పశ్చాత్తాపము

Mohan Vallabhajosyula

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereపశ్చాత్తాపము
    - మోహన్ వల్లభజోశ్యుల

ఆది తెలియక మానవుండు
ఆధిపత్యమంత తనదనియె దలంచు
అధికారమూడిన మరునాడు వాపోవు నీఱీతి

సాధువుల వంచించి నధముల మెప్పించి
అంధముగ వర్తించి అధికారము జేపట్టి
బాధ్యతల మరచి బంధుజనముల బోషించి
సాధించినదేమి తీపికలగంటి గాని, అసలు
బుధ్ధి గలిగి వర్తించ పరమధర్మమగు గదా!

అహర్నిశము శ్రమించి, అహంపెంచు కొంటి
ఇహమన్నదే గాని పరమెందుకిప్పుడని
ఆశలకు పోతి నవకాశమున్నంత.

అధికారమన్నది అనుకుందుకేనని
ప్రేరణ, పెత్తనము పెఱుమాళ్లదేనని
అఙ్ఞానమున పడి నిజము జూడనైతి.

కట్టుబాట్లు లేని కాముకుడనైతి
నియమమనేది లేక నీతి ధ్యాస వీడితి
శాంతిజోలికి పోక భ్రాంతిలో ములిగితి
పదవి వున్నప్పుడు వెధవనై యుంటి

సంధ్యకాలపు తేజము తెలుయుచున్నదిపుడే
అంత్యకాలపు వేదన కలుగుచున్నదపుడే
నిదురైన రాదె వ్యధతీర్చు గొనలేక
యెదలోని భాధ చెప్ప తీఱునది గాదె?