్లుగా ఉంది. ఒక భయంకర జంతువు కోరలు చాపి మీదకు వస్తున్నట్లు - ఉవ్వెత్తున ఊళలు వేస్తూ కెరటాలు దూసుకు వస్తున్నాయి. పైనా క్రిందా అన్నివైపులనుంచి నీళ్ళే నీళ్ళు. ఎంతతోడి పోస్తున్నా పడవ నీట నిండి పోతోంది. ఏ క్షణాన్నైనా మునిగిపొయేలా ఉంది. అప్పుడు తెలిసి వచ్చింది ధనుంజయానికి ప్రాణభయం అంటే ఏమిటో. నిత్యం తాను ఎంతమందిని పీడించిన ఫలితమో ఈవేళ ఈ నిశీధిలో నీళ్ళ పాలు కవాల్సి వస్తోందికదా అనిపిస్తోంది. ధనుంజయం తలలోంచి ధారాపాతంగా కారుతున్న చెమట పైనుంచి కుండపోతగా కురుస్తున్న వర్షంతో కలసి పోయి కళ్ళమీదుగా పెదాలపైకి జారుతూ క్రిందపడుతోంది. అలసటతో బుసలు కొడుతున్నడు. అతని పెదాలు ఒళ్ళు చిగురుటాకుల్లాగా ఒణుకు తున్నాయి. దారంతెగిన పతంగంలా పడవ ఇంతెత్తు గాలిలో తేలిపోతూంటే చావు అంచుల దాకా తాకి వస్తున్నట్లు - పరిస్థితి అటొ ఇటో అన్నట్లూ వుంది. కారడవిలొ బడబాగ్ని కర్చిచ్చు రగిలిస్తున్నట్లుగా, యీ పెను తుఫాను వల్ల నీటి అలలు పదవని ముంచి వేసేటట్లున్నాయి.

సరిగ్గా అప్పుడు ధనుంజయానికి తన భార్య గుర్తుకు వచ్చింది. ఎంత ఉత్తమురాలు రాజేశ్వరి! ఎన్ని సార్లో తనను ఎంతగానో మర్చాలనిప్రయత్నం చేసింది.! " గద్గదిగ స్వరంతో చెప్పాడు - "రాములూ, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. ఈ ఉంగరాలు, నగలూ, నా ఆస్థీ - అంతా ఇచ్చే స్తాను. నన్ను ఎలాగైనా సరే కాపాడు. నా భార్యని ఒక్కసారి చూడాలి". రాములు కాళ్ల్లు పట్టుకుని దీనంగా ప్రాధేయ పడుతున్నాడు.

"అయ్యగారూ, ధైర్యంగా ఉండండి మీ ప్రాణాలకు నా ప్రాణాలడ్డు!!" చకచకా లంగరుకు ఉన్న తాడుని కత్తితో కోశాడు రాములయ్య. అతడు ఏం చేస్తున్నాడో అర్ధం చేసుకునే లోగానే తాడు ఒకకొసను ధనుంజయంఛాతీ చుట్టూ కట్టి రెండో కొసను తన నడుముకు కట్టుకున్నాడు. ఆలోచించే వ్యవధి లేదు.గబగబా ధనుంజయాన్ని మీదకు లాక్కుని నీటిలోకి దూకెయ్యటం, ఉవ్వెత్తున పదవ ముక్కలై దూరంగా విరిగి పడడం జరిగిపొయాయి.

రాములయ్య తన శక్తి కొద్దీ ధనుంజయం శరీరాన్ని తన ఎడం చెత్తో ఒడు పుగా పట్టుకొని కుడివైపు చేత్తో, కళ్ళతో తెడ్డు వేస్తున్నట్లుగా బలంగా నీటి అలల వైపుగా ఈత కొడుతున్నాడు. తానొకటి తలిస్తే దైవం మరోటి తలచినట్లుగా అనుకోని సంఘటన జరిగిపోయింది. ఎవర్ని రక్షిద్దామని తాడు కట్టాడో ఆ తాడే ఉరితాడైయ్యింది అసలే జ్వరపడి బలహీనంగా ఉన్న మీదట ధనుంజయంశరీరాన్ని ఎక్కువ సేపు మోయలేక రాములయ్య శరీరం నీట మునిగి పోతోంది. ఎగిసి పడి కొట్టే అలలతాకిడికి ఆ రెండు శరీరాలూ దూరంగా గట్టున చెట్టు కొమ్మకి తాడుతో మెలిక పడి ముడిగా అతుక్కున్నాయి.

