పలుకు పలుకు

Kameswari Bhammidipati

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereపలుకు పలుకులో
మధువులొలక పలుకు
కలకండ తీయందనాలు
జాలు వారు పలుకుల
పదుగురితో మెలుగు
నలుగురి మేలుకోరి
కలతలు కన్నీటి వేళ
కలిగినంత మేలు చేయు ||పలుకు||

మదిలోనివేదన మందిలోపంచకు
నీలోని లోపాలు లోలోన దాచి
పరుల తప్పాలు
పదేపదే ఎత్తిజూపి
ఎద్దేవచేయబోకు
ఎంత వారికైన నుండు
ఏదో ఒక లోపం
చింతించి చూడ ||పలుకు||

ఎంచబోకుమా ఎగ్గులు
పెరవారికైనను ప్రేమనుపంచి
నీలోని సుహ్రుద్భావాన
సమతను పెంచి
సార్ధకత సాధించు ||పలుకు||

నాదనే నన్నది కొంత వీడి
మనదీ మనమన్న పదముతో
ఎన్నికైన మార్గాన నడు
ఇరుగు పొరుగుల
ఉన్నతికి ఈసుజెందబోకు
పొరుగువారి పొరపొచ్చాలకు
పొంగి పోక వలసిన మేలుచేయి || పలుకు||

సిరిగలిగెనేని
సర్వం నీమహిమని
విర్రవీగకు
ఈతి బాధలు ఇక్కట్లకు
కలతలు కన్నీళ్ళకు కృంగిపోక
"ధైర్యే సాహసే లక్ష్మీ" అని
నానుడి మరువక
నీకు నీవుగా నిలు ||పలుకు||

ఒకరిని మించి
ఇంకొకరుండుట
నిక్కమని ఎరిగి
ఈర్షాద్వేషాలు వీడి
ఆనందమందు ||పలుకు||

కులమతద్వేషాల
కాలరాసి
సర్వసమానతా
సమైక్యతా సామరస్వాల
సమతా మమతా పెంచి
సమాజాన సంఘీభావాన
ధన్యజీవివై మెలుగు ||పలుకు||

మనిషి మనిషి కొక
ప్రతిభ ఉండునని
మానవులందరికి
అన్ని సాధ్యపడవని
నిక్కమెరిగి
నీకినీవె సాటిగా నెంచి
దీటుగా నిలబడు ||పలుకు||

స్వార్ధం, గర్వం, దురహంకారం
అధోగతికి నాందిపలుక
నిస్వార్ధం నిగర్వం
నిరాడంబరత
వినయ విధీయతలు
విజయ సోపానములని
మర్మమెరిగి మంచిని పెంచు ||పలుకు||

ఉన్నంతలో ఆర్తుల దీనుల
ఆదరించి చేదదీర్చు