Creative works from Telusuna Members

batukE baDirA

mohan vallabhajosyula

బతుకే బడిరా

బతుకే బడిరా, మఱణం మార్పురా
రెండింటితో మనిషి పోఱాఁడురా, ఆడి ఓడేనురా

చదువు సంధ్యా ధనమూ హోదాలు మనిషే యిచ్చుకునే విలువలేనోయి,
నిజముగ లేనివేనోయ్
మనసె మనిషోయి యివన్ని మాయా జాలమేనోయ్,
తెలివిగా తత్త్వాన్ని తెలుసుకోవోయి, నువ్వు మేలుకోవోయి...బతుకే...

పరువు పదవులు మమత మతాలు మోహమె కల్పించే బంధాలేనోయ్,
మధుర వలయాలేనోయ్
మానవత్వమన్న మనము మనవాళ్ళె కాదోయి
నిజమునె గ్రహించి నిగ్రహించవోయి, స్వార్ధమె తగ్గించి శాంతినొందవోయి,
భ్రాంతే వదులోయి...బతుకే...

వరస అనుకరణ: "దేవదాసు" లో "జగమే మాయా"

#బతుకే బడిరా

బతుకే బడిరా, మఱణం మార్పురా
రెండింటితో మనిషి పోఱాఁడురా, ఆడి ఓడేనురా

చదువు సంధ్యా ధనమూ హోదాలు మనిషే యిచ్చుకునే విలువలేnOyi,
niజముగ లేనివేనోయ్
మనసె మనిషోయి యివన్ని మాయా జాలమేనోయ్,
తెలివిగా తత్త్వాన్ని తెలుసుకోవోయి, నువ్వు మేలుకోవోయి...బతుకే...

పరువు పదవులు మమత మతాలు మోహమె కల్పించే బంధాలేనోయ్,
మధుర వలయాలేనోయ్
మానవత్వమన్న మనము మనవాళ్ళె కాదోయి
నిజమునె గ్రహించి నిగ్రహించవోయి, స్వార్ధమె తగ్గించి శాంతినొందవోయి,
భ్రాంతే వదులోయి...బతుకే...

వరస అనుకరణ: "దేవదాసు" లో "జగమే మాయా"#