రాసలీల

Mohan Vallabhajosyula

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereఏం ముఱిపిస్తవే పిల్లా
నినొగ్గేసుకోమంటె కల్ల
ఆ సూపు సూడకే మల్ల
ఉండనియ్యవు నాపాలి నన్నిలా

రాజ్యమేలోటోడు
రాజునేలేటామె
సరసమాడేటేల
మన బోటి కాదేటి మల్ల

రాచకార్యము కన్న
రాసక్రీడయె ఘనమనునటుల
రాజ్య పాలన మాని
రమణుల దాసులైన
రారాజు లెందరో

పురాణేతియాసములలో కోకొల్లలు
ఆ రాజు రమనుల తప్పుకాదే అది
నరనారీ శిరోమనుల నసక్యులజేయు
పకృతి శక్తి పభావమది
అసక్యమయ్యెను గదేటి
రుసి నారదునకు కూడ

నాకేమిటగుతోందో
ఇక కాసింత సెప్పనీ
సిగ్గులేనివాణ్ణని

సింత సెందబోకు
ఇటువంటివాడేటని
సెంపలేసుకొని యిస్తుబోకు

చీర కడుతూయుంటె చూడముచ్చటౌతాది
చెంగు తొలగినంత మతి సెదురుతాది
చిరునవ్వు చిలికిస్తే వలపు పొంగి పోతాది
కనుసూపు సౌమ్యమైన మొలకెత్తునాస

మాటకూడ కలిస్తే మత్తెక్కుతాది
ముద్దెట్టుకుంటే మూడు వచ్చేస్తాది
మూడురావంగానె మాటలాగిపోవు
ఆపైన జరిగేది నాకేమిటెరుక

పొద్దంత దోఁచు సుప్పనాతిగాను
పొద్దుగూకిన గన్పట్టు పియసతిగాను
రాత్రంత మురిపించు మొరటోడు
కాడంటె పగలంత కసాయివోడు
బమ్మమాయ కాదంటె ఈయ్యిచిత్రం
మనసువొళ్ల రీతులందీ యిపరీతం

పూటపూటకు సహజముగ నాకలౌ నటుల
పతి రాత్రి తప్పక నిద్రకై తపించునటుల
చెరుకు వింటివాని బంటులమను నటుల
సుశ్టి కార్య మొనరింప భావోద్రేకమగునె యటులె