Creative works from Telusuna Members

Bhagavathamu2

Ramakantha Rao Chakalakonda

పల్లవి. భాగవత పఠనమే బ్రహ్మ ఙ్ఞాన యోగం
భక్తులకు బహు దివ్య సుగమ మీమార్గం || భాగవత||

అనుపల్లవి. నారద ప్రేరిత, వేద వ్యాస లిఖితి
పరమ పవిత్ర పావన మీ గ్రంధం. || భాగవత||

1. భక్తిని పెంచును, భవిత మార్గము చూపు <-- (భా)
మక్తి ని చేకూర్చు మహా దివ్య గ్రంధం,
రక్తిగా ఙ్ఞానమను రత్నమును అందించు, అను <-- (గ)
రక్తిగా దీని అర్దమును గొనిన. || భాగవత||

2. వైరాగ్యము పెంచి, విఙ్ఞానము గూర్చి <-- (వ)
నిర్మలము చేయును నరులనీ గ్రంధం,
పర తత్వము తెలిపి పావనము చేయును, వి <-- (త)
వరింప దీని కధ ఎవ్వరికి తరము. || భాగవత||

3. జీవిని కొనిపోవు ముక్తి ద్వారము కడకు , <-- (ము)
నావ యిది నిజముగ నిర్వాణ సాధనకు,
త్రోవ యిది ఎరిగిన తిరుమలేశుని కడకు
భావింపగ యిదే బహు జనాశ్రితము. || భాగవత||

"Bha-Ga-Va-Ta-Mu" may be considered as the five elements, five senses, five sheaths or pranakoshas and five life breaths.
Bha - Bhakthi or devotion.
GA - Jnana or wisdom.
VA - Vairagya or renunciation.
TA - Tatwam or realisation.
MU - Mukti or liberation.

రమాకాంతరావు చాకలకొండ
Friday, March 02, 2007 Cincinnati, OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list