Swaagatam

Durgaprasad Varanasi
A kavita written on the occasion of TLCA's 35th Anniversary


This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here



స్వాగతమమ్మా మా తెలుగు తల్లీ
సుస్వాగతమమ్మా శుభకల్పవల్లీ! ||స్వా||

ఈ దూర తీరాన నీదైన విభవమ్ము
గౌరవమ్మున జాటు వారసులమేనమ్మ
నీ దివ్య సంస్కృతీ, ఓ దివ్య భారతీ
మాదైన పరవంబు మముగన్నతల్లీ ||స్వా||

దేశ భాషలలోన తెలుగుయే లెస్సనగ
దేశ వాసులయందు తెలుగులే మెరుగనగ
నిత్యంబు నిను భక్తి గొలుచు వారము తల్లి
సత్యంబుగా నీ రూపు దలచు వారము తల్లి ||స్వా||

ముప్పది ఐదేళ్ళ ముద్దుల గుమ్మా
సారస్వత సాంస్కృతిక సంఘమువమ్మా
సంఘీభావము గూర్చుము తల్లీ
సంతోషము మాకొసగుము తల్లీ ||స్వా||