Creative works from Telusuna Members

Bhagavathamu1

Ramakantha Rao Chakalakonda

పరమార్ధ సాధకము భాగవత పఠనము
పరమపద దాయకము భాగవత శ్రవణము. ||పరమ||

1. యిహ పర సౌభాగ్య ఈప్సితార్ధ ప్రదము
శ్రీహరి చరితము సర్వ మంగళ కరము
మోహ భంజకమిది మహాభాగ్యదాయకము
సహన, శాంతి గుణ సంప్రాప్త కరము. ||పరమ||

2. శోక సంహరము, సుఙ్ఞాన దాయకము
పాకారి ప్రముఖులకు పరమ ప్రియము,
వికల హృదయములకు విశ్రాంతి దాయకము
అకళంకుని చరిత ఆనందకరము. ||పరమ||

3. బహుజన రంజకము, భావగర్భితము
త్రాహి యను హృదయముకు తప్త నాశకము
సోహ మని తెలిపెడి సత్వ గుణ సారము
దేహ మోహ రహిత పరీక్షా పేక్షము. ||పరమ||

4. కామ, క్రోధ, మద కలుష ప్రక్షాళకము
రోమాంచితము రామ కృష్ణ చరితం
తామస భంజకము తత్వ ప్రభోధము
సోమక హరు చరిత సంతోషజనకము. ||పరమ||

5. వేద వృక్షాఫలము, శుక యోగ వర్ణితము
మధుర వైరాగ్య రస మాధుర్య జనకము,నా
రద ప్రేరితము, నాదమయ సజ్జితము
వేద వ్యాస మౌని విరచిత కావ్యము. ||పరమ|

రమాకాంతరావు చాకలకొండ
March 01, 2007 Cincinnati, OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list