మహర్షి మోహన్ వల్లభజోశ్యుల --- అహోరాత్రముల అరుణగిరిపై యేకాకియై ఆహారపానీయముల అవసరముల దలఁచక యెండావానల తాపముల దప్పించుగొన నేరక దేహపోకడ తీఁరులన్ ధిక్కరించి మెలఁగి జంతువుల బంధువులని యెంచి మసలి శరీరమె నడ్డుదెరయై సత్యమును దాఁచునని నమ్మి వస్త్రమురీతి దానిఁ మదినుండి త్యజించనెంచి తదేకధ్యాసనుండి సర్వమును నిస్సంగుడై విడిచి విదేహభావము బొంద తపంబు జేసె నతడు మలమూత్రంబులె మలినపరచునో జడలగట్టిన శిరోజములె దలనిండునో చీమిడి ముక్కె సిద్ధించి చీదరము గూర్చునో క్రిమికీటకాదులె జడమనుచు దనపై జరియునో మృగములవ్రాతబడి ప్రాణమె బోఁవునో నిట్టిభావనలె మదిరగిలిన రమణుడు దపము జేయగల్గునే నట్లుజేఁయక సుద్ధ విదేహభావమూర్తి కాగల్గునే నట్టి సదేహ శాంతప్రవృత్తి గల్గిన స్వామి కాగల్గునే గిరిజనుల్ మఱిఁయు పురవాసులున్ పట్టభద్రులుగాకున్న యెఱిఁగిరి నా మనుజుఁని మానససరోవర వాసిని నేర్చిరి వానిఁ జేఁర నాదరించ సేదదీర్చ పోషించ కూర్చిరి స్వామి వసియించ గిరిపీఠమున నో కుటీరమును తమదఁరి వాని నివాసమె హరిహరాదుల వరప్రసాదమని తమసేవలె తద్యోగిన్ సజీఁవముగ మిగుల్చునని పరిమళము పసిగట్టి మధుపములు బూవులఁ జేఁరురీతి జేరిరి వందల వేలులఁ భక్తజనులు నాతని గాంచి గొలువ పరివ్యాప్తినొందిన వాని జ్ఞానప్రకాశ ప్రాభవ విశేషమున తరంతముల దాటి పలుదేశముల ప్రాజ్ఞులు సహితము భూరివిరాళ శ్రమదానములఁ జేసి నిర్మించికొనిరి అరుణాచలమున ఆశ్రమమును వారి సదుపాయమునకని శరీరభావముడిగి సదేహముక్తినలరు రమణుని ముచ్చటదీర్ప గాదు మాటలు కడు నాడు స్వామి కారు వారు మాటలు జేఁరు మెదడును కాదు మనసును మాటలు జెఁరచు సత్యదర్శనమును మాటలాడునపుడు బోఁవు సత్యవర్తనము మాటల చిత్రింపలేము సదౄప, మనియొ నేమో ఆ మౌని మౌనమె మాటలకందని సదౄప బోధ స్వామి సన్నిధియె ప్రశాంతతకు ప్రమాణము స్వామి కన్నులు దివ్యతేజ భాసితములు స్వామి గతుల గాంచిన గతించు గర్వము సర్వము స్వామి దర్శనమె యోగాంకురము ప్రేమకర్ధము వారు సహవాసులకందించు సేవలందు గన్పట్టు పశుపక్ష్యాదుల ప్రసన్నతఁ వారు జేఁరదీసి లాలించి పోషించు రీతిన్ గాంచిన, జీవసమైక్యభావమన్న నేమొ నెరుగుదుము దేశకాల పరిధులఁదాటిన దివ్యపురుషులు జ్ఞానతేజమై వెలిగిన దైవస్వరూపులు యెవరు ఎప్పుడు యెలాగ అడిగిన, "యేమి చెయ్యాలని" "నువ్వెవరో తెలుసుకో చాలు", యేమి చెయ్యాలొ తెలిసిపోతుంది, అనేవారట. గమనిక: నా బాల్యావస్థలోనె శ్రీ రమణ మహర్షి తనువు చాలించారు.ఫ్రత్యక్షముగ నేను ఆ ఆశ్రమముగూడా చూడ లేదు.నే విన్నవి, చదివినవి ఆధారముగ జేసికొని, నాకు గల్గిన ప్రేరణ కారణంగ ఇది రాయడం జరిగింది. |
