Creative works from Telusuna Members

AndaruCheredi

Ramakantha Rao Chakalakonda

అందరూ చేరేది ఆ గమ్యమే,
ముందు వెనుక కొంత వ్యత్యాసమే. ||అందరూ||

1. సిరులతో తులతూగు సంపన్నులైన,
మరుని అందము బోలు మోహనులు యైన,
ధరణి సంపదలేలు రారాజులైన, చి
వరకు చేరేది ఆ తీరమే. ||అందరూ||

2. కూడు, గుడ్డ లేని కడు పేదలైన,
గూడు, ఊరు, గతి లేని వారైన,
వాడలో భిక్షముతో బ్రతుకును సాగించు,
బడుగు బీదలకైన అది గమ్యమే. ||అందరూ||

3. పేదలు, ధనికులు, పాప, పుణ్యలకైన
వ్యాధులు, బాధలు, వేదనలు తోలగించి
మోదమును కల్గించు మాధవుని చరణమే
శోధించ జగతిన తుది గమ్యమే. ||అందరూ||

రమాకాంతరావు చాకలకొండ
May 30, 2007 Cincinnati, OH USA


#maa telugu talliki mallepU daMDaa#

Back to list