Creative works from Telusuna Members

vasanta sundari

durgAprasAdu vAraNAsi

వసంతసుందరి

దుర్గాప్రసాదు వారణాసి
(24 మార్చి 2007)

ప్రకృతీమాతయే ప్రదర్శించెనో
శ్రీకృష్ణ పరమాత్మ అవతరించేనో
ఈనాడు ఈరీతి ఇటువంటిభాగ్యమ్ము
మనకేలకల్గెనో నేనెరుగలేనయ్య

వసంతసుందరి వచ్చినదీఘడియ
తెచ్చిందీవేళ తీయనిదదియెల్ల
తనువులే పులకింప, మనసులే విభవింప
ఉగాది నేడొయి, జగాలకే సుఖమోయి

చక్కని తల్లి సౌందర్యవతి
ప్రకృతిమాత ఈదినమోయీ
అమ్మ కౌగిటను ఊగిలలూగుచు
సుఖమునుబొందే సమయమునేడను
అమాయక హృదయుడ నేననవోయీ

ఇది వసంతం, ఇది ప్రశాంతం
ఇదియే మనదగు సౌభాఘ్యం
భాగ్యంబిదిరా, భవ్యంబిదిరా
ఇది ఉగాదిరా, ఇది మనదేరా


#vasantasundari

durgAprasAdu vAraNAsi
(24 mArci 2007)

prakRtImAtayE pradarSimcenO
SrIkRshNa paramAtma avatarimcEnO
InaaDu Ireeti iTuvanTibhAgyammu
manakElakalgenO nEnerugalEnayya

vasantasundari vaccinadIghaDiya
teccindeevELa teeyanidadiyella
tanuvulE pulakimpa, manasulE vibhavimpa
ugAdi nEDoyi, jagAlakE sukhamOyi

cakkani talli sowmdaryavati
prakRtimaata IdinamOyI
amma kowgiTanu oogilaloogucu
sukhamunubondE samayamunEDanu
amAyaka hRdayuDa nEnanavOyI

idi vasantam, idi praSAntam
idiyE manadagu sowbhAghyam
bhAgyambidirA, bhavyambidirA
idi ugAdirA, idi manadErA

Back to list