Creative works from Telusuna Members

డంభమా...

మోహన్ వల్లభజోశ్యుల

డంభమా?
మోహన్ వల్లభజోశ్యుల
---

డంభమా, మది భారమె పోఁవు మార్గమా,
భక్తిభావ బాహ్యరూపమా, ఔదార్యమా?
...డంభమా...

బతుకే నీకనె, భారమె నీదనె, నీ కఱుణే నా భాగ్యమనే,
భావావేశమె ప్రేరణ యయిన, నిజముగ నివియే కాఱఁణమయినా
అహర్నిశము అత్యాశలతో ఆర్జనలెందుకు,
కఱుఁవే తెలియని ఆ శ్రీపతియె,
కఱుఁణతొ నొసఁగిన సిఱుఁల కానుకలంటూ అర్పణ లెందుకు,
శ్రద్ధఁగ మదిఁ దలఁచిన చాలదా
...డంభమా...

బట్టల జిలుగులు నగల మెఱుఁపులు భక్తిశ్రద్ధల సామ్యము గాలేఁవు
సంభావనలు సంతర్పణలు వినయ వికాశముల సాటివి గాబోఁవు
తప్పక తరఁచుగ కోవిఁలకేగిన, విరివిగ విధిగా వ్రతాలె చేసినా,
బాధలు పోవున నిక్కముగ, దేవుఁడె మెచ్చున నిఖరముగా
మదిలో అహమే కాపురముండగా
...డంభమా...


వరస అనుకరణ: "శంకరాభరణం" లొ 'శంఖరా..'



#maa telugu talliki mallepU daMDaa#

Back to list