Creative works from Telusuna Members

సంయోగం

మోహన్ వల్లభజోశ్యుల

సంయోగం
మోహన్ వలభజోశ్యుల
---

యిల జీవ ఆత్మల సంయోగ సమరము యేమండి..యిల...

ఆదిలొ యంతయు తానై యుండి, తన వైభవమే గాంచగనెంచీ,
మహామాయనె మనసున నింపీ..అ అ ఆ..
ఇంద్ర జాలమునె జోడీ జేసి, వైవిధ్యమునొందె పరమాత్మ...యిల...

కర్మ క్షేత్రమౌ భువి వర్ఢిల్లి, ఐహిక జ్ఞానమె అహమును పెంచగ,
స్వరూప ధ్యాసయె మరుగున పడగా..అ అ ఆ..
తన ధర్మమె సృష్ఠిలొ ద్రష్ఠగ మిగలగ, వియోగ వేదనె బతుకును నింపగ...యిల..

ఇంద్రియవలను చేధించినగాని, అహమె పూర్తిగ హరించినగాని,
మాయాశక్తిని మించగతరమా..అ అ ఆ..
యోగాభ్యాసము చేయగ నగునా, చెయ్యక తొలగున కల్గిన ఖేదము..యిల..

శ్వాస రూపమున శక్తిని యిస్తూ, సోహం అంటూ శబ్ధం చేస్తూ,
నేనే ఉన్నా భయమే యెందుకూ..అ అ ఆ..
హంసో అంటూ నన్నే తలచిన, కలుతుము మనము వొకటిగ మళ్ళీ...యిల..

శ్వాసయె హనుమదౄపము కాగా,అహఁమె రావణుడై నిలువంగా,
హంసాభ్యాసమె రామభాణము కాగా..అ అ ఆ..
జీఁవియె జానకి వలె స్వస్వరూపము నొందే, తఱుఁణమె సమరాంత సమయము...యిల..


వరస: "సీతారామ కళ్యాణం" లో "సీతా రామ కళ్యాణం చూతము రారండి"


#maa telugu talliki mallepU daMDaa#

Back to list