Jeevita Satyaalu - 2

Raghuvarma Basavaraju

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here



జీవిత సత్యాలు

సీ||సువిశాల సుందర భువినిట్లు దయమాలి దూర ఖండములుగా దుంచి నాము స్వార్థమతిశయింప సరిహద్దులనుగీచి దేశముల విడిగ దీర్చినాము మనుజుల రంగు రూపుల,బుట్టుకల నెంచి వివిధ వర్గములు గా విరచి నాము భయ వాంఛలు దరుమ మతముల,వేల్పుల వెలయించి మనుజులు వేరనేము! తే.గీ||నాది నీదని తగవేల,నెవరి యబ్బ సొమ్ము ఘన భూతలమ్ము పంచుకొన నిటుల నతిధు లైవచ్చినాము మూన్నాళ్ళ కిటకు కాల ధర్మము తధ్యము గడువు దీర! రఘువర్మ బసవరాజు