పెళ్ళి మోహన్ వల్లభజోశ్యుల --- పెళ్ళి పెళ్ళంటూ పెద్ద వాళ్ళంతా బళ్ళోంచి బయట పడతామో లేదో మళ్ళీ మళ్ళీ మనం మరవకుండా గుళ్ళో, ఇంట్లో యెక్కడైనా యెప్పుడైనా నిలదీస్తారు, వేధిస్తారు, వెంటపడతారు నవమాసాలు మోసి కని పెంచేనే అని తల్లి నవనాడులూ తెగేలా కష్టపడి పోషించేనని తండ్రి నువ్వే ఆదర్శకొడుకువని ప్రొత్సహించేమని బంధువులు నివురు గప్పిన నిప్పులా తేలకూడదని అందరూ. అవకాశం ఇస్తే యేమేమి చేస్తాడో ఎవతినొ తెచ్చి నాకిచ్చి చెయ్యండంటాడో ఆ వచ్చే పిల్ల ఈ పరివారాన్ని ఎవరు వీరు అంటుందో ఏవేవో భయాలతో బిగుసుకు పోతారు, అందుకని. సావకాశంగ ఆలోచించుకొని సవ్యంగా అన్నీ అమర్చుకొని, సక్రమంగ అల్లుకోబోయే సంసారాన్ని సంతోషంగా సాగుబాటు జరిగేలా యేర్పాటు చేసుకోవాలని పిల్లలనుకుంటే. కామాతురతను కాదనలేక కాంతను కోరువారు ఆలు పిల్లలు లేని బతుకు అలుసనుకొనువారు తప్పుడు పనులు అని అనుకొనేవి చెయ్య మనసొప్పకో పెళ్ళనే సాంఘిక నిర్భంధానికి తలొంచుతారు, కాళ్ళపై నిలబడి బతక గల్గడమే గౌరవమన్నట్లు. కారణమేదైతేనేమి ఇద్దరూ కామవగానే పిల్లల మనసులు మంచి చెడ్డలు మాకే తెలుసనుకుంటూ మనువు జరగాలంటే మనసులు కలవాలన్నది విశేషించి ప్రక్కనుంచి మరుగున పెట్టి, తెస్తారు పెద్దలు అంతస్థులు, పలుకుబడులు, ఆడంబరాలు అభిమానాలు, విరోధాలు ఇలాంటివన్నీ దృష్ఠిలోకి. వీటన్నిటి నడుమ నలిగి కోల్పోతారు సూక్ష్మ వివేకం వెల్తారు వెనక్కి అసలు హీరొ, హీరోయన్లు. సాంప్రదాయాలు, సంభావనలు, సంపాదనలు కులాలు, మతాలు, గురువులు, రాజకీయాలు, పాతానుభవాలు, తీరని ముచ్చట్లు, వారి వారి కోరికలు, ఇవన్నీ కలిపి కలగూర గంపజేసి వెతుకుతారు వధూ, వరులను. ఈ భాగోతంలొ త్యాగమౌతాయి ముఖ్యమైన విషయాలు. పిల్లడి యిష్టాయిష్టాలు, కోరికలు, ఆశయాలు పిల్లకి తెలియవు పిల్ల భావాలు, సరదాలు, అభిలాషలు, ఆతురతలు పిల్లడికి తెలియవు వయసుతో వచ్చే ఆకర్షణాభారం, పెద్దల ఆమోదావసరం, ఆచారం చాలా మంది విషయంలొ పనిచేసి ఇద్దరినీ మూగవారిని చేస్తాయి. అతను తన సొంతమనుకొని ఆమె లతలాగ తన్నల్లు కొంటుందని అతడు రాగానురాగాల రసమయమౌతుంది కాపురం, భూతమెలావున్నా భవిష్యత్తు బ్రహ్మాండమని యిద్దరూ అతుక్కుపోదామనుకుంటే సర్దుకుపోలేక పోతామా మన సుఖసంసార జీవనమె పెద్దల లక్ష్యము కదా అలా అనుకుంటూనే చేసేసుకుంటారు వివాహం. కొణ్ణాళ్ళకి కాని తెలియదు, ఒకరికొకరు మానసికంగా యెంత చేరువో, దూరమో. పెద్దలు చెప్పేదెప్పుడూ, మీరు సర్దుకు పోవాలని, మేమందరము యెలా కాపురాలు చేసేమని. ఇది గ్రహించిన పిల్లలు ప్రేమ పెళ్ళిళ్ళు మెరుగని తీర్పు చెప్పు కుంటారు ప్రేమంటే