Creative works from Telusuna Members

సంస్కారమీయని...

మోహన్ వల్లభజోశ్యుల



.సంస్కారమీయని.
మోహన్ వల్లభజోశ్యుల
---

సంస్కారమీయని చదువెందుకూ
సర్వేశు దెలుపని తెలివెందుకూ..సంస్కార..

ఆనాటి విద్యలు వికాశానికే, ఈ రోజు చదువంత విత్తానికే
శాణ్ణాళ్ళ శ్రమయంత స్వార్ధాలకా, మన సౌఖ్యాలకా.

కళలన్ని యుండేవి దైవానికై, వాడేము ఈనాడు మనకీర్తికే
సౌందర్యమేమొ కఱుఁవాయలే, ధనకాంక్ష వీటిని నడిపేనులె..సంస్కార..

పాండిత్య మున్నంత పనికాదులే, తెలివున్న, తలరాత తప్పిపోదులే
విశ్వాన్ని వకటిగా కాంచాలిలే, నువు నమ్మాలిలే

ఆనాటి విద్యలే మిగిలేనులే, పరమేశుఁ దెలిసే దినమొచ్చులే


వరస అనుకరణ: పాత "ఛిరంజీవులు" లో "కనుపాప కరువైన.."



#maa telugu talliki mallepU daMDaa#

Back to list