కలువ చంద్రుడు

భమిడిపాటి కామేశ్వరి (Bhammidipati Kameswari)

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereమిలమిల మెరిసే నీలిమలో
తళ తళ వెలిగే తారలతో ||మిలమిల||

అల్లంత దూరాన
ఆనింగిని నిన్ను
నీతేజోవిలాసములగని
నిలువెల్ల పులకించి
మురిసి విరిసితినోయీ
వెండి వెన్నెల రేరాజా ||మిలమిల||

జిలిబిలి తారలతో
కేళీవిలాసాల తేలు
నినుగని ఈసుజెంది
ఉసూరంటి ||మిలమిల||

నిన్నె వలచిన కలువను
నన్ను వలచితివని భ్రమసి
అమశనిసి రేయంతయూ
నీకై వేచి జూచి
వేసారితి నోయీ

నీదర్శన భాగ్యమె
కరవాయె
వెన్నెల వెలుగే
అరుదాయె
ప్రభాత వేళ
భానుని తేజము
నోపగలేక
భువిపై సోలుటె
కలువల భాగ్యమా
తెలుపవో
వెలుగుల రేరాజా ||మిలమిల||

తన్మయమైనా
వలపులతేలే
మరచితివోయీ
కలువల రాణిని
ఇలలో వెలయుటె
కలువల నేరమ
తెలుపవ
వెలుగుల రేరాజా ||మిలమిల||