Creative works from Telusuna Members

ఈ ఉగాదినుండి

Srinivasa Rao

ఈ ఉగాదినుండి,
ఊహతొ ఊహవై ఊహలా విహరించు
దిక్కుతొ దిక్కువై దిక్కులా ఉదయించు

కనులలొ కలలతొ కావ్యాలు రచించు
చెట్టువై కొమ్మవై పువ్వులా మళ్ళీ మళ్ళీ వికసించు

మనసువై మమతతొ ఓ మనసుతొ విహరించు
మిధ్యలొ మిధ్యవై మిధ్యనే మరిచిపొ

సరిహద్దు హద్దు సరిదిద్ది సుదూర తీరాలు చేరుకొ
అహంకార కారు మేఘలలొ ప్రేమని వర్షించి తేలికై తేలిపొ
నేస్తమా!



# ee ugaadinunDi,#
#oohato oohavai oohalaa viharinchu#
#dikkuto dikkuvai dikkulaa udayinchu#

#kanulalo kalalato kaavyaalu rachinchu#
#cheTTuvai kommavai puvvulaa maLLI maLLI vikasinchu#

#manasuvai mamatato O manasuto viharinchu#
#midhyalo midhyavai midhyanae marichipo#

#sarihaddu haddu sarididdi suduura teeraalu chaeruko#
#ahankaara kaaru maeghalalo praemani varshinchi# #taelikai taelipo#
#naestamaa!#

Back to list