కళ్ళు తెరిచిన ధనుంజయానికి ఏం జరిగిందో జరుగుతోందో అర్ధం కావటానికి, జీర్ణించుకోవటానికి కొంతసేపు పట్టింది. రాములయ్య నిర్జీవ శరీరం తోటకూర కాడలాగా తన ఛాతీకి తాడుతో వ్రేలాడుతోంది!! ధనుంజయం నయనాలు అశ్రు పూరితాలయ్యాయి. గొంతులోంచి ఇఏడుపు కూడా రావటంలేదు. మాట కూడా పెగల ట్ల్లేదు. ఎంత మహనీయుడు రాములయ్య! అతని ముందు తానెంత అల్పుడో అపుడు అర్ధమయ్యింది! డబ్బే లోకం అన్న భ్రమలో ఉన్న తనకు ఆ శ్రీరామచంద్రమూర్తే ఈ రాములయ్య రూపంలో కనువిప్పు కలిగించాడా అనిపిస్తోంది. అన్న మాట ప్రకారం తన ప్రాణాలకు అతని ప్రాణాలు అడ్డు వేసి మరీ తనను ఒడ్డుకు చేర్చ ప్రయత్నం చేశాడు. తన రుణాన్ని శాశ్వతంగా తీర్చుకున్నాడు.

ధనుంజయం మనసులో ఎన్నోప్రశ్న లు. అసలు ఇంతవరకూ ప్రళయాన్ని సృఉష్టించిన ఆ మహాశక్తి ఏమిటి? అలాగే ఆ ప్రవాహానికి ఎదురీది తను ఒడ్డు చేర్పించిన ఈ శక్తి ఏమిటి? అఖండ ఉన్నత హిమాలయాల్లోంచి మంచై కరిగి, నదుల్లో కలిసి చివరకు సాగర సంగమించే నీరు, సుదూరంగా అనంత మేఘమాలికల్లోంచి కురిసి వచ్చే వర్షపు నీరు మూడొంతులు జలమయమై ఈ ప్రపంచాన్ని అనంత జీవరాసుల పుట్టుక గిట్టుకలకు కారణ భూతమై నిరంతరంగా సాగింపజేసే ఈ జల జీవన వాహినికి అసలు ఆధారభూతమైన శక్తి ఏది? ఎన్నెన్నొ ఆలోచనలతో బోధి వృఉక్షం క్రింద తత్వమెరిగిన బుద్ధునిలా జంట పక్షులని విడదీసి పరిపూర్ణ జ్ఞానోదయమైన వాల్మీకిలా ఆ ప్రభాత సమయాన ముందుకు కదిలాడు. ఇపుడు అతను పరిపూర్ణంగా మారిన మనీషి. ఆలోచిస్తే మెల్లగా బోధిపడుతోంది! తన భార్య నిత్యం పఠించే భగవద్గీతలో ఎంత పరమార్ధం!!

“సర్వ భూత స్థిత యోమాం భజత్యే కత్వమాస్థితః
సర్వధా వర్తమానోపి సయోగీ మయి వర్తతే
ఆత్మౌ పవ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున
సుఖం వాయది నా దుఃఖం సయోగీ పరమో మతః

మరో ప్రాణి ప్రాణం రక్షించటంలో తనువు చాలించ గలగటం ఎంత మహోన్నత లక్షణం!

గుమ్మంలొ ఎదురుగా వస్తున్న భర్త ముఖంలో ని వర్చస్సుకు, తేజస్సుకు అతనిలో కనిపిస్తున్న ఆ వెలుగు తాలూకు జ్ఞానం కూడా రాజేస్వరికి మెల్లగా బోధపడింది. జరిగిందంతా తెలుసుకుని భర్తలోని ఆ మార్పుని ప్రసాదించిన ఆ భగవంతుడికి ఎంతో కృఉతజ్ఞతలు తెలుపుకుంది.

ఆ తర్వాత..... రాములయ్య కుమారుణ్ణి ధనుంజయం దంపతులు దత్తత చేసుకున్నారు. అతని రెండో కూతురికి ఘనంగా పెళ్ళి జరిపించారు. ఇతరులకు సహాయపడడం లోని ఆనందాన్ని గ్రహించాడు ధనుంజయం. జ్ఞానోదయ మైన ఆ మహా మనీషి తన ధనాన్ని, సంపదలనూ యావదాస్తిని అనాధలకు, పేదలకూ అన్ని విధాలా సహాయపడేలా వినియోగిస్తూ, శేష జీవితాన్ని భగవత్‌ సాన్నిధ్యానికే అంకితం చేశాడు.