భావాల మోజులో

Mohan Vallabhajosyula

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereభావాల మోజులో యెప్పుడూ యుండేవు
దేశకాలాను బద్ధమౌ పనులు మానేవు..
యేమికావాలని వచ్చినావో.
దెలియ ధ్యాస నుండవదేలా..
సజీవ ఆత్మరూపమా..జీవాత్మవై నిన్నె మరిచేవా..సజీవ..

రాగవిరాగ విభుడవౌ ఓ రంగనాధా..
అనురాగవైఖరి ననుగాంచలేవా
రాగముడిగిన మనిషి బాధా..
సర్వమెరిగిన నువు దెలియలేవా..
కరుణాంతరంగా ఓ రంగనాధా.., శ్రీ రంగనాధా..

మనసుదెలిసిన ఓ దేవదేవా..
నా మోహ గతుల నువు నాప లేవా.
ఇన్నాళ్ళు ఈ వలలో దిగులుతో నిరతమ్ము భ్రమలదేలి యుంటినే,
నీ దయకై నా మనసు వేడెనే...

కరిని కాచిన కారుణ్యమూర్తీ.., ఓపలేనని చెప్పవలెనా..
నిన్నెరుగని బతుకె బరువనీ దెలియలేవా..
తెలివియుండినగాని తాగియుండినగాని తలపె నీపై యుండెనే
నీవె నిజమనుకుంటినే..

అంతర్యామివౌ ఓ విశ్వనాధా..నా శరీరమంతా స్ఫూర్తితొ మెదిలేవ
కణకణాలన్నిట జీవమె నుంచేవ
మంచిదోవలో నడిపి నన్నూ గడువులోపలె నాదుకోవా
యెక్కడున్నాదొ ఆత్మా ఓ సారి చూపి పోవా..
వయ్యారి హంసరీతి,..ఇచ్చేటి జేవశక్తీ..