విధి విలాసం

వల్లభజోశ్యుల మోహన్ (Vallabhajosyula Mohan)

This page uses Unicode. If your computer does not display Telugu script, please read and enjoy the pdf version. If you would like to set your computer up to display Telugu Unicode, please see help here


ఎల్లవేళల విమానముల జఱించు కొందరు
నిలువెల్లకాల్చు గనులలో పన్జేయవలయు యింకొందరు

ఆకలుండి అఱిగించుకోగఁలిగి, ఆహారములేక అలమటించు వారెందరో నుండగ
సర్వముండి రోగభ్రష్ఠులై అనుభవింపజాలరిందరు నొకింత

ధర్మానుష్ఠానులైయ్యు దారిద్యము పాఁలగువారు
మర్మముల జేఁయు అవినీతులయ్యు మిక్కిలి ధనవంతులగువారు
ప్రజాభిమానము లేశమైన లేకున్నా పరిపాలకులగువారు
తాఱఁసిల్లుదురీలోకమున మన తర్కమునకతీతముగ

స్వాభిమానము పేర తలపొగఱుఁతోనుండువారు
స్వార్ధమేమియు లేకున్న నిందలపాఁలగువారు
సంతానము లేక కుములు శ్రీమంతులు
సాకగ శక్త్యావకాశముల్లేక సంతతినంతమొందిచ తెగించువారు
సతతము వినుచుందుమిసువంటి వార్తలీ కర్మభూమి ధర్మమున

బాధ్యతలన్ననేమొ దెలియని బహుభాషాకోవిదులు
వలదన్న పరుఁల భారములు గోఁఱి భరించనెంచు విద్యావిహీనులు
నిత్యపూజానిష్ఠులౌ సాంప్రదాయకులకు ఊహించనలవిగాని అస్వస్థతలు
దైవచింతయన్ననేమో దెలియని యాటవికులకు నాత్మసందర్శనయోగ సంప్రాప్తము
యిత్యాది లెన్నియో మానవతర్కాతీతములై సంభవించునన్నది జగద్విదితము.

ఐన, యిందు, జీఁవుల కర్మఫలమునకు భిన్నముగ విధి తనంతగ దాఁనుజేయు నిర్ణయములుండునా?