పాపీవిలాపం దుర్గాప్రసాదు వారణాసి (26 డిసెంబరు 2006) అవని "కాఫీ"గతప్రాణి యనగ నేను ధరను స్వార్ధ లోభమ్ములన్ పరము మరచి పరితపించెడి పాపిష్ఠి పతితుడేను జగతి పరమార్ధ మెరుగని జనుడ నేను! ఇలను తనసుఖమేగాని ఇతరమెరుగ లేని మానవుండిలనుండు దానవుండు తనధనాదిసౌఖ్యంబులే తనవి గావు అనుచు నెరుగనోచినవాని మనుజుడనుము! |
#pApIvilApam durgAprasAdu vAraNAsi (26 Disembaru 2006) avani "kAphI"gataprANi yanaga nEnu dharanu svArdha lObhammulan paramu maraci paritapimceDi pApishThi patituDEnu jagati paramArdha merugani januDa nEnu! ilanu tanasukhamEgAni itarameruga lEni mAnavumDilanumDu dAnavumDu tanadhanAdisowkhyambulE tanavi gAvu anucu neruganOcinavAni manujuDanumu! # |