ఎవరి కెవరు సొంతము యీవింత జగతిలో రాదు రాదు సుంతము, భ్రాంతి అంత మోహము. || ఎవరి|| 1. భార్య రాదు, భర్త రాడు నీ చివరి ఘడియలో రారు కన్న తల్లి, తండ్రే , రారు పుత్ర పౌత్రులు, వారలకై ఆరాటము, విత్తము కై పోరాటము, వర వెంకట పతి నామము వెరవరికే సొంతము. || ఎవరి|| 2. తనువులపై ఎందులకు తగని యీ మోహము, మేనాలు మిద్దెలు మిగులునవా గాంచుము, ప్రాణాలు వున్నపుడే పొందుము పరమార్ధము అనుకొన్న అచ్యుతుని ఆశ్రయమే సొంతము. || ఎవరి|| 3. వ్యర్ధమైన వ్యామోహము వీడుమిక శాంతము అర్ధముకై చేయకు అకృత్యపు కార్యము, స్పర్ధలన్న సంకుచితము, సమభావమే దివ్యము స్వార్ధము విడనాడిన సంతసమే సొంతము. || ఎవరి|| 4. మనసులోన మాధవుని మరువకుండ కొల్వుము ధ్యానములో దివ్యమైన అనుభవము గాంచుము పనిలోన, పాటలోన పరమాత్ముని తల్చుము విను వెంకటపతి యిచ్చే వరములు నీ సొంతము. || ఎవరి|| చాకలకొండ రమాకాంతరావు Cincinnati, OH USA, May 18, 2006 |
#maa telugu talliki mallepU daMDaa# |