# మహర్షి మోహన్ వల్లభజోశ్యుల --- అహోరాత్రముల అరుణగిరిపై యేకాకియై ఆహారపానీయముల అవసరముల దలఁచక యెండావానల తాపముల దప్పించుగొన నేరక దేహపోకడ తీఁరులన్ ధిక్కరించి మెలఁగి జంతువుల బంధువులని యెంచి మసలి శరీరమె నడ్డుదెరయై సత్యమును దాఁచునని నమ్మి వస్త్రమురీతి దానిఁ మదినుండి త్యజించనెంచి తదేకధ్యాసనుండి సర్వమును నిస్సంగుడై విడిచి విదేహభావము బొంద తపంబు జేసె నతడు మలమూత్రంబులె మలినపరచునో జడలగట్టిన శిరోజములె దలనిండునో చీమిడి ముక్కె సిద్ధించి చీదరము గూర్చునో క్రిమికీటకాదులె జడమనుచు దనపై జరియునో మృగములవ్రాతబడి ప్రాణమె బోఁవునో నిట్టిభావనలె మదిరగిలిన రమణుడు దపము జేయగల్గునే నట్లుజేఁయక సుద్ధ విదేహభావమూర్తి కాగల్గునే నట్టి సదేహ శాంతప్రవృత్తి గల్గిన స్వామి కాగల్గునే గిరిజనుల్ మఱిఁయు పురవాసులున్ పట్టభద్రులుగాకున్న యెఱిఁగిరి నా మనుజుఁని మానససరోవర వాసిని నేర్చిరి వానిఁ జేఁర నాదరించ సేదదీర్చ పోషించ కూర్చిరి స్వామి వసియించ గిరిపీఠమున నో కుటీరమును తమదఁరి వాని నివాసమె హరిహరాదుల వరప్రసాదమని తమసేవలె తద్యోగిన్ సజీఁవముగ మిగుల్చునని పరిమళము పసిగట్టి మధుపములు బూవులఁ జేఁరురీతి జేరిరి వందల వేలులఁ భక్తజనులు నాతని గాంచి గొలువ పరివ్యాప్తినొందిన వాని జ్ఞానప్రకాశ ప్రాభవ విశేషమున తరంతముల దాటి పలుదేశముల ప్రాజ్ఞులు సహితము భూరివిరాళ శ్రమదానములఁ జేసి నిర్మించికొనిరి అరుణాచలమున ఆశ్రమమును వారి సదుపాయమునకని శరీరభావముడిగి సదేహముక్తినలరు రమణుని ముచ్చటదీర్ప గాదు మాటలు కడు నాడు స్వామి కారు వారు మాటలు జేఁరు మెదడును కాదు మనసును మాటలు జెఁరచు సత్యదర్శనమును మాటలాడునపుడు బోఁవు సత్యవర్తనము మాటల చిత్రింపలేము సదౄప, మనియొ నేమో ఆ మౌని మౌనమె మాటలకందని సదౄప బోధ స్వామి సన్నిధియె ప్రశాంతతకు ప్రమాణము స్వామి కన్నులు దివ్యతేజ భాసితములు స్వామి గతుల గాంచిన గతించు గర్వము సర్వము స్వామి దర్శనమె యోగాంకురము ప్రేమకర్ధము వారు సహవాసులకందించు సేవలందు గన్పట్టు పశుపక్ష్యాదుల ప్రసన్నతఁ వారు జేఁరదీసి లాలించి పోషించు రీతిన్ గాంచిన, జీవసమైక్యభావమన్న నేమొ నెరుగుదుము దేశకాల పరిధులఁదాటిన దివ్యపురుషులు జ్ఞానతేజమై వెలిగిన దైవస్వరూపులు యెవరు ఎప్పుడు యెలాగ అడిగిన, "యేమి చెయ్యాలని" "నువ్వెవరో తెలుసుకో చాలు", యేమి చెయ్యాలొ తెలిసిపోతుంది, అనేవారట. గమనిక: నా బాల్యావస్థలోనె శ్రీ రమణ మహర్షి తనువు చాలించారు.ఫ్రత్యక్షముగ నేను ఆ ఆశ్రమముగూడా చూడ లేదు.నే విన్నవి, చదివినవి ఆధారముగ జేసికొని, నాకు గల్గిన ప్రేరణ కారణంగ ఇది రాయడం జరిగింది. # |