నయాగరా

Kameshwari Bhammidipati

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereఅంబరమంటు అందాల జలపాతం
అమెరికా అందాలకే అలంకారం
నయాగరా జలపాతం

నీలాల నింగిని తేలియాడు
తెలతెల్లని మేఘమాలికల ముద్దాడి
జలతారుమెరుపుల జాలువారు
పర్యాటకుల పాలిటి
స్వర్ణసుందర స్వప్నం నయాగరా జలపాతం

కొండకోనల తాకి
కొంటె కోణంగి గంగమ్మ
ఉరుకుల నురుగుల
ఝుంఝుం నాదాల
సరగున పరుగులిడు ప్రవాహం నయాగరా జలపాతం

చూపరుల కనువిందు
వీనుల పసందు
న్యూయార్కు కెనడాల
నడుమవెండి వెలుగులు
వెదజల్లు వారధి నయాగరా జలపాతం

వెచ్చని కిరణాలుసోక
పచ్చని వెలుగల వురికి
దేదీప్యమానమైన
దీపాలకాంతుల
హరివిల్లును మరపించు
జలపాతం నయాగరా జలపాతం

సప్తవర్ణాల మెరసి
నయనానందమలర
సప్తస్వరాల సర్వవాద్యాల
సంగీతనాదాల వీనులవిందుగ
పొంగి పొరలు మనోహరమై
ప్రకృతి శోభగ వరవళ్ళుత్రొక్కు
జలపాతం నయాగరా జలపాతం
అమెరికా అందాలకే
తలమానికమీ నయాగరా జలపాతం