Creative works from Telusuna Members

తలయె నెరిసిన...

మోహన్ వల్లభజోశ్యుల

తలయే నెఱిఁసిన..
మోహన్ వల్లభజోశ్యుల
---

తలయె నెఱిఁసిన కలతేల నీకోయ్, తెలివేమి పోదోయ్
సిరినే కోఱి శిరమే వంచక, మాఁనమె మేలనుకోవోయ్..తలయె..

సౌధాలు యున్న శ్రీమంతులార, నవయుగ నిర్ణేతలారా
కడలే కదిలె కాలుష్యము, మీ కౌశల్యమిక కొఱఁగానిదోయ్..తలయె..

అణ్వాస్త్రమె ఆయుధమైన, యుగాంతమె ఆరంభమోయ్
పుడమే రగిలె ప్రమాదము, పరివర్తనె మనదారోయ్..తలయె..


వరస అనుకరణ: పాత "దేవదాసు" లో "కుడియెడమైతె"


#maa telugu talliki mallepU daMDaa#

Back to list