Creative works from Telusuna Members

Bhagavathamu5

Ramakantha Rao Chakalakonda

వినిపింతు గానము వీనుల విందుగ
వినరండో విమల గుణ చరితులార || విని ||

5. తొలుత బ్రహ్మకు జెప్పె తోయజ నాభుడు
నాల్గు శ్లోకములలో నిశితముగను,
ఆపరి నారద ప్రముఖులెందరి వలనో
అందరికి విదితమీ భాగవతము || విని ||

6. నిస్పృహ చిత్తుడై నలుగు వ్యాసుని గాంచి
నారదముని యతని నలత దూరము జేయ,
నారాయణుని కధలు ఒక చోటగా జేర్చి
భాగవతము వ్రాయమని బోధించెను || విని ||

7. వ్యాస భాగవత చరితమును గైకొని
తేనే పట్టుగ మలచె తెలుగు తేనీగ,
ఆ తేనే పట్టునే అందిచ వచ్చాడు
సుశీల రాముల సుజన సుతుడు. || విని ||


#maa telugu talliki mallepU daMDaa#

Back to list