|| పల్ల|| కష్టములు తొలగించు, యిష్టములు తీర్చెడి కల్పవృక్షము యీ భాగవత రాజము || కష్టములు|| 1. కల్మషములు కడిగి నిర్మలము జేయును అలజడులు తొలగించి యాత్మ ధైర్యము గూర్చు మలినములు తుడిచేసి మనశ్శాంతిని దెచ్చు గ్రంధముల సారమీ భాగవత గ్రంధము || కష్టములు|| 2. సింహ గర్జన విని పరుగిడే హరిణిలా గంగ ప్రవాహమున గడిగిన శిలలా ప్రభంజనా యలజడికి కూలిన మానులా భాగవత పఠనతో సమయు పాపములు || కష్టములు|| 3. చిలక చెప్పిన ముద్దు చక్కని పలుకులా కల్పవృక్షము వద్ద కోరిన కోర్కెలా, కామధేనువు చెంత యడిగున వరముల తీర్చునిది యిహపర సర్వ కామములు. || కష్టములు|| 4. భాగవతము విను, పఠియించు వారికి భాగవతమందరికి విని పించు వారికి, భాగవత గ్రంధము బట్టిన వారికిని భవ బాధలు తొలగి బ్రతుకి యీడేరు. || కష్టములు|| |
#maa telugu talliki mallepU daMDaa# |