యేమో తెలుసుకోలేని, చెప్పినా వినుకునే స్థితిలో వారు లేకున్నా. చెప్పడానికి యేముంది, పెళ్ళీ యెలా జరిగినా, చేసుకున్నా దైవేఛ్చ అనుసారమే కాపురం సాగుతుంది. . . అసలు పెళ్ళనేది పెళ్ళాడే ఇద్దర్నిగూర్చి ఏర్పాటు చేసిందేనా సాంఘిక సంక్షేమంగూర్చి నిర్దేశించిన సిసలైన వ్యవస్థేనా రసాభాస లేక కాపురం చేయగోఱువారు నిఱఁతము విశేషించి పాటించవలె తామున్న సంఘనిబంధనల ననుకొందు సహజ ధోఱఁణిలో జరగవలసిన దాన్ని కృత్రిమ వ్యవస్థల్లో యిఱికించి అలంకారాలు సాంప్రదాయాల మధ్య ఖైదీచేసేము మనసు కలసిన వారిఁతో మనుగడ జేఁయ వీలులేక మనువాడవలసివచ్చిన వార్ని మన్నించలేక మనసార పొందలేక ఈ వ్యవస్థలో ఈ రోజుల్లో స్థిమితానందశూన్యులై జీవించేవారే యెక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్నా మానినా ప్రత్యేకించి లేవు కష్ఠం, నష్ఠం ప్రకృతికి, సృష్ఠికి మన సాంఘికాచారాల, ముచ్చట్లతో పనిలేదు అనాదిగ, సృష్ఠి తన కార్యం జఱిపించు కొందుకి ఆడ మగల మధ్య నుండే నాకర్షణాక్షేత్రము క్షీణించనంతవరకు. ఇది కేవలం మనుషులకే వర్తించునది కాదు మనకు దోచినట్లు చేయుట తప్పూకాదు సృష్ఠిలో మానవులు ప్రత్యేకం అని మనం అనుకుంటే అది మన తీర్పు మన విలువలకి, సంబరాలకీ, జీవితపు పోకడలకి యేమి పొంతన యుండనవసరము లేదు. |
# పెళ్ళి మోహన్ వల్లభజోశ్యుల --- పెళ్ళి పెళ్ళంటూ పెద్ద వాళ్ళంతా బళ్ళోంచి బయట పడతామో లేదో మళ్ళీ మళ్ళీ మనం మరవకుండా గుళ్ళో, ఇంట్లో యెక్కడైనా యెప్పుడైనా నిలదీస్తారు, వేధిస్తారు, వెంటపడతారు నవమాసాలు మోసి కని పెంచేనే అని తల్లి నవనాడులూ తెగేలా కష్టపడి పోషించేనని తండ్రి నువ్వే ఆదర్శకొడుకువని ప్రొత్సహించేమని బంధువులు నివురు గప్పిన నిప్పులా తేలకూడదని అందరూ. అవకాశం ఇస్తే యేమేమి చేస్తాడో ఎవతినొ తెచ్చి నాకిచ్చి చెయ్యండంటాడో ఆ వచ్చే పిల్ల ఈ పరివారాన్ని ఎవరు వీరు అంటుందో ఏవేవో భయాలతో బిగుసుకు పోతారు, అందుకని. సావకాశంగ ఆలోచించుకొని సవ్యంగా అన్నీ అమర్చుకొని, సక్రమంగ అల్లుకోబోయే సంసారాన్ని సంతోషంగా సాగుబాటు జరిగేలా యేర్పాటు చేసుకోవాలని పిల్లలనుకుంటే. కామాతురతను కాదనలేక కాంతను కోరువారు ఆలు పిల్లలు లేని బతుకు అలుసనుకొనువారు తప్పుడు పనులు అని అనుకొనేవి చెయ్య మనసొప్పకో పెళ్ళనే సాంఘిక నిర్భంధానికి తలొంచుతారు, కాళ్ళపై నిలబడి బతక గల్గడమే గౌరవమన్నట్లు. కారణమేదైతేనేమి ఇద్దరూ కామవగానే పిల్లల మనసులు మంచి చెడ్డలు మాకే తెలుసనుకుంటూ మనువు జరగాలంటే మనసులు కలవాలన్నది విశేషించి ప్రక్కనుంచి మరుగున పెట్టి, తెస్తారు పెద్దలు అంతస్థులు, పలుకుబడులు, ఆడంబరాలు అభిమానాలు, విరోధాలు ఇలాంటివన్నీ దృష్ఠిలోకి. వీటన్నిటి నడుమ నలిగి కోల్పోతారు సూక్ష్మ వివేకం వెల్తారు వెనక్కి అసలు హీరొ, హీరోయన్లు. సాంప్రదాయాలు, సంభావనలు, సంపాదనలు కులాలు, మతాలు, గురువులు, రాజకీయాలు, పాతానుభవాలు, తీరని ముచ్చట్లు, వారి వారి కోరికలు, ఇవన్నీ కలిపి కలగూర గంపజేసి వెతుకుతారు వధూ, వరులను. ఈ భాగోతంలొ త్యాగమౌతాయి ముఖ్యమైన విషయాలు. పిల్లడి యిష్టాయిష్టాలు, కోరికలు, ఆశయాలు పిల్లకి తెలియవు పిల్ల భావాలు, సరదాలు, అభిలాషలు, ఆతురతలు పిల్లడికి తెలియవు వయసుతో వచ్చే ఆకర్షణాభారం, పెద్దల ఆమోదావసరం, ఆచారం చాలా మంది విషయంలొ పనిచేసి ఇద్దరినీ మూగవారిని చేస్తాయి. అతను తన సొంతమనుకొని ఆమె లతలాగ తన్నల్లు కొంటుందని అతడు రాగానురాగాల రసమయమౌతుంది కాపురం, భూతమెలావున్నా భవిష్యత్తు బ్రహ్మాండమని యిద్దరూ అతుక్కుపోదామనుకుంటే సర్దుకుపోలేక పోతామా మన సుఖసంసార జీవనమె పెద్దల లక్ష్యము కదా అలా అనుకుంటూనే చేసేసుకుంటారు వివాహం. కొణ్ణాళ్ళకి కాని తెలియదు, ఒకరికొకరు మానసికంగా యెంత చేరువో, దూరమో. పెద్దలు చెప్పేదెప్పుడూ, మీరు సర్దుకు పోవాలని, మేమందరము యెలా కాపురాలు చేసేమని. ఇది గ్రహించిన పిల్లలు ప్రేమ పెళ్ళిళ్ళు మెరుగని తీర్పు చెప్పు కుంటారు ప్రేమంటే యేమో తెలుసుకోలేని, చెప్పినా వినుకునే స్థితిలో వారు లేకున్నా. చెప్పడానికి యేముంది, పెళ్ళీ యెలా జరిగినా, చేసుకున్నా దైవేఛ్చ అనుసారమే కాపురం సాగుతుంది. . . అసలు పెళ్ళనేది పెళ్ళాడే ఇద్దర్నిగూర్చి ఏర్పాటు చేసిందేనా సాంఘిక సంక్షేమంగూర్చి నిర్దేశించిన సిసలైన వ్యవస్థేనా రసాభాస లేక కాపురం చేయగోఱువారు నిఱఁతము విశేషించి పాటించవలె తామున్న సంఘనిబంధనల ననుకొందు సహజ ధోఱఁణిలో జరగవలసిన దాన్ని కృత్రిమ వ్యవస్థల్లో యిఱికించి అలంకారాలు సాంప్రదాయాల మధ్య ఖైదీచేసేము మనసు కలసిన వారిఁతో మనుగడ జేఁయ వీలులేక మనువాడవలసివచ్చిన వార్ని మన్నించలేక మనసార పొందలేక ఈ వ్యవస్థలో ఈ రోజుల్లో స్థిమితానందశూన్యులై జీవించేవారే యెక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్నా మానినా ప్రత్యేకించి లేవు కష్ఠం, నష్ఠం ప్రకృతికి, సృష్ఠికి మన సాంఘికాచారాల, ముచ్చట్లతో పనిలేదు అనాదిగ, సృష్ఠి తన కార్యం జఱిపించు కొందుకి ఆడ మగల మధ్య నుండే నాకర్షణాక్షేత్రము క్షీణించనంతవరకు. ఇది కేవలం మనుషులకే వర్తించునది కాదు మనకు దోచినట్లు చేయుట తప్పూకాదు సృష్ఠిలో మానవులు ప్రత్యేకం అని మనం అనుకుంటే అది మన తీర్పు మన విలువలకి, సంబరాలకీ, జీవితపు పోకడలకి యేమి పొంతన యుండనవసరము లేదు.# |