నరుడు, నారాయణుడు వేరు వేరు కారు, ఎఱుకున్న వారికి ఒక్కరే వీరు. ||నరుడు|| 1. హృదయమున్న వాడు హరికి సమానుడే, ఎదలోన ప్రేమున్న ఏడుకొండల వాడే, మదిలోన మమతున్న మాధవుడు వాడే, యిది ఎఱిగిన వాడు ఈశ్వర తుల్యుడే. ||నరుడు|| 2. సత్య, శాంతములున్న సత్యనారాయణుడే, నిత్య త్యాగ శీలే నిజముగ శ్రీధరుడు, భూత దయ గలవాడే భూధరుడు విష్ణువు, ఆత్మయోగి వాడు, అచ్యుత రూపుడే. ||నరుడు|| 3. చెలిమి చూపే వాడు చక్రి సమానుడే, మాలిమున్న వాడే మాధవ శ్యాముడు. మేలు చేసేవాడే మహిన మధుసూదనుడు, తాల్మి చూపేవాడే తిరుమలేశ్వరుడు. ||నరుడు|| చాకలకొండ రమాకాంతరావు, Tuesday, May 29, 2007 Cincinnati, OH USA |
#maa telugu talliki mallepU daMDaa# |