ఉమ్మడి కుటుంబ వ్యవస్థ

Kameswari Bhammidipati

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereఅనాదినుండి
ఆచరణాయుత
ఆమోదయోగ్య
ఉమ్మడికుటుంబవ్యవస్థ
అణగారిపోయి

ఆధునికతలో
ఆలూమగలూ
ఇద్దరుబిడ్డలు
ఎక్కచ్చి సంసారాలు
రివాజు, ముదమాయె

తగవు, వగపూ, సానుభూతులతో
తీపీ, పులుపూ, చేదుల
ఉగాది పచ్చడితోయం
ఉమ్మడి కుటుంబం

ఆశనిరాశల
ఒడుదుడుకుల
ఎండమావులచందం
ఏర్పాటుసంసారం

అనురాగద్వేషాల
అల్లుకుపోవు
అందాల సుమకదంబం
ఉమ్మడి కుటుంబం

ఒంటరిపోరాటాల
ఏకాకి జీవనతోయం
ఎక్కచ్చి సంసారం

తలిదండ్రులు
తోబుట్టువులు
తోడికోడండ్లు
అత్తామామా, కోడళ్ళు
అల్లుళ్ళు, బావమరుదులు

అందరొక్కటై
ఆర్తి, ఆనందాలు
ఒకరికొకరై పంచుకుని
చింతా వంతా
చేరి చెప్పుకునే ఉమ్మడికుటుంబం

కలిమిలేములు
కష్టసుఖాలు
కలిసిపంచుకునే
కమ్మని కలకండ ఉమ్మడికుటుంబం

చిరు చిరు తగాదాల
చిన్నపాటి వాగ్వివాదాల
చిన్నాభిన్నంగాక
చెలిమీ కలిమీ పంచుకుని

చేదోడు వాదోడుగ
ఆత్మీయాభిమానముల
అందరొక్కటై సేదదీరు
అందాల పొదరిల్లు ఉమ్మడికుటుంబం

అపకారికైన
ఉపకారము
అన్నరీతిని
ఆర్తిగొన్నవారిని
ఆదరించి సేదదీర్చు
ఆపదలో ఆదుకొను
సంస్కార సంస్కృతి
సమసిపోయి
నాదీనాదను
స్వార్థం ప్రభలిపోయె

నూతనతరానికి
తాతా మామ్మా, అమ్మమ్మాల
నీతిసూత్రాలు
హితబోధలు
పాతకాలపు గాధలు
రోతపుట్టె

స్టార్‌వార్స్‌, స్పైడర్మాన్‌
స్టోరీలు, సినిమాలూ
వేడుకలాయె
వినయ విధేయతలు
వెగటై విదేశవిలాసాలు
వింత వింత పోకడలు
వినోదమాయే ఉమ్మడికుటుంబం

మాదీ మేము
నాదీ నేనను మాట
వేదమాయె
మనదీ, మనమన్న మాట
మృగ్యమాయె

ఎక్కచ్చి సంసారాల
ఆలూ మగల
సంపాదనాతృష్ణలో
ఆలనా పాలనా కరవై

అదుపు ఆజ్ఞలు
అరుదై
పసిపిల్లలేమొ
"క్రెష్‌"లపాలు
పడుచుపిల్లలు
బోటింగులు, డేటింగులంటు
దురభ్యాసాల వూబిలో
అధోగతి పాలు

అందరీరీతిని
ఉందురనబోను
ఎందరో ఈతీరున
అలమటించుట
నిక్కము