కళాతృష్ణ

J.Bapu Reddi

Editor's Note: I had the distinct pleasure of hearing Sri Bapu Reddi garu read this poem out aloud at a Literary Meet in India, and was captivated by the imagery and choice of words. To fully enjoy this chandObaddhamaina kavitaa, I strongly recommend reading it out aloud.

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here
అందము అందమే మనకు అందిన అందక పోయినన్‌, మన
స్పందన వేరు తార్కిక వివాదము వేవాదము వే రవి రెండు భావనా
నంద నదీ తటద్వయమునా విలసిల్లను, నా విలసిల్లను, ఇంద్రియానుభూ
తీందిర పేదవోదు పడగెత్తిన గెత్తిన ధీబల శాస్త్ర మెంతయున్‌!

రాలును రప్పలున్‌ పనికిరానివి కొండలు, గోతులున్‌ వినా
గాలియు నీరు లేని ఎదోగందరగోళము చంద్రగోళమం
దాలకు ప్రోలి కాదనచు అద్బుత చిత్రము లెన్ని చూపినన్‌
రేల నభోంతరాల శశిరేఖల జూచి చలింపకుందుమా!

ఎముకల గూడు నాడులకు ఇల్ల కళంక కళంక రక్తనా
ళముల సమూహమున్‌ పలల రాశి కళాసప్రతిత్తియేను, దే
హమని ఎరుంగు డాక్టరుకు అందము చందము, కానుపించదా
రమణుల చూచినప్పుడు సరాగ పరాగము పొంగులెత్తదా!

మబ్బులందు పైనించి విమానమందు
ఏమిగల దిందులో, ధూళిధూమ మనుచు
అనుకొనుచు నేలపై దిగి, అంబరాల
తేలు జలదాల అందాల తేలిపోమె!

బాధపడెడివారు బాధించు వారును
వట్టి అభినయించు వారె యంచు
తెలిచి కూడ వెండి తెరమీద దృశ్యాలు
కాంచి కంట నీరు నించుకొనమే!

పుట్టినది గిట్టు, బ్రతుకు బుద్బుదమె యంచు
ఎరిగియున్‌ నరుల్‌ చావుపే రెరుగనట్లు
ప్రాకులాడరె యశము, ప్రాభవము కొరకు
వాస్తవముకన్న బ్రతుకులో భ్రాంతి మిన్న!

చంద్రవిజయమ్ము, విజ్ఞాన శాస్త్రజృంభ
ణమ్ము, ఊహా జనిత కపనమ్ములకును
కళలకు విఘాత మనెడి సుద్దు లవి మిధ్య
శాశ్వతము కళాతృష్ణ ఆ జాబిలి వలె!