శ్రీ రాజేశ్వర పంచవృత్తమాలిక

దుర్గాప్రసాదు వారణాసి

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here[ఉపోద్ఘాతం: శ్రీ సాలూరి రాజేశ్వర రావు గారిపై వ్రాసి, వారి సమఖములో ప్రసాదించి, నేను మన సంఘపు సమ్మేళనమ్ములో సంగీతాలపనాసంపన్నుడనై సత్కీర్తి నొందిన ధన్యుడ నేను. ఎవరో ఒక ప్రముఖులు ప్రచురించారా దిన సమ్మేళనమును "విబ్సైటు"లో. ఆ "సైటు"లొ వారు పరమేయంబుగా “రికార్డు” చేసిన కార్యక్రమములో, కేవలం స్వర్గీయ రాజేశ్వర రావు గారి నిరుపమానమైన గానమునే గాక, తదితర ముఖ్య విషలాయు ప్రచురించగా నెంచగ బోతిరి. ఒకానొక భక్తుడు పాడి “ప్రసాదించిన” సన్నుతి వారు ప్రకటించ (“రికార్డు” చేయ) లేదని చింతించువాడను. అందులకై తమకై గూర్చిన అస్మదీయ ప్రచురణంబిది. మన్నింప ప్రార్ధన.]

(వృత్తములు మనభాషలో పద్య రత్నాలు. ఇందిటలో నేను ఉత్పల మాల, చంపక మాల, మరియు నొక మత్తకోకిలంబు నుపయోగించితినానని గమనింపుడు.)

రమ్ము మహానుభావ! మధురమ్మగు రాగ సుధారసమ్ములో
మమ్ముల నుంచరమ్ము! మది మల్లెల మాలలనూగ తెల్గు గీ
తమ్ములు రాగ భావ భరితమ్ముగ గానము సేయ రమ్ము, రా
రమ్ము కళాతపస్వి! మధురానుభవమ్మును మాకొసంగగన్

తెలుగులటంచు తెల్పగను తేనెల నొల్కెడి భావగీతముల్
తెలుగు తనమ్ము పెల్లుబుకు తీరున బాణులమర్చి తెల్గు భ్రా
తలకు బహూకరించితివి; తల్లి మహాంధ్రి కనుంగుపుత్రుడై
వెలిగెడి నిన్ను గాచుమని వెన్నుని వేడెదనో కళానిధీ!

“పాడుము తేనెలొల్కుచును పల్కు” మటంచు నీవు పాడినన్
పాడగరాడె మాధవుడు పట్టగ రాని కుతూహలంబునన్
ఆడగరారె అప్సరలు నద్రిసుతేశుడు? నీవు పాడినన్?
నేడగుపింతురే భువిని నీకు సమానులనంగ గాయకుల్?

శ్యామసుందర వేణుగానము శ్యామవర్ణ నదీతటీ
సీమలో వినియుంటివా? సరసీరుహాక్షుని కౌగిటన్
కోమలీమణి రాధ మోమున కోపమున్ గనియుంటివా?
స్వామి సన్నిధి నాలపించిన వాడ వీవనిపించగన్.

విశ్వవిధాతరాణి తన వీణను మీటగ నుధ్వవించె రా
జేశ్వర రావు! భూతలము జేయగ రాగసుధా జగమ్ము గాన్;
విశ్వజనాళి వీనులకు విందులొసంగు కళాపయోధికిన్
ఈశ్వరుడిచ్చుగాత నరులెవ్వరెరుంగని సన్నిధానమున్.