శత సహశ్రములో

Mohan Vallabhajosyula

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here
సంసాఱ భారమ్ము భరియింప నేర్ప, గల్గునే యేఱికైన
సరళశీలతనది సహజగుణమ్ము గావలె, గా రావలె గాని
మనస్సెంచెడు నందఱు, నన్నియును మనోఫలకముపై నుండు సంసాఱఁమ్ముగ
ఎల్లవేళలందెక్కడైన మాటిమాఁటికి మన మనసునూగులాడించ
సుకుమార శీలులు జేతురేమైన తగుఱీఁతుల వారల నూరడించ

తరుణీలతాంగ సంయోగ సఫలీకృతమౌ పఱివారమ్మె
సంసారము గాఁదని సారముగ దెలియగల సునిశిత సారస్వతులెందరు?
ఉందురొకరిద్దరు సహస్రములో, కాదు శతసహస్రములో.

సజీవులుగ నుందురటువంటి వారని వింటినెందఱిఁనొ గూర్చి
కాంచితి ప్రత్యక్షముగ నే మువ్వురు మూర్తులను
యెంచితి మనసార, దైవేచ్ఛికముగాగ నేఁఱమేమిటని, సాదరముగ
వచియింప మనసు దేఁలికగునని, యింకేఁమియు జేఁయలేక.

చేయునుపకారంచే ఠీవిన్ గౌఱఁవపురస్కారపూజలందుకో గల్గినన్
జేయునెందరు తృష్ణరహితులై శ్రీకృష్ణువోఁలె నిందాస్తుతులఁ లెఖ్ఖించక ధర్మార్ధతన్
జేయు సత్కార్య నిర్వహణము శ్రేయోభిలాషియై తగుఱీఁతిన్
జెయ్యకపోడెవ్వరైన యేమడిగిన కృష్ణా రావని కవ్వింపు మాటలాడినన్

ఆప్తులకనురాఁగ తేజమ్మీయంగ శ్రీనివాసు సాదృసు నశేషజనమ్ము
ఆపదమొక్కుల వాడనంగ ఆంతర్యమేమని యాలోచించనేల?
తనకంటూ తావేమీ లేఁకపోయినా నాతలంపు తలకు రానీక
వెంకట, రావా ననగానే కొండంత నండగనుండే గుణాధిక్యతవలననే.

యోగాతిశయమున పఱిఁవారమునుద్ధరింప గరళకంఠుడవయ్యు పవితృండవైన
రాగనిరతిన్ సురాసురుల కొక్కఱీఁతి వరములిచ్చి భోళాశంఖరుడవైన
నగుగాక, ఓ వల్లభ, జోశ్యుల భాష్యపురీతి నీవేకాకివి గాఁక విజ్ఞతన్
ఆ గౌరినిఁ జేఁపట్టుటలో నిచ్చితివమితానంద శాంతసౌభాగ్యములన్.

శ్రీరస్తు శుభమస్తు