ఔనా, నిజమేనా? మోహన్ వల్లభజోశ్యుల --- ఔనా, నిజమేనా... మాటలందే మహిమయున్నా, చేతలందే చేవయున్నా యోచనలె యోగ్యమయిన, నాదు గొప్పతనమేనా ఈశ్వరేచ్చ ఫలమేనా?...నేనా, నువ్వేనా?... ఔనా, కలయేనా.. నేను ఉన్నానన్న నిజము, యెండమావి తీరేనా ఉన్నదంతా నీవెయైన, నా యునికి వైనము భ్రమయేనా?..అవును, నువ్వేలే.. ఔనా, నిజమేనా?... శ్వాసలోని శక్తియంతా, చిత్తమందు చేతనంతా భాషలోనె భావమున్నా, ఈ శరీర ప్రతిభేనా, భగవత్తేజ ప్రభావమేనా...నేనా, నువ్వేనా... ..ఔనా, కలయేనా.. నిన్ను నువ్వె జూఁడనెంచి అన్ని రూపముల నొందినావా మాయలేక నేను లేనా, సృష్ఠి సర్వము నీ కలపనేనా..అవును నువ్వేలే.. ..ఔనా, నిజమేనా. వేరు వేరుగ మనమె యున్న, వియోగ స్థితియె దుఃఖ్ఖమైన తెలివి వచ్చిన తెల్లమౌనా, లోకము స్వప్నతుల్యమనీ, నా అహఁమె ఇహముగ దోచెనని ... నేనా, నువ్వేనా... వరుస అనుకరణ: "మల్లేశ్వరి" లో 'ఔనా నిజమేనా' |
#ఔనా, నిజమేనా? మోహన్ వల్లభజోశ్యుల --- ఔనా, నిజమేనా... మాటలందే మహిమయున్నా, చేతలందే చేవయున్నా యోచనలె యోగ్యమయిన, నాదు గొప్పతనమేనా ఈశ్వరేచ్చ ఫలమేనా?...నేనా, నువ్వేనా?... ఔనా, కలయేనా.. నేను ఉన్నానన్న నిజము, యెండమావి తీరేనా ఉన్నదంతా నీవెయైన, నా యునికి వైనము భ్రమయేనా?..అవును, నువ్వేలే.. ఔనా, నిజమేనా?... శ్వాసలోని శక్తియంతా, చిత్తమందు చేతనంతా భాషలోనె భావమున్నా, ఈ శరీర ప్రతిభేనా, భగవత్తేజ ప్రభావమేనా...నేనా, నువ్వేనా... ..ఔనా, కలయేనా.. నిన్ను నువ్వె జూఁడనెంచి అన్ని రూపముల నొందినావా మాయలేక నేను లేనా, సృష్ఠి సర్వము నీ కలపనేనా..అవును నువ్వేలే.. ..ఔనా, నిజమేనా. వేరు వేరుగ మనమె యున్న, వియోగ స్థితియె దుఃఖ్ఖమైన తెలివి వచ్చిన తెల్లమౌనా, లోకము స్వప్నతుల్యమనీ, నా అహఁమె ఇహముగ దోచెనని ... నేనా, నువ్వేనా... వరుస అనుకరణ: "మల్లేశ్వరి" లో 'ఔనా నిజమేనా' # |