Creative works from Telusuna Members

Bhagavathamu3

Ramakantha Rao Chakalakonda

||పల్ల|| భాగవతము విన్న బాగవుదుము
భగవంతుని రూపు కనుగొందము || భాగ ||

||అను|| పంచాక్షరంబులలో పొందు బరచిన నీతి
చేవగా కనుగొని చేకోందుము || భాగ ||

1. అవగుణములన్నిటిని అంతరింపజేయు
భాగవత సారమే భవహర వైద్యము
విన్న వినిపించిన, వివరణ జేసిన
వెంకటేశుని శరణు యిక తధ్యము || భాగ ||

2. ‘భా’ యన్న భక్తికి, బంధముల ముక్తికి
సూచనను సూక్ష్మము కనుగొందుము,
‘గ’ యన్న జ్ఞానము, సున్నిత సుజ్ఞానమని
చిత్తమున గ్రహియించి చేగొందుము || భాగ ||

3. ‘వ’ యన్న వైరాగ్య విహిత వైభోగము
వేదముల సారమని గ్రహియింతుము,
‘త’యన్న తపమని, తత్వచింతనయని
తెలియగనే తమమును త్రుంచివేసెదము || భాగ ||

4. ‘మ’యన్న ముక్తని మానవ గమ్యమని
మదిలోన చెరగని ముద్ర వేసెదము,
భక్తి, జ్ఞానములతో, వైరాగ్య, తపములతో
ముక్తిగాదా మన ముంజేతి ఫలము || భాగ ||


#maa telugu talliki mallepU daMDaa#

Back to list