వృద్ధాప్య దశ

Kameswari Bhammidipati

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereవృద్ధాప్యదశ
వ్యర్ధార్ద దశ
వ్యద్ధాంతర్ధశ

వదలిన దేహం
వదులైన దుస్తులు
మసకబారిన చూపు
మరచేమనసు

బడలిన హృదయం
సడలిన కండరాలు
తడబడు అడుగులు

వయసులోని చురుకు
ఉరకలు వేసిన
ఉత్సాహం నీరుకారిపోయి
పరుగులవాడి
వలసపోయి
వడివడినడకలు
తడబడిపోవు

నిగనిగమెరిసిన
నీలాలకురులు
నెరసి వెలవెలపోవు
కళకళలాడు మోము
కాంతిహీనమైపోవు

కష్ఠించి పనిచేసిన
కరములు కదల్చలేకపోయి
ఉరుకుల పరుగుల
ఉపాధికై సాగిన అడుగులు
నడవలేక తడబడిపోవు - వృద్ధాప్యదశ

వేదికలెక్కి ఏకధాటిగ
ఉపన్యసించిన వాగ్ధాటి
పలుకు పలుకుకు
మొరాయించు

పదుగురికి
మేలుచేసిన
మానవీయత
మరుగునపడి
తరిమే ఒంటరితనం
తోడుగనుండు

శతసహస్ర శత్రుసంహారము
చేసిన శరీరమైన చేవబాసి
సహాయ మధించు
స్థితి పొందు

పలువురితో కలసిమెలగిన
తనువు పలుకరింపుకై
అలమటించు

ఐదు పదులనుండి
ఆరుపదులవరకు
వృద్ధార్ధశ
ఆపై ఏడుపదులవరకు
వృద్ధాప్యదశ
ఏడుపదులనుండి
ఆపై వ్యర్ధాంత్యదశ