పత్నివిలాసం

భమిడిపాటి కామేశ్వరి

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereఅలనాడు అనంతుడు
లీలామానుషరూపుడు
అష్టపత్నులు, గోపికాస్త్రీల
వివిధరూపాల అపూర్వ
అనురాగమధురిమల
ఆనందలహరి నోలలాడె

రక్తి, భక్తి, సంయుత
రుక్మిణీసతి పృమాభిషేకం
రోషద్వేష ఈష్యాసమ్మిళిత
రమణి సత్యభామాప్రియసఖి
వీరశృంగారకేళీవిలాసం

కాళింది, జాంబవతి, మిత్రవిందాది
కోమలాంగుల కమనీయ
సరసరాగ విలాసహేలా
సుఖభోగములంద

నైతిక విలువల నరసినేడు
నాధుని మురిపింప ఏకపత్నిగ
సర్వభావనా సమాయుక్తయై
సరస, రాగ, వీర, గంభీర
శాంత, రౌద్ర, ఈష్యా, ద్వేష
సరస సంభాషణాచాతుర్య
ప్రణయకేళీవిలాస
మధురిమలందించి
పతినలరించి
అనురాగసుధలనొందుట
హర్షనీయమేకాని
హాసనీయంకానేరదు