Creative works from Telusuna Members

eemanukonte

mohan vallabhajosyula

ఏమనుకొంటే
మోహన్ వల్లభజోశ్యుల
---

ఏ మనుకొంటే ఏ మవుతుందో యెవరికి యేంతెలుసు
నేనే యెంతో మేలే చేసే ననుకొంటె, జరిగెను యెంతొ హానీ...
నేనేం చెయ్యను, యెలాగ చెయ్యను, చేసేందుకు నే సిద్ధమూ..యేమనుకొంటె..

అంధకారమూ, అదృశ్యమూ
వివాహమె పరమావధి అనుకుంటే, పరిహాసమే విధి చేసినదీ
అనుభవమే నిరుపయోగమే యైనా, నేనేం చేసెదనూ..
మానాన్నే కాదనుకొని శరణే కోఱెదనూ...ఏమనుకుంటె..

అభిమానమో, అహంకారమో
ఉదాసీనతె మేలని ఊరక మనముంటె, అనురాగమె మది లేదనిపించే
చెప్పినదంతా స్వార్ధమె అనుకుంటే, యెవరేం చేసెదరూ
విధినే నమ్మి, కాలాని కొదిలి యూరక నే నుండెదనూ..ఏమనుకుంటే..

వరస అనుకరణ: గురుదత్త్ గారి "ప్యాసా" లో "జానెబు కైసే"

#
ఏమనుకొంటే
మోహన్ వల్లభజోశ్యుల
---

ఏ మనుకొంటే ఏ మవుతుందో యెవరికి యేంతెలుసు
నేనే యెంతో మేలే చేసే ననుకొంటె, జరిగెను యెంతొ హానీ...
నేనేం చెయ్యను, యెలాగ చెయ్యను, చేసేందుకు నే సిద్ధమూ..యేమనుకొంటె..

అంధకారమూ, అదృశ్యమూ
వివాహమె పరమావధి అనుకుంటే, పరిహాసమే విధి చేసినదీ
అనుభవమే నిరుపయోగమే యైనా, నేనేం చేసెదనూ..
మానాన్నే కాదనుకొని శరణే కోఱెదనూ...ఏమనుకుంటె..

అభిమానమో, అహంకారమో
ఉదాసీనతె మేలని ఊరక మనముంటె, అనురాగమె మది లేదనిపించే
చెప్పినదంతా స్వార్ధమె అనుకుంటే, యెవరేం చేసెదరూ
విధినే నమ్మి, కాలాని కొదిలి యూరక నే నుండెదనూ..ఏమనుకుంటే..

వరస అనుకరణ: గురుదత్త్ గారి "ప్యాసా" లో "జానెబు కైసే" #

Back to list