ఆంధ్రజనని

Durgaprasad Varanasi

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help hereAn offering on the anniversary of the
creation of Andhra Pradesh (Nov. 1)

జయతు! జయతు! ఆంధ్రజనని!
జయతు! మహామహితాంధ్రధరణి! ||జ||

జయతు! మాత! భాగ్యావని!
జయతు! జయతు! స్థితపావని! ||జ||

పెన్నకృష్ణ గోదావరుల
కన్నతల్లి పుణ్యావని!
నన్నయాది కవులనెల్ల
గన్నతల్లి వాంధ్రవాణి! ||జ||

అన్నపూర్ణ వమ్మనీవు
నన్నుగన్న మాతవీవు
ఎన్నలేని జన్మలందు
గన్న పుణ్యఫలమువీవు ||జ||

గావించుచు సత్కృతులను
జీవించగమమ్ము, తల్లి,
భావించుచు మదినిమమ్ము,
దీవించుము తెలుగుతల్లి ||జ||