పెళ్ళి పాటల తెలుగు సినెమాలు

T Vasant Naidu

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereపెళ్ళంటే జీవితంలో ఒక అద్భుతమైన ఘటన. Sr. సముద్రాల, మల్లాది, ఆరుద్ర, వేటూరి రచించిన పెళ్ళి పాటలు చాలా అద్భుతాలే, అవేమో చుద్దామా మరి...పెళ్ళి అనేది నూరేళ్ళ పంట, అది పండాలి ప్రతి ఇంట. పెళ్ళి అనేది మహిళకి పునర్జన్మ లాంటిదె. వివరాలు చుద్దామా మరి.

1930-40 లో వచ్చిన చిత్రం, "సంఘం" లో శ్రీ ఫిఠాపురం నాగేశ్వరరావు పాడిన పెళ్ళి పాట చాలా పాపులర్‌ అయ్యింది.

ఆ తరువాత "పెళ్ళి రోజు" అనే చిత్రం లొ ప్రముఖ గాయకుడు PB శ్రీనివాస్‌ మరియు అల నాటి నటి, అందాల తార జమున పాడిన "పెళ్ళి వారమండి, ఆడ పెళ్ళి వారమండి" పాట చాలా అదరణ పొందింది.

NTR, సావిత్రి అన్నా చెల్లెళ్ళు గా నటించిన "రక్త సంబందం" చిత్రం లో "బంగారు బొమ్మ రావేమే, పందిట్లొ పెళ్ళి జరిగేనే" పాట ఎప్పటికీ సుపరిచితమె.

"ప్రేమ లేఖలు" చిత్రం లో జిక్కీ పాడిన "పందిట్లొ పెళ్ళి అవుతున్నది, కనువిందవుతున్నది" ఎనాటికీ శ్రవ్యంగా ఆకట్టుకుంది.

నటరత్న NTR రూపొందించిన అద్భుత చిత్రం "శ్రీ సీతారాముల కళ్యాణం" లో, Smt. P. సుశీల పాడిన "శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రారండి" గొప్ప పెళ్ళి పాట, ఈనాటికీ ప్రతి పెళ్ళి లొ ఈపాట వినిపించవలసిందే... శ్రీరామ నవమి పందిళ్ళు ఈపాటతొ పులకరించి పొతాయి...

ఇక "మీన" చిత్రం లో SP బాలు పాడిన "పెళ్ళంటే నూరేళ్ళ పంట, అది పండాలి కోరుకున్న ఇంట" పాట కూడ అద్భుతమే...

మురారి మరియు చందమామ చిత్రాల్లొ వచ్చిన పెళ్ళి పాటలు కూడా అద్భుతమే....

అద్భుత చిత్రమయిన, మాయా బజార్‌ లొ "ఆహ నా పెళ్ళి యంట, ఒహొ నా పెళ్ళి యంట" కూడా ఎంతో అద్భుతమైన పాట...

పెళ్ళి అనే పదము తో వచ్చిన చిత్రాలన్నీ సూపర్‌ హిట్‌ లే....పెళ్ళి అయ్యాక జీవితము లో ఎన్నో మలుపులు తిరుగుతాయని కొన్ని చెపితె, కొన్ని పెళ్ళికి జీవితము తో ఎంతొ ప్రదాన్యత ఉందని చెపుతున్నాయి.

అఖరిగా, బాపు గారు రూపొందించిన "పెళ్ళి పుస్తకము" చిత్రములొ అద్బుతమయిన పాట, ఎప్పటికీ మరువలేని పాట, రంజేంద్రప్రసాద్‌ గారి అద్బుతమయిన నటన తో "శ్రీరస్తు, శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం".

ఇంకా ముందు ముందు ఎలాంటి పాటలు వస్తాయో వేచి చుద్దామామరి.