మత మౌఢ్యం

భమిడిపాటి కామేశ్వరి (Bhammidipati Kameswari)

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereమత మౌఢ్యం
మత మౌఢ్యం
మూర్ఖ జాడం
మలిగిపోయి
మానవత్వం
నెలకొనేదెన్నడో
మతంపేరిట
మారణహోమాలు
దారుణకాండలు
అంతర్యుద్ధాలు
అణ్వస్త్రాలు
ఆరని జ్వాలలు
హాలాహలహేలలు
వినాశాలు
అంతమయ్యేదెపుడో
మానవ బాంబులు
మారణహోమాలు
కులమతకుత్సిత
కుతంత్ర క్రూరత్వాలకు
అమాయకుల
ఆహుతులు
అన్ని అంతరించి
కుల మతద్వేషాలు
చల్లారి
సుందరశాంతి
సౌభాతృత్వ సుమాహారం
అవనిమాత గళమున
అమరి
నెహ్రూవిడచిన
శాంతికపోతం
గగన తలాన
స్వేచ్చావిహారం
సలిపే దెపుడో
జాతిపిత
గాంది అహింసాసూత్రాలు
అమలయేదెన్నడొ
ఏమతమందైన
ఏకులమందైన
ఉందురెందరో
కొందరు కుత్సితులు
అందరిని ఒకటిగ
అంచనావేసి
పొరపొచ్చాలు
పోరులేల
వివిధమతాల
వైవిధ్య
ఆచారవ్యవహారములుండు
ఒకరినొకరు
ఎద్దేవజేసి
కించపరచి
కినుకతెప్పించి
కలహించి
మలిగిపోనేల
భూతలమంత
బూదిరాశులుగజేయు
కులమత కుతంత్రాలు
అంతరించి
భూతలమంత
భూతల స్వర్గమయేదెపుడో
సామరస్య సమన్వయములు
సమతామమతల
సమైక్యతాభావం
సుందర ప్రగతికి
సోపానం
సంపూర్ణ శాంతిపధం
సౌభాగ్య బాటకుగమ్యం
జనన మరణాలకులేవు
జాతి మతబేధాలు
ఆకలి దప్పుల కసలేలేవు
కులమత ద్వేషాలు
హైందవులైన
హైందవేతరులైన
ఆంగ్లేయులు
ఆష్ట్రేలియన్లు
మహమ్మదీయులు
యూదులు
ఎవరైనా
మానవాకృతి
ప్రకృతి ధర్మములొకటె
మరియేల
యీ మతమౌఢ్యం?
ఏసుక్రీస్తు
ఏడుకొండలవాడు
అల్లాబాబా
ఈశ్వరుడైన
ఎవరైన
ఏదైవమైన
ఏగురువైన
ఇచ్చేదీవెనలొకటె
వివేకానంద
విజ్ఞానబోధలు
గురునానక్‌
పవిత్రసూత్రాలు
భగవద్గీత, వేదాల
బైబిల్‌ కురాన్‌
పురాణేతిహాసాలసారం
ఏగురుబోధనలు
ఏవేదాంత సారమైన
ఒకే దివ్యసందేశం
మంచితనం
మానవీయత
పరోపకారనైజం
నిస్వార్ధసేవాపరత్వం
పేదధనిక
అబేధభావం
కరుణాంతరంగం
క్షమాగుణం
సదాదైవసాన్నిధ్య
సామీప్యములె
సద్గురు బోధనా
సార్దకములే