అంజలి ఘటించి

Mohan Vallabhajosyula

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here 
కమలాకరుని రమణీయ రసమయ కాంతులలో
అతి సూక్ష్మమై నలరారు సుధామ మార్గములన్
యేరీతి మసలిన నేమి, మదర్పిత మాధవీ సాద్రుస నమస్సుమాంజలుఁలు
ప్రేమాతురుడౌ మాధవునకానందము నీయకపోవునే.
 
తలిదండ్రుల మనసు మార్గము ననుసరించు వారలన్
అజేయస్థానము నాక్రమించు శ్రీరాము నే దలంతు
మునియైయ్యు, పున్నామనరక నివారణార్ధమై పవిత్ర
పుత్రకామేష్ఠి యజ్ఞమున్నెరపిన గౌతము నే గౌరవింతు
 
దేదీప్తి మార్గములందలరారుచున్ ప్రశాంత చిత్తవదనుడై
ఐహిక వాంఛావంచిత లావణ్యవతి సీత మనోభిరుచులం
దీర్పబూనిన రఘురాము చేతలనేమనగలను
యేమని బొగడ గలను, నేరీతి గనగలను?
 
ఆవేశంబున దప్ప అవనిలో అనితర సాధ్యముకాని
వైరాగ్య మార్గమున చరించి, తరించు భరతుని బోఁలు మనుజులెందరు?
గిట్టువరకు వలయు శక్తినంతయు ప్రాణకోఁటికి
సమసహన భావమున నొసఁగు మైత్రేయు మమతలెందరెఱుఁగు?
 
ధనరాశులన్నియు ధారపోయుదునన్న, కాదు పొమ్మని
దైవదర్శనోపాయమార్గమిమ్మని పోరిన మునిసతి మైత్రేయి గుణము,
భరింప నలవి కాని దినముల బడలిక సకలము
నపహరించి సేద దీర్చెడు శరత్ఛంద్రుని చలువ నీభువి నెట్లువచ్చు?
 
అరవిందాక్షుని జ్ఞానామృతావనిలో బ్రతుకునవలోకింప నేర్చిన
అబిమానవతియైనన్, శుభాంగి సతి లక్ష్మి అచంచలవిశ్వాస స్ఫూర్తిన్
జీవన్మరణ సంయోగ సంఘటనల నెదుర్కొనునన్న నేమి యాశ్చర్యము?
ఇంతకు మించి, సత్యమూర్తి అసత్యమును, కొండొక నిర్వివాదాంశాపూరిత తడవులఁ
చిద్విలాశాన పలుకునన్న నమ్మగలము.
 
మతమేదైననేమి మనిషి మానవాతీతుడగుటకు మంచి చాలు
చేయబూనిన మంచినేజేయు కృతాభిలాషి, మితభాషి, దరహాసవదనున్
మట్టిలో మాణిక్యంబును బోలు, శ్మశాన వాటికలం జేరాడు నీశ్వరున్
బతిఁగ వరించిన కామేశ్వరి, సతి పార్వతి మనోభిలాషలు దీరకపోవుటెట్లు?
 
సాంప్రదాయక జీవితము గరుప నేర్చిన నిత్య పూజానిష్ఠు
స్వధర్మాచరణాబద్ధుడౌ సవిత్రు నారాయణున్ రామున్బతిగ నొందిన మహాలక్ష్మి, సీతకు
యెల్లెడలన్ సంపూర్ణ రాగభోగ్యాదులు గాకున్న, వైభవలబ్ధి కేమిటాటంకము?
 
సాగఱముఱీఁతి, విరాగ మనోగతుడై ప్రశాంత చిత్తుడై నటుల దోచినన్
గర్భమున గ్రేఁలి జేఁయు, జగన్మోహను బంధు, విశ్వపతి ఆవేశ కోపదావాగ్నులం జల్లార్ప
నేర్పరియౌ హిమవత్పుత్రీ సమానమౌ కామేశ్వరికిఁ దప్ప నితర సాధ్యమే?
 
ఇహమున శుభము కల్గవలెనన్న తలయవలయు శంఖరు నామమ్ము
మనిషికి చాలదు వట్టి సౌభాగ్యమున్న, శాంతి గావలయు
శాంతి పొందనలవి కాదు శాంభవి కఱుణ లోటైన
రెంటినొందగోరిన గలదు అర్ధనారీశ్వరరూపము జనులు గొలవ
 
స్త్రీపురుష సామరస్య సమానత గాంచిన మనిషికి లేదు కొదువ రెంటికి
ఇరులనొకే ఐక్యరూపమున జూఁడగలుగు భాగ్యమిమ్మని వేడుదు నాభగవంతు నేను.
 
శరీర ధ్యాస నొసఁగు బ్రహ్మ, విద్యాబుద్ధులొసఁగు శారదల ప్రభావముచే
మనసున ఉదయించే అర్ధనారీశ్వర రూప దర్శన మత్యంత మధురము గదా!
 
శ్రీరస్తు శుభమస